రైతుగా మారిన ధోనీ.. రాంచీలో సేంద్రీయ వ్యవసాయం.. వైరల్ వీడియో

బొప్పాయి తర్వాత తొలిసారి పుచ్చకాయ పంటను సేంద్రీయ పద్దతితో పండిస్తున్నానని పేర్కొన్నాడు ధోనీ. కొబ్బరికాయను కొట్టి పుచ్చకాయ విత్తనాలు నాటి సాగును ప్రారంభించాడు.

news18-telugu
Updated: February 27, 2020, 12:00 PM IST
రైతుగా మారిన ధోనీ.. రాంచీలో సేంద్రీయ వ్యవసాయం.. వైరల్ వీడియో
పుచ్చకాయ విత్తనాలను నాటుతున్న ధోనీ
  • Share this:
క్రికెట్ మైదానంలో ఇన్నాళ్లు మెరుపులు మెరిపించిన ధోనీ.. ఇప్పుడు వ్యవసాయ క్షేత్రంలోకి దిగాడు. బ్యాట్ పట్టిన చేత్తోనే విత్తనాలు నాటుతున్నాడు. అవును.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. రైతుగా మారాడు. రాంచీలోని తన వ్యవసాయక్షేత్రంలో పుచ్చ కాయలు, బొప్పాయి పంటని పండిస్తున్నాడు. ఈ వీడియోను స్వయంగా ధోనీయే షేర్ చేశాడు. బొప్పాయి తర్వాత తొలిసారి పుచ్చకాయ పంటను సేంద్రీయ పద్దతితో పండిస్తున్నానని పేర్కొన్నాడు ధోనీ. కొబ్బరికాయను కొట్టి పుచ్చకాయ విత్తనాలు నాటి సాగును ప్రారంభించాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు. మంచి పని చేస్తున్నారని కొందరు కామెంట్ చేస్తే.. మీరు గ్రేట్ మహీ అంటూ ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. బురద రాజకీయాల వైపు రాకుండా మీకు నచ్చినట్లుగా జీవించాలని సలహాలు ఇస్తున్నారు. సేంద్రీయ వ్యవసాయం మంచి ఆలోచన.. ఇందులో కూడా మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

2019 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచే ఎంఎస్ ధోనీకి చివరి మ్యాచ్. ఆ తర్వాత ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌లోనూ ధోనీ ఆడలేదు. ప్రపంచకప్ తర్వాత రెండు నెలల పాటు ఇండియన్ ఆర్మీకి సేవలు అందించాడు. ఆ తర్వాత జట్టులోకి వస్తాడని అందరూ భావించారు. కానీ అది జరగలేదు. తన పూర్తి సమయాన్ని కుటుంబానికే కేటాయించాడు. ఇక జనవరిలో టీమిండియా కాంట్రాక్ట్‌ నుంచి ధోనీని తప్పించడం చర్చనీయాంశమైంది. భారత జట్టులో మిస్టర్ కూల్ ప్రస్థానం ముగిసినట్టేనని ప్రచారం జరుగుతోంది. ఐతే ఐపీఎల్‌లో మాత్రం యథావిథిగా ఆడనున్నాడు ధోనీ. ఆ టోర్నీ కోసం ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.

First published: February 27, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading