ఎంఎస్ ధోనీ సంచలన నిర్ణయం... ప్లాన్ అదిరిందిగా...

M S Dhoni : ఓ మంచి ఉద్దేశంతో ధోనీ తీసుకున్న నిర్ణయంపై అటు అభిమానులు ఇటు దేశ ప్రముఖులు, ఆర్మీ నుంచీ పాజిటివ్ స్పందన వస్తోంది.

news18-telugu
Updated: December 10, 2019, 7:29 AM IST
ఎంఎస్ ధోనీ సంచలన నిర్ణయం... ప్లాన్ అదిరిందిగా...
ఎంఎస్ ధోనీ సంచలన నిర్ణయం... ప్లాన్ అదిరిందిగా...
  • Share this:
M S Dhoni : మీకు గుర్తుండే ఉంటుంది. ఆ మధ్య టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ... ఇండియన్ ఆర్మీలో చేరి... విధులు నిర్వహించాడు. రెండు వారాలపాటూ వాళ్లతోనే ఉండి... వాళ్ల కష్టాలు, దేశం కోసం వాళ్లు చేస్తున్న త్యాగాలూ అన్నీ కళ్లారా చూశాడు. మన కోసం అంత చేస్తున్న వాళ్ల కోసం మనం కూడా ఏదైనా చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించాడు. అప్పుడొచ్చిందో కొత్త ఆలోచన అదే టీవీ సిరీస్. టెరిటోరియల్‌ ఆర్మీ పారాచూట్‌ రెజిమెంట్‌లో గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో ఉన్న ఈ జార్ఖండ్ డైనమైట్... అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి పరమవీర చక్ర, అశోక చక్ర అవార్డులు సాధించిన ఆర్మీ అధికారుల జీవితాల్ని టీవీ షో ద్వారా ప్రపంచానికి చాటాలనుకుంటున్నాడు. వచ్చే సంవత్సరం ఈ షో ప్లే అవుతుంది. ప్రస్తుతం స్ర్కిప్ట్‌ వర్క్ జరుగుతోంది. స్టూడియో నెక్స్ట్‌, ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ లిమిటెడ్‌ కలిసి నిర్మిస్తున్న ఈ సిరీస్‌... సోనీ టీవీలో ప్లే కాబోతోందని తెలిసింది. ఓ మంచి ఉద్దేశంతో ధోనీ తీసుకున్న నిర్ణయంపై అటు అభిమానులు ఇటు దేశ ప్రముఖులు, ఆర్మీ నుంచీ పాజిటివ్ స్పందన వస్తోంది.

ప్రపంచకప్‌ సెమీస్‌ తర్వాత ధోనీ స్టేడియంలోకి రాలేదు. ప్రపంచకప్ తర్వాత జరిగిన వెస్టిండీస్‌ టూర్‌కి వెళ్లలేదు. కారణం సైన్యంలో పనిచెయ్యాలనే. ఆ తర్వాత జరిగిన దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ సిరీస్‌లకూ వెళ్లలేదు. ఇలా సిరీస్‌లకు దూరమైనా... టీవీ షో ద్వారా అందరికీ దగ్గరయ్యేందుకు వీలు కలగబోతోంది.

 

Pics : అమాయక చూపుల అందాల రాశి తేజశ్వి


ఇవి కూడా చదవండి :

 బీజేపీతో పెట్టుకుంటున్న జగన్... సక్సెస్ అవుతారా?

భర్తను చంపేందుకు భార్య స్కెచ్... ఆ తర్వాత...

పౌరసత్వ బిల్లుకు లోక్‌సభ ఆమోదం...

మిస్ యూనివర్స్‌ 2019... సౌతాఫ్రికా బ్యూటీ జొజిబినీ టున్జీ

పాము కాటేసినప్పుడు టీ తాగితే ఏమవుతుంది?
First published: December 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>