Dhoni-Raina: ధోనీ, రైనా రిటైర్మెంట్‌తో షాక్‌లో ఫ్యాన్స్.. ప్రముఖుల ట్వీట్స్

మీరు భారత జట్టులో లేకున్నా మా గుండెల్లో ఉన్నారంటూ చాలా మంది ట్వీట్ చేశారు. బ్లూజెర్సీలో మిమ్మల్ని చూడలేకపోయినా.. ఐపీఎల్‌లో ఎల్లో జెర్సీలో మీరు చేసే సందడిని వీక్షిస్తామని కామెంట్ చేస్తున్నారు.

news18-telugu
Updated: August 15, 2020, 10:17 PM IST
Dhoni-Raina: ధోనీ, రైనా రిటైర్మెంట్‌తో షాక్‌లో ఫ్యాన్స్.. ప్రముఖుల ట్వీట్స్
సురేష్ రైనా, ఎంస్ ధోనీ
  • Share this:
స్వాతంత్ర్య దినోత్సవం వేళ భారత క్రికెట్‌లో ఊహించని కుదుపు చోటుచేసుకుంది. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీతో పాటు ఆల్‌రౌండర్ సురేష్ రైనా రిటైర్మెంట్ ప్రకటించడం సంచలనంగా మారింది. నిమిషాల వ్యవధిలోనే ఇద్దరూ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నారు. టీమిండియాలో ధోనీ, రైనా మంచి మిత్రులు.  వీరిద్దరు ఒకే రోజు క్రికెట్‌కు వీడ్కోలు పలకడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.  ముఖ్యంగా ధోనీ రిటైర్మెంట్‌పై సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ట్విటర్ వేదికగా స్పందించారు.  భారత జట్టుకు మీరు చేసిన సేవలు మరవలేనివని కొనియాడారు. మీ సారథ్యంలో టీమిండియా ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించిందని ప్రశంసలు కురిపిస్తున్నారు.




సోషల్ మీడియా వేదికగా వీరిద్దరి రిటైర్మెంట్‌పై ఫ్యాన్స్ కూడా ట్వీట్స్ చేస్తున్నారు. ప్లీజ్ వద్దు.. మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండని కోరుతున్నారు. సచిన్‌లాగే మీకు కూడా గొప్ప వీడ్కోలు పలకాలని కామెంట్స్ చేస్తున్నారు.










మీరు భారత జట్టులో లేకున్నా మా గుండెల్లో ఉన్నారంటూ చాలా మంది ట్వీట్ చేశారు. బ్లూజెర్సీలో మిమ్మల్ని చూడలేకపోయినా.. ఐపీఎల్‌లో ఎల్లో జెర్సీలో మీరు చేసే సందడిని వీక్షిస్తామని కామెంట్ చేస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: August 15, 2020, 9:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading