భారత్‌లో జరుగుతున్న రైతుల ఆందోళనలపై అమెరికా పాప్ గాయని రిహానా, యువ పర్యావరణవేత్త గ్రెటా థన్‌బర్గ్ సహా పలువురు అంతర్జాతీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందించిన విషయం తెలిసిందే. రెండు నెలలకు పైగా ఆందోళనలు చేస్తున్న రైతులకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఢిల్లీ సరిహద్దుల్లో 70 రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. సాగుచట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వీరికి విపక్షాలు మద్దతు తెలుపుతున్నాయి. రైతుల గోస పట్టదా..? అని కేంద్రంపై మండిపడుతున్నాయి. ఐతే ఇన్నాళ్లు మన దేశంలోనే దీని గురించి చర్చ జరిగింది. కానీ ఇప్పుడు అంతర్జాతీయంగానూ హాట్ టాపిక్‌గా మారింది. విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు రైతుల ఉద్యమంపై స్పందిస్తున్నారు. ఈ క్రమంలో వారికి కౌంటర్‌గా భారతీయ ప్రముఖులు కామెంట్ చేస్తున్నారు. ఇది మా దేశ అంతర్గత విషయం.. ఇందులో మీరు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. భారత సినీ ప్రముఖులు, క్రికెటర్లు, సెలెబ్రిటీలు కూడా #IndiaTogether #IndiaAgainstPropaganda వంటి హ్యాష్ ట్యాగ్‌లతో కేంద్ర ప్రభుత్వానికి మద్దుతుగా ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్యా రహానే, రోహిత్ శర్మ, రవిశాస్త్రి, అనిల్ కుంబ్లే, శిఖర్ ధావన్‌లు కూడా భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని ఇంటర్నేషనల్ సెలెబ్రిటీలకు సూచిస్తూ ట్వీట్లు చేశారు. అయితే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం ఇప్పటి వరకు ఈ విషయంపై స్పందించలేదు.
మాములుగానే సోషల్ మీడియాకు దూరంగా ఉండే మహీ.. రైతు ఉద్యమంపై జరుగుతున్న ట్వీట్ వార్‌ను కూడా పెద్దగా పట్టించుకోలేదు. అయినా ధోనీ పేరు ట్విటర్లో మారుమోగుతుంది. అయితే ధోనీ నిశబ్ధంగా ఉండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దేశంలోనే అత్యంత చర్చనీయాంశమైన ఈ ఘటనపై ధోనీ నోరు విప్పకపోవడాన్ని ఓ వర్గం విమర్శిస్తుంటే.. మరో వర్గం అతన్ని కొనియాడుతుంది. కొంత మంది మాత్రం ధోనీ ట్రెండింగ్‌లో ఉండటానికి కారణం అక్కర్లేదని ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. దీంతో ట్విటర్ వేదికగా #Dhoni ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతుంది.
He doesn't need a reason to trend at all ? @msdhoni | #MSDhoni | #Dhoni pic.twitter.com/nYYXKXXlNt
— DHONI Trends™ (@TrendsDhoni) February 4, 2021
Others - #Dhoni Will Tweat With Tag @msdhoni ~ Definitely Not ? pic.twitter.com/TNVGvC3RyM
— ⚒️?️ Sridhar Sri ?️⚒️ (@sridhar_sri__) February 4, 2021
#Dhoni#yuvi #SachinTendulkar
Everybody - waiting for Dhoni to tweet
Meanwhile Dhoni - pic.twitter.com/sUztQG4J7j
— Shaman? (@wittyshaman) February 4, 2021
People criticize #Dhoni for not tweeting anything
Meanwhile dhoni's love for country in real : pic.twitter.com/qvxpz8q9Oi
— Fun तंत्र (@neophyte420) February 4, 2021
"తీవ్ర చర్చనీయాంశమైన రైతుల దీక్షపై ధోనీ అభిప్రాయం కోసం సచిన్, కోహ్లీతో సహా ప్రతీ ఒక్కరు ఎదురు చూస్తున్నారు. కానీ అతను మాత్రం ఇవేవి పట్టించుకోకుండా హాయిగా నిద్రపోతున్నాడు" అని ఓ యూజర్ సెటైరిక్‌గా కామెంట్ చేశాడు. రైతులకు వ్యతిరేకంగా ట్వీట్ చేయమని జై షా ధోనీని ఆదేశించాడని, కానీ ధోనీ మాత్రం అలా చేయనని మొండికేసి కూర్చున్నాడని మరొకరు వ్యంగ్యస్త్రాలు సంధించారు. ధోనీ ట్రెండింగ్‌లో ఉండాలంటే కారణం అవసరంలేదని మరొకరు ట్వీట్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Farmers Protest, MS Dhoni, Trending