బ్యాటింగ్‌కు దిగిన ఎంఎస్ ధోనీ.. అందరికీ బిగ్ సర్‌ప్రైజ్

బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసం ప్రత్యేకంగా మెషీన్ తెప్పించుకున్నట్లు సమాచారం. రంజీ ఆటగాళ్లంతా రెడ్ కలర్ బాల్‌తో ప్రాక్టీస్‌ చేస్తే ధోని మాత్రం వైట్ బాల్‌తో సాధన చేశాడు.


Updated: January 17, 2020, 4:11 PM IST
బ్యాటింగ్‌కు దిగిన ఎంఎస్ ధోనీ.. అందరికీ బిగ్ సర్‌ప్రైజ్
ఎంఎస్ ధోనీ
  • Share this:
మాజీ కెప్టెన్ ధోనీని టీమిండియా కాంట్రాక్ట్‌ నుంచి తప్పించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీంయాశమైంది. భారత జట్టులో మిస్టర్ కూల్ ప్రస్థానం ముగిసినట్టేనా.. అని క్రీడాభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో జార్ఖండ్ డైనమైట్ ఎంఎస్ ధోనీ గ్రౌండ్‌లో మెరిసి అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు. కాంట్రాక్ట్ నుంచి తప్పించి బీసీసీఐ షాక్ ఇస్తే.. అదే రోజు మనోడు బ్యాట్ పట్టి అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు. గురువారం రాంచీలో మైదానంలో జార్ఖండ్ రంజీ టీమ్ సభ్యులతో కలిసి బ్యాటింగ్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు ధోనీ.

బ్యాటింగ్‌తో పాటు రెగ్యులర్‌ ట్రైనింగ్‌లో కూడా ఎంఎస్ ధోనీ భాగమైనట్లు జార్ఖండ్‌ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ వెల్లడించింది. ప్రత్యేక బౌలింగ్‌ మెషీన్‌ ద్వారా అతను సాధన చేశాడు. బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసం ప్రత్యేకంగా మెషీన్ తెప్పించుకున్నట్లు సమాచారం. రంజీ ఆటగాళ్లంతా రెడ్ కలర్ బాల్‌తో ప్రాక్టీస్‌ చేస్తే ధోని మాత్రం వైట్ బాల్‌తో సాధన చేశాడు. దాంతో అక్కడున్న రంజీ ఆటగాళ్లంతా ఆశ్చర్యపోయారు. ధోనీ గ్రౌండ్‌కి రావడంతో సంతోషం వ్యక్తం చేశారు.

ధోనీ వచ్చి మాతో ప్రాక్టీస్ చేస్తాడని మాకే తెలియదు. అతడు గ్రౌండ్‌లోకి రావడంతో అందరం ఆశ్చర్యపోయాం. ఇది చాలా సంతోషకరమైన విషయం. ధోనీ చాలా సేపు సాధన చేశాడు. మాతో కలిసి ఫీల్డింగ్ చేశాడు. మహీ క్రమంతప్పకుండా సాధనకు వస్తాడని అనుకుంటున్నాం.
జార్ఖండ్ క్రికెట్ సంఘం అధికారి


2019 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచే ఎంఎస్ ధోనీకి చివరి మ్యాచ్. ఆ తర్వాత ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌లోనూ ధోనీ ఆడలేదు. ప్రపంచకప్ తర్వాత రెండు నెలల పాటు ఇండియన్ ఆర్మీకి సేవలు అందించాడు. ఆ తర్వాత జట్టులోకి వస్తాడని అందరూ భావించారు. కానీ అది జరగలేదు. తాజాగా బీసీసీఐ కాంట్రాక్ట్‌ లిస్టులో ధోనీ పేరు రాకపోవడంతో అతడి అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఐతే అదే సమయంలో ప్రాక్టీస్‌లో పాల్గొనడంతో ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఐపీఎల్‌ కోసమే ధోనీ ప్రాక్టీస్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

First published: January 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading