IND vs AUS 1st ODI: ఆదుకున్న ధోనీ, రోహిత్...అయినా కష్టాల్లోనే భారత్

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ, ధోనీ కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్నారు. హాఫ్ సెంచరీ పూర్తయ్యాక ధోనీ ఔటైనా రోహిత్ పోరాడుతున్నాడు.

news18-telugu
Updated: January 12, 2019, 4:11 PM IST
IND vs AUS 1st ODI: ఆదుకున్న ధోనీ, రోహిత్...అయినా కష్టాల్లోనే భారత్
ధోనీ, రోహిత్ శర్మ ( BCCI/ICC/ Twitter )
news18-telugu
Updated: January 12, 2019, 4:11 PM IST
సిడ్నీ వన్డేలో 289 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఆరంభం నుంచే తడబడింది. 4 పరుగులకే మూడు టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును ఓపెనర్ రోహిత్ శర్మ, ధోనీ ఆదుకున్నారు. సెంచరీ భాగస్వామ్యంతో భారత ఇన్నింగ్స్ చక్కదిద్దారు. ఆస్ట్రేలియా బౌలింగ్ ఎటాక్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొని క్రీజ్‌లో నిలదొక్కుకున్నారు. విరాట్ కొహ్లీ విఫలమవ్వడంతో పాటు రాయుడు, ధావన్ డకౌటవ్వడంతో చేజింగ్‌లో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. వన్ డౌన్‌లో వచ్చిన కెప్టెన్ విరాట్ కొహ్లీ సైతం విఫలమయ్యాడు. రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో స్టోయినిస్‌కు సునాయాస క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. వెంటనే అంబటి రాయుడు సైతం డకౌటయ్యాడు. రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో ఎల్బీగా ఔటై..పెవిలియన్ చేరాడు. దాంతో 4 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి భారత జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన ధోనీ, ఓపెనర్ రోహిత్‌తో కలిసి ఆచితూచి బ్యాటింగ్ చేశాడు. రోహిత్‌ తనదైన శైలిలోనే దూకుడుగా ఆడగా...ధోనీ డిఫెన్స్‌కే పరిమితమయ్యాడు. 82 బంతుల్లో హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 17 ఓవర్లలో భారత్ 50 పరుగుల మార్క్ దాటగలిగింది. రోహిత్ వన్డేల్లో 38వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 62 బంతుల్లో అర్థసెంచరీ మార్క్ దాటాడు. ధోనీతో కలిసి 136 బంతుల్లో సెంచరీ భాగస్వామ్యం జోడించి భారత్‌ను పోటీలో నిలిపాడు రోహిత్. 93 బంతుల్లో 68వ హాఫ్ సెంచరీ నమోదు చేసిన ధోనీ .ఔటయ్యాడు. ధోనీ-రోహిత్ నాలుగో వికెట్‌కు 171 బంతుల్లో 137 పరుగులు జోడించారు.






అంతుకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కంగారూ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. పీటర్ హ్యాండ్స్‌కూంబ్(73), షాన్ మార్ష్(54), ఉస్మాన్ ఖవాజా(59) హాఫ్ సెంచరీలతో ఆసీస్ టీమ్ కోలుకుంది. లోయర్ ఆర్డర్‌లో మార్కస్ స్టోయినిస్(47 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో ఆస్ట్రేలియా జట్టు 288 పరుగులు స్కోరు సాధించింది. చివరి 10 ఓవర్లలో ఆసీస్ బ్యాట్స్‌మన్లు 93 పరుగులు రాబట్టారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ చెరో రెండు వికెట్లు తీశారు.
First published: January 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు