ధోనీని ఘోరంగా అవమానించిన బీసీసీఐ..

Dhoni Retirement : ప్రతి ఏడాది క్రికెటర్లకు ఇచ్చే కాంట్రాక్టులో బీసీసీఐ ధోనికి చోటు ఇవ్వలేదు. దీన్ని బట్టి త్వరలోనే ధోని తన అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతాడని స్పష్టం అవుతోంది.

news18-telugu
Updated: January 16, 2020, 2:31 PM IST
ధోనీని ఘోరంగా అవమానించిన బీసీసీఐ..
ఎంఎస్ ధోనీ (File)
  • Share this:
ధోని రిటైర్మెంట్‌పై గత కొన్ని రోజులుగా కొనసాగతున్న సందిగ్ధతకు తెరపడిందా? అంటే అవుననే సమాచారం. త్వరలోనే వన్డే క్రికెట్‌కు ధోని గుడ్‌బై చెబుతాడని రవిశాస్త్రి ప్రకటించిన కొద్ది రోజులకే బీసీసీఐ ధోనికి, అతడి అభిమానులకు షాక్ ఇచ్చింది. ప్రతి ఏడాది క్రికెటర్లకు ఇచ్చే కాంట్రాక్టులో ధోనికి చోటు ఇవ్వలేదు. దీంతో.. రిటైర్మెంట్ ప్రకటించని ధోనీని బీసీసీఐ ఘోరంగా అవమానించిందని సోషల్ మీడియాలో అభిమానులు బీసీసీఐపై దుమ్మెత్తిపోస్తున్నారు. కాగా, ధోనికి కాంట్రాక్టు ఇవ్వకపోవడాన్ని బట్టి త్వరలోనే ధోని తన అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతాడని స్పష్టం అవుతోంది. వరల్డ్ కప్ తర్వాత ఒక్క మ్యాచ్ కూడా ఆడని ధోని.. అప్పటి నుంచి ఫ్యామిలీతోనే గడుపుతున్నాడు.

తాను రిటైర్మెంట్ తీసుకుంటానని ఇప్పటికే బీసీసీఐ పెద్దలకు ధోని సమాచారం ఇచ్చినట్లు, అందుకే బీసీసీఐ కాంట్రాక్టులో చోటు ఇవ్వలేదని తెలుస్తోంది. కాగా.. కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రాకు ఏ+ కాంట్రాక్టు, అశ్విన్, జడేజా, భువనేశ్వర్, పుజారా, రహానే, రాహుల్, ధవన్, షమి, ఇషాంత్, కుల్దీప్, పంత్‌కు ఏ కేటగిరి కాంట్రాక్టు.. సాహా, ఉమేశ్, చాహల్, పాండ్యా, మయాంక్‌కు బీ గ్రేడ్ కాంట్రాక్టు.. జాదవ్, సైనీ, చాహర్, మనీశ్ పాండే, విహారీ, శ్రేయాస్, వాషింగ్టన్ సుందర్‌కు సీ గ్రేడ్ కాంట్రాక్టు ఇచ్చింది బీసీసీఐ.

బీసీసీఐ కాంట్రాక్టు వివరాలు (Photo : www.bcci.tv)


బీసీసీఐ కాంట్రాక్టు వివరాలు (Photo : www.bcci.tv)
బీసీసీఐ కాంట్రాక్టు వివరాలు (Photo : www.bcci.tv)


బీసీసీఐ కాంట్రాక్టు వివరాలు (Photo : www.bcci.tv)


బీసీసీఐ కాంట్రాక్టు వివరాలు (Photo : www.bcci.tv)

First published: January 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు