ఆ రోజు గుర్తుందా? ధోనీ ఆ మ్యాచ్‌‌లో రనౌట్ కాకపోయింటే..

MS Dhoni was run out

 • Share this:
  ఈ రోజు గుర్తుందా?. వర్డల్ కప్‌ 2019లో ఇండియా ఫైనల్‌కు చేరుతుందని భావించి కోట్లాది మంది భారతీయులు నిరాశ పడ్డ రోజు. గతేడాది వన్డే ప్రపంచకప్‌లో కివీస్‌తో జరిగిన సెమీఫైనల్లో భారత్ గెలిపిస్తుందని అంతా ఆశించి భంగపడ్డ సమయం ఇది. రవీంద్ర జడేజాతో కలిసి ధోనీ ఇండియాను గెలిపిస్తాడని అనుకున్నప్పటికి ఆఖర్లో ఇద్దరూ ఔటవడంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందిన రోజు ఇదే. 2019 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌పై గెలిచి సెమీఫైనల్‌లకు చేరిన భారత్.. ఫైనల్ చేరడం కోసం కీవీస్‌తో తలపడాల్సి వచ్చింది. జూలై 10 అంటే ఇదే రోజున న్యూజిలాండ్‌తో ఆడిన మ్యాచ్‌లో భారత్ 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇండియా గెలుస్తోందని అందరూ భావించనప్పటికి చివర్లో ధోనీ రన్నౌట్ అవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఫ్సాన్స్‌ను భంగపాటుకు గురిచేసిన ఆనాటి మ్యాచ్ విశేషాలను ఓసారి తెలుసుకుందాం.

  మెుదటి రోజు అడ్డంకిగా వర్షం

  జూలై 9న సెమీఫైనల్ మ్యాచ్‌ ప్రారంభమైంది. టాస్‌ గెలిచిన కీవీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ మ్యాచ్‌కి వరుణుడు అడ్డంకిగా మారాడు. న్యూజీలాండ్ 46.1 ఓవర్లలో 211/5 పరగుల వద్ద ఉన్న సమయంలో వర్షం రావడంతో మ్యాచ్‌ని మరుసటి రోజుకు వాయిదా వేశారు. తర్వాత రోజు బ్యాటింగ్ దిగిన కీవీస్ మిగిలిన ఓవర్లలలో 239-8 స్కోర్‌ చేసింది. భువనేశ్వర్ 3 వికెట్లు తీయగా మిగితా బౌలర్లు తలా వికెట్ తీశారు.

  కుప్పకూలిన ఇండియన్ బ్యాటింగ్ ఆర్డర్:

  239 పరుగుల ఛేదన కోసం బరిలోకి దిగిన భారత్ బాట్స్‌మెన్స్ ఒక్కరి తర్వాత ఒక్కరు టాప్‌ ఆర్డర్‌ మొత్తం పెవిలియన్‌ చేరింది. కివీస్‌ బౌలర్ల ధాటికి రాహుల్‌(1), రోహిత్‌ (1), కోహ్లీ(1)పరుగులతో వెనువెంటనే ఔటయ్యారు. రిషభ్‌పంత్(32), హార్దిక్‌ పాండ్య(32) ఆదుకునే ప్రయత్నం చేసినా ఎక్కువ సేపు నిలవలేకపోయారు. కేవలం 92 పరుగులకే ఆరు వికెట్లను కోల్సోయింది భారత్. తర్వాత ధోనీ(50), రవీంద్ర జడేజా(77) పరుగులతో 116 రన్స్ భాగస్వామ్యం జోడించారు. మంచి ఫామ్‌లోఉన్నవారిద్దరిని చూసి ఫ్యాన్స్ గెలుపు ఖాయమే అనుకున్నారు. కానీ జడేజా క్యాచ్ ఔటవ్వడం,ధోనీ గప్తిల్‌ త్రోకు రన్నౌటవ్వడంతో ప్రపంచ కప్‌లో భారత జట్టు ప్రయాణం ముగిసింది. ధోనీ రన్ అవుట్ కాకపోయింటే మ్యాచ్ గెలిచిదేమో అని అందరూ భావించారు. కానీ గప్తిల్‌ విసిరిన త్రో నేరుగా వికెట్లకు తగలడంతో ధోనీ రన్నౌటగా నిష్కమించాల్సి వచ్చింది. అనాటి మ్యాచ్ విశేషాలను గుర్తుచేస్తూ
  ఐసీసీ ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చెసింది.
  Published by:Rekulapally Saichand
  First published: