IPL Dhoni: పాత ధోనిని చూడ‌బోతున్నామా..? ట్రైనింగ్‌లో శ్ర‌మిస్తున్న ధోని

Dhoni (File Photo)

ఈ సారి ఐపీఎల్ లో ధోని(Dhoni) బ్యాటింగ్ స్టామినా మ‌ళ్లీ చూడ‌బోతున్నామా.. అనిపించేలా ధోని క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఈ ఏడాది ఐపీఎల్(IPL) రెండో సెష‌న్ దుబాయ్‌(Dubai)లో ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ధోని ప్రాక్టీస్ వీడియోను సీఎస్ కే పోస్ట్ చేసింది.

  • Share this:
    ఈ సారి ఐపీఎల్ లో ధోని(Dhoni) బ్యాటింగ్ స్టామినా మ‌ళ్లీ చూడ‌బోతున్నామా.. అనిపించేలా ధోని క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఈ ఏడాది ఐపీఎల్(IPL) రెండో సెష‌న్ దుబాయ్‌లో ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జ‌ట్లు వారు తీవ్రంగా సాధ‌న చేస్తున్నారు. ధోని అభిమానులు ఐపీఎల్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. గత ఏడు ఐపీఎల్ మ్యాచ్‌ల‌లో ధోని కేవ‌లం 37 ప‌రుగులే చేశారు. దీనిపై ఇప్ప‌టికే ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. మ‌ళ్లీ ఆనాటి మెరుపులు చూడాల‌ని ఎదురు చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఐపీఎల్ రెండో సీజ‌న్(Session) ప్రారంభం అయ్యింది.

    ప్రాక్టీస్‌లో ఫుల్ ఫామ్‌లో ధోని..
    ఈ ఏడాది రెండో సెష‌న్ ఐపీఎల్ కోసం చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ తీవ్ర కస‌ర‌త్తులు చేస్తున్నాడు. నెట్స్‌లో భారీ షాట్ల‌తో త‌న బ్యాటింగ్ స్కిల్స్‌(Skill)ను ప్ర‌ద‌ర్శిస్తున్నాడు. ఈ సారి తొలివిడ‌త ఐపీఎల్‌లో ధోని పెద్ద‌గా రాణించ‌లేదు. ధోని అద‌ర‌గొడితే చూడాల‌ని ఫాన్స్ ఎదురు చూస్తున్న క్ర‌మంలోనే క‌రోనా కార‌ణంగా తొలివిడ‌త వాయిదా పడింది.

    RCB New Jersey: కొత్తలుక్ లో కోహ్లీ సేన.. మారిన ఆర్సీబీ జెర్సీ.. ఆ ఒక్క మ్యాచ్ కోసమే...


    త్వ‌ర‌లో రెండు సీజ‌న్ ప్రారంభం కానుంది. ఈ సీజ‌న్ కోసం ధోని తీవ్రంగా శ్ర‌మిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ట్రైనింగ్(Training) సెష‌న్‌లో సిక్స‌ర్ల వ‌ర్షం కురిపిస్తూ త‌న మున‌ప‌టి ఫామ్‌ను ప్ర‌ద‌ర్శిస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూ ఫ్యాన్స్‌లో మ‌రింత జోష్ నింపుతున్నారు.



    ఈ సారి చెన్నై సూప‌ర్ కింగ్స్ ప్ర‌త్యర్థుల‌కు క‌ష్టాలు త‌ప్ప‌వ‌ని స‌వాల్ విసిరేలా త‌న ఫామ్‌కు మెరుగులు దిద్దుకుంటున్నాడు.
    వీడియో పోస్ట్ చేసిన సీఎస్‌కే..
    రెండో సెష‌న్‌కు సంబంధించి సీఎస్‌కే ఆట‌గాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను సీఎస్‌కే త‌న అధికారికి ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్(Post) చేసింది. ఇందులో ధోని సీక్స్‌లు ఫోర్ల‌తో అల‌రిస్తున్నాడు. ధోని ట్రెడ్ మార్క్ షాట్ హెలికాఫ్ట‌ర్ షాట్‌(Helicopter Shot)ను ఆడుతూ ఆక‌ట్టుకొన్నారు. మాజీ బౌలింగ్ కోచ్ ఎరిక్ సిమ్మ‌న్స్ అంపైరింగ్ చేస్తుంటే ధోని త‌న‌దైన శైలిలో షాట్‌లు కొడుతున్నాడు. ఈ వీడియోను ట్విట్ట‌ర్‌(Twitter)లో పోస్ట్ చేశారు. ఇది చూసి ఫ్యాన్స్ సంబుర ప‌డ‌తున్నారు. ధోని ఫామ్‌లోకి వ‌చ్చాడ‌ని ఈ సీజ‌న్‌లో సీఎస్‌కే ఆట‌ను ఎంజాయ్ చేయొచ్చ‌ని కామెంట్లు(Comments) చేస్తున్నారు. ఆదివారం అంద‌రూ ఎంత‌గానో ఎదురు చూస్తున్న ముంబై - చెన్నై(Mumbai - Chennai) మ్యాచ్ ప్రారంభ‌మ‌వుతుంది. చూడాలి ధోని ఫ్యాన్స్‌ను ఎలా అల‌రిస్తాడో.
    Published by:Sharath Chandra
    First published: