హోమ్ /వార్తలు /క్రీడలు /

MS Dhoni : కొత్త లుక్ లో ధోని అదుర్స్.. ప్రాక్టీస్ కూడా షురూ.. ఇక ప్రత్యర్థులకు దబిడి దిబిడే

MS Dhoni : కొత్త లుక్ లో ధోని అదుర్స్.. ప్రాక్టీస్ కూడా షురూ.. ఇక ప్రత్యర్థులకు దబిడి దిబిడే

PC : TWITTER

PC : TWITTER

MS Dhoni : టీమిండియా (Team India) మాజీ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) కొత్త లుక్  లో అదుర్స్‌ అనిపిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ఇచ్చిన తర్వాత ధోని బయట పెద్దగా కనబడడం లేదు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

MS Dhoni : టీమిండియా (Team India) మాజీ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) కొత్త లుక్  లో అదుర్స్‌ అనిపిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ఇచ్చిన తర్వాత ధోని బయట పెద్దగా కనబడడం లేదు. కేవలం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) జరుగుతున్నప్పుడు మాత్రమే దర్శనమిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ధోని కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. మరో రెండు నెలల్లో ఐపీఎల్ 2023 సీజన్ ఆరంభం కానుంది. ఈ క్రమంలో ధోని మళ్లీ బ్యాట్ పట్టాడు. తన ప్రాక్టీస్ ను మొదలు పెట్టాడు. ఇటీవలే ధోని ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయింది. తాజాగా తన ప్రాక్టీస్‌ ముగించుకొని బయటకు వస్తున్న ధోని తెల్ల గడ్డం, నల్లజుట్టుతో సాల్ట్‌ అండ్‌ పెపర్‌ లుక​్‌లో అభిమానుల కంటపడ్డాడు.

ధోనీ ఇలా కొత్తగా కనిపించడం చాలా మందిని ఆకర్షించింది. నిజానికి ఒక రోజు ముందు కూడా ధోనీ ఫొటోలను కొందరు అభిమానులు తీశారు. కానీ దూరం నుంచి కావడంతో అతన్ని స్పష్టంగా గుర్తించలేకపోయారు. ఇక ధోనికి ఇదే చివరి ఐపీఎల్‌ సీజన్‌ అని మరోసారి ఊహాగానాలు మొదలయ్యాయి.

గతేడాది కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది. అయితే ఈసారి మాత్రం ధోనికి చివరి ఐపీఎల్‌ కానుందని చాలా మంది అభిమానులు జోస్యం చెబుతున్నారు. ఎందుకంటే ధోని ప్రస్తుత వయసు 41 ఏళ్లు. 42 ఏళ్ల వయసులోనూ అతడు క్రికెట్ ఆడేది అనుమానమే. కరోనా కారణంగా గతేడాది ఐపీఎల్ కేవలం మహారాష్ట్ర , గుజరాత్ , కోల్ కతాలకు మాత్రమే పరిమితం అయ్యింది. అయితే ఈ ఏడాది మాత్రం ఎప్పటిలానే దేశం మొత్తం ఐపీఎల్ మ్యాచ్ లు జరగనున్నాయి. దాంతో ధోని సొంత టీం (చెన్నై) ప్రేక్షకుల మధ్య ఐపీఎల్ కు గుడ్ బై చెప్పే అవకాశం ఉంది. ధోని సారధ్యంలో సీఎస్‌కే ఇప్పటివరకు నాలుగుసార్లు ఐపీఎల్‌ విజేతగా నిలిచింది. ఇక గతేడాది రవీంద్ర జడేజాకు నాయకత్వ బాధ్యతలు అప్పగించినప్పటికి అతను మధ్యలోనే వైదొలగడంతో తిరిగి ధోనినే జట్టును నడిపించాడు. గత సీజన్‌లో సీఎస్‌కే 14 మ్యాచ్‌లాడి నాలుగింటిలో మాత్రమే గెలిచి తొమ్మిదో స్థానంలో నిలిచింది.

First published:

Tags: Chennai Super Kings, Csk, Indian premier league, IPL, MS Dhoni, Ravindra Jadeja

ఉత్తమ కథలు