India T20 World Cup: టీం ఇండియా మెంట‌ర్‌గా ధోని.. భారత టీ20 ప్రపంచకప్‌ జట్టు ఇదే

(ధోని, కోహ్లీ)

టీం ఇండియా(Team India) అభిమానుల‌కు గుడ్ న్యూస్.. ధోని ఫ్యాన్స్ సెలబ్రేష‌న్ చేసుకొనే న్యూస్‌ను బీసీసీఐ ప్ర‌క‌టించింది. టీ20 ప్రపంచకప్‌ 2021లో టీమిండియాకు మెంట‌ర్‌గా మాజీ సారధి మహేంద్ర సింగ్‌ ధోనిని నియ‌మిస్తూ బీసీసీఐ(BCCI) ప్రకటించింది.

  • Share this:
    టీం ఇండియా(Team India) అభిమానుల‌కు గుడ్ న్యూస్.. ధోని ఫ్యాన్స్ సెలబ్రేష‌న్ చేసుకొనే న్యూస్‌ను బీసీసీఐ ప్ర‌క‌టించింది. టీ20 ప్రపంచకప్‌ 2021లో టీమిండియాకు మెంట‌ర్‌గా మాజీ సారధి మహేంద్ర సింగ్‌ ధోనిని నియ‌మిస్తూ బీసీసీఐ (BCCI) అధికారిక ట్వీట్ ద్వారా ప్ర‌క‌టించ‌ది. దీంతో ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ ఏర్ప‌డింది. యూఏఈ వేదికిగా అక్టోబ‌ర్ 17న టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌రుగ‌నుంది. ఈ టోర్న‌మెంట్‌కు 15మంది స‌భ్యుల‌తో భార‌త జ‌ట్టును బీసీసీఐ ప్ర‌క‌టించింది. దానితోపాటు ఈ టోర్న‌మెంట్‌కు టీం ఇండియా మెంట‌ర్‌గా మ‌హేంద్ర‌సింగ్ ధోనీని నియ‌మించింది. ఈ జట్టుకు విరాట్ కోహ్లీ(Virat Kohli) సారధ్యం వహించనుండగా, వైస్‌ కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ(Rohit Sharma) వ్యవహరించనున్నాడు.



    టీ20 జ‌ట్టు ఇదే..
    విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ(వైస్‌ కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌(వికెట్‌కీపర్‌), ఇషాన్‌ కిషన్‌(వికెట్‌కీపర్‌), హార్ధిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్‌ చాహర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, వరుణ్‌ చక్రవర్తి, బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమీ ఉన్నారు. స్టాండ్‌ బై ప్లేయర్స్‌గా శ్రేయస్‌ అయ్యార్‌, శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చహార్‌ ఎంపికైనారు.



    వ‌చ్చే ఏడాది ఇంగ్ల‌డ్‌తో సిరీస్‌..
    ఇంగ్లండ్‌లో ప్ర‌స్తుతం ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడుతున్న టీమిండియా వ‌చ్చే ఏడాది జులైలో మ‌రోసారి అక్క‌డ ప‌ర్య‌టించ‌నుంది. ఈ టూర్‌లో భాగంగా మూడు వ‌న్డేలు, మూడు టీ20లు ఆడ‌నుంది. వ‌చ్చే ఏడాది జులై 1న ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో టీ20 మ్యాచ్‌తో టీమిండియా టూర్ ప్రారంభ‌మ‌వుతుంది.

    Ind Vs Eng : రవిశాస్త్రి, విరాట్ కోహ్లీలపై బీసీసీఐ సీరియస్! ఆ ఘటనపై సమగ్ర దర్యాప్తు..




    ఆ త‌ర్వాత జూలై 3న ట్రెంట్‌బ్రిడ్జ్‌లో రెండో టీ20, జులై 6న ఎజియ‌స్ బౌల్‌లో మూడో టీ20 జ‌రుగుతుంది. ఇక జులై 9 ఎడ్‌బాస్ట‌న్‌లో తొలి వ‌న్డే, ఆ త‌ర్వాత జూలై 12న ఓవ‌ల్‌లో రెండోది, జూలై 14న లార్డ్స్‌లో మూడో వ‌న్డే జ‌రుగుతాయి. ఈ షెడ్యూల్‌ను ఇంగ్లండ్(England) క్రికెట్ బోర్డు ప్ర‌క‌టించింది. సాధారణంగా ప్ర‌తి ఇంగ్లండ్‌ పర్యటనలో టెస్ట్‌ల‌తో పాటు వ‌న్డే, టీ20 సిరీస్‌లు కూడా జ‌రుగుతుంటాయి. అయితే, ఈసారి కొవిడ్(Covid) కార‌ణంగా ప‌రిమిత ఓవ‌ర్ల సిరీస్‌ను త‌ర్వాత నిర్వ‌హిస్తున్నారు.
    Published by:Sharath Chandra
    First published: