ఐపీఎల్ లేకపోతే ఇక ధోనీ ఆట చూడలేమా.. ఫ్యాన్స్‌లో ఆందోళన

Rekulapally Saichand
Updated: July 9, 2020, 4:15 PM IST
ఐపీఎల్ లేకపోతే ఇక ధోనీ ఆట చూడలేమా..  ఫ్యాన్స్‌లో  ఆందోళన
  • Share this:
భారత క్రికెట్ యవనికపై అతను సాధించిన సుధీర్ఘ ప్రయాణానికి విరామం పలికే సమయం అసన్నమైంది. ఎంతటి ఘనులైన చివరకు నిష్కరమించక తప్పదు. ఇప్పుడు ఆ సమయం ధోనీకి వచ్చింది. గత కాలంగా ధోనీ రిటైర్‌మెంట్‌పై రకారకాల వార్తలు వినిపిస్తు్న్నాయి. 2019 వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో చివరి మ్యాచ్‌ ఆడాడు ఎమ్‌ఎస్. అంతర్జాతీ మ్యాచ్‌లకు దూరమై దాదాపు ఏడాది కావోస్తోంది. ఆట నుంచి విరామం ఇచ్చిన ఆయన కుటుంబంతో సేదతీరుతున్నాడు.

ఇప్పుడు ఇండియన్ టీం ఎలాంటి టూర్‌కు వెళ్ళే పరిస్ధితి లేదు. కావున ధోనీ కూడా జట్టుకు ఎంపిక అవకాశలు తక్కువగానే కనిపిస్తున్నాయి. ఇక త్వరలో జరగబోయే

ఐపీఎల్‌లో పైనే మహేంద్ర సింగ్ ధోనీ భవితవ్యం అధారపడింది.

మహీ ఆటకు దూరమై ఏడాది కావోస్తోంది. ఐపీఎల్‌ లో తన సత్తా  చాటి మళ్లీ భారత జట్టులో రీఎంట్రీ ఇస్తాడని  ఫ్యాన్స్ అశిస్తున్నారు. అయితే ఐపీఎల్ జరగుతోందా అనే మీమాంసలో అభిమానులు ఉన్నారు. ఒక్కవేళ ఐపీఎల్ జరగకపోతే ధోనీ ఆటను చూసే అవకాశం లేకపోలేదని వారు అనుకుంటున్నారు. ఐపీఎల్ లేకపోతే ధోనీ శాశ్వతంగా ఆటకు గుడ్ చేప్పుతాడని అందరూ భావిస్తున్నారు.

ధోనీ రిటైర్‌మెంట్ వార్తలపై ఆయన మేనేజర్‌ మిహిర్‌ దివాకర్‌ స్పందించారు. మహీకి ఇప్పుడప్పుడే రిటైర్మెంట్‌ ఆలోచనలు లేవన్నాడు. ఐపీఎల్‌ కోసం ఎమ్ఎస్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాడన్నారు. దాని కోసం చెన్నైలో సాధన కూడా మొదలుపెట్టాడని లాక్‌డౌన్ కారణంగా వెనిక్కి వచ్చారని తెలిపారు. లాక్‌డౌన్‌ ఎత్తేశాక సాధన‌ మొదలుపెడతాడని మిహిర్‌ స్పష్టంచేశారు.
Published by: Rekulapally Saichand
First published: July 9, 2020, 3:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading