ధోని పేరిట కుర్చీ.. 2011 ప్రపంచకప్‌లో మహీ కొట్టిన ఆ సిక్స్ గుర్తుందా..

2011 ప్రపంచకప్‌లో శ్రీలంక పేసర్‌ కులశేఖర బౌలింగ్‌లో కొట్టిన సిక్స్ ఎప్పటికి గుర్తుండిపోయేది. లాంగాన్‌ మీదుగా స్టాండ్స్‌లో పడేసిన ఆ దృశ్యం మరవరానిది.

Rekulapally Saichand
Updated: August 19, 2020, 6:22 PM IST
ధోని పేరిట కుర్చీ..  2011 ప్రపంచకప్‌లో మహీ కొట్టిన ఆ సిక్స్ గుర్తుందా..
ధోనీ
  • Share this:


హెలికాప్టర్ షాట్‌లతో బ్యాటింగ్‌లో అదరగొట్టి.. కళ్ళు చెదిరే స్టఫింగ్స్‌తో కీపింగ్‌లో సత్తా చాటి, చివరకు అభిమానులు మెప్పుపొందిన సారథిగా నిలిచాడు. ధోనీ..క్రికెట్ ఉన్నంత కాలం అతని పేరు గుర్తుంటుంది. ఓటమి అంచుల్లో ఉన్న జట్టును గెలిపించాలనే తపన అతన్ని ఫ్యాన్స్ గుండేల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసింది. చాలా సందర్భలాలో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడినప్పటికి కొన్ని ఇన్నింగ్స్ మాత్రం మైల్ స్టోన్‌గా నిలిచిపోయేలా చేసింది. అతను హెలికాప్టర్ స్టైల్‌లో బాదిన సిక్సర్స్

పదే పదే చూడాలనిపిస్తోంది.

వాటిలో ముఖ్యంగా 2011 ప్రపంచకప్‌లో శ్రీలంక పేసర్‌ కులశేఖర బౌలింగ్‌లో కొట్టిన సిక్స్ ఎప్పటికి గుర్తుండిపోయేది. లాంగాన్‌ మీదుగా స్టాండ్స్‌లో పడేసిన ఆ దృశ్యం మరవరానిది. ఎందుకేంటే చాలా రోజుల నిరీక్షణ అనంతరం టీమిండియాకు ప్రపంచకప్‌ను అందించిన షాట్‌ అది. అయితే ఇప్పుడు ఆ ఓ ప్రత్యేక గుర్తింపు దక్కనుంది. ఆ బంతి ఏ కుర్చీపై అయితే పడిందో.. దానిని ధోనికి అంకితం చేయాలన్న ఆలోచనలో ఉంది ముంబయి క్రికెట్‌ సంఘం .

ఇనాళ్ళు ఇండియన్ క్రికెట్‌కు చేసిన సేవకు గుర్తింపుగా ఆ సీటు ఏర్పాటు చేయాలని ఎమ్‌సీఏ సభ్యుడు సంఘానికి తెలిపాడు. బంతి ఎక్కడ పడిందో గుర్తించడం తేలిక అని దాన్ని ధోనీ పేరిట ఏర్పాటు చేయాలని ఎమ్‌సీఏను కోరాడు.
Published by: Rekulapally Saichand
First published: August 19, 2020, 6:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading