MS Dhoni : టీమిండియా (Team India) మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni)కి బైకులన్నా.. కార్లన్నా ఎంతో ఇష్టమని అందరికీ తెలిసిన విషయమే. మార్కెట్లోకి వచ్చే కొత్త కార్లను.. బైక్ లను కొని తన గ్యారేజిలో పెట్టేంతవరకు నిద్రపోడు. ఇప్పటికే ఇతడి గ్యారేజిలో లెక్కలేనన్ని కార్లు, బైకులు ఉన్నాయి. తాజాగా ధోని మరో కారును కొనుగోలు చేశాడు. సౌత్ కొరియా కార్ల దిగ్గజం కియాకు చెందిన SUVని ధోని ఇటీవలె కొనుగోలు చేశాడు. పూర్తి ఎలక్ట్రిక్ కారు అయిన కియా ‘ఈవీ6’ (EV6)SUV కారును ధోని కొనేశాడు. ధోని కొనుగోలు చేసిన తొలి ఎలక్ట్రిక్ కారు ఇదే కావడం విశేషం. దీని ధర దేశీయ మార్కెట్లో రూ. 60 లక్షలు (దాదాపుగా) ఉంది.
ఇక ఈ కారును కొనుగోలు చేసిన తర్వాత ధోని చక్కర్లు కొట్టాడు. ఒక్కడే వెళితే మజా ఉండదనుకున్నాడో ఏమో.. టీమిండియా మాజీ ప్లేయర్ కేదార్ జాదవ్ తో పాటు ప్రస్తుత టీమిండియా మెంబర్ రుతురాజ్ గైక్వాడ్ తో కలిసి కొత్త కారులో రాంచీ వీధుల్లో చక్కర్లు కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
New Car in the house babyyy @msdhoni ????pic.twitter.com/73ZZMxF4hv
— Best of MS Dhoni. (@BestOfMSD) November 17, 2022
ప్రస్తుతం జరుగుతున్న దేశవాళి క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే వన్డే ట్రోఫీలో కేదార్ జాదవ్, రుతురాజ్ గైక్వాడ్ లు పాల్గొంటున్నారు. వీరిద్దరూ మహారాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందులో భాగంగా మ్యాచ్ ఆడేందుకు వీరిద్దరూ రాంచీ రాగా.. విరామ సమయంలో ధోనితో కలిసి అతడి కొత్త కారులో చక్కర్లు కొట్టారు. ధోని ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై పలికిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. ఇక కేదార్ జాదవ్ క్రికెట్ కెరీర్ దాదాపుగా ముగిసినట్లే. ప్రస్తుతం దేశవాళి క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. ఇక రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో టీమిండియాకు కూడా ఆడాడు. అయితే టి20 ప్రపంచకప్ కు ముందు దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ లో విఫలం అయ్యాడు. దాంతో న్యూజిలాండ్ పర్యటనకు.. బంగ్లాదేశ్ తో జరిగే వన్డే సిరీస్ కు ఎంపికవ్వలేదు. దేశవాళి టోర్నీతో పాటు వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ లో తన ఫామ్ ను నిరూపించుకుని టీమిండియాలోకి రావాలని పట్టుదలగా ఉన్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chennai Super Kings, Csk, Dhoni, Jharkhand, Kia cars, KIA Motors, MS Dhoni, Ranchi, Team India