హోమ్ /వార్తలు /క్రీడలు /

Team India: బిర్యానీ కోసం ఆ హోటల్‌తో టీమిండియా క్రికెటర్ల గొడవ.. అందుకే అక్కడ ఉండరట..!

Team India: బిర్యానీ కోసం ఆ హోటల్‌తో టీమిండియా క్రికెటర్ల గొడవ.. అందుకే అక్కడ ఉండరట..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

IND vs AUS T20 Match: ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో చివరగా 2019 డిసెంబర్‌లో మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో భారత్ టీ20 తలపడింది. అప్పటి నుంచి మరో మ్యాచ్ జరగలేదు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  ఇవాళ హైదరాబాద్‌(Hyderabad)లోని ఉప్పల్ స్టేడియం (Uppal Stadium) వేదికగా ఇండియా, ఆస్ట్రేలియా మధ్య మూడో మ్యాచ్ జరగనుంది. రాత్రి ఏడున్నరకు మ్యాచ్ ప్రారంభవుతుంది. నిన్న సాయంత్రమే హైదరాబాద్ చేరుకున్న ఇరుజట్లు హోటల్స్‌లో బస చేశాయి. టీమిండియా ఆటగాళ్లు పార్క్ హయత్‌లో, ఆస్ట్రేలియా ఆటగాళ్లు తాజ్ క్రిష్ణలో ఉంటున్నారు. ఐతే ఈ రెండూ కాకుండా.. గతంలో టీమిండియా ఆటగాళ్లు నగరంలోని ఓ ప్రముఖ హోటల్‌లో బసచేసేవారు. కానీ బిర్యానీ వల్ల జరిగిన గొడవ కారణంగా దానికి కటీఫ్ చెప్పారు. 2014లో బిర్యానీ విషయంలో టీమిండియా, హోటల్ సిబ్బంది మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు పలు మీడియా సంస్థల్లో అప్పట్లోనే కథనాలు వచ్చాయి. దానిని ఎంస్ ధోనీ (MS Dhoni) సీరియస్‌గా తీసుకున్నారు. మరుక్షణం ఆలోచించకుండా హోటల్‌ను ఖాళీ చేసి.. వేరొక హోటల్‌కు వెళ్లిపోయారట.

  Charlie Dean : భారత ప్లేయర్ చేసిన పనికి వెక్కి వెక్కి ఏడ్చిన ఇంగ్లండ్ క్రికెటర్.. ఏం జరిగిందంటే?

  అసలు ఆ రోజు ఏం జరిగింది..?

  2014 సెప్టెంబరు 17న హైదరాబాద్ వేదిగా సీఎల్టీ (CLT league) టోర్నీలో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్ సందర్భంగా ఇరు జట్ల ఆటగాళ్లు నగరంలోని ఓ ప్రముఖ హోటల్‌లో బస చేశారు. ఐతే హైదరాబాద్‌కు చెందిన అంబటి రాయుడు.. టీమిండియాలో తన సహచర ఆటగాళ్ల కోసం.. ఇంట్లో ప్రత్యేకంగా హైదరాబాదీ బిర్యానీ (Hyderabad Biryani) వండించారు. ఆ బిర్యానీ తీసుకొని హోటల్‌కు వెళ్లగా.. సిబ్బంది అనుమతించలేదు. బయటి నుంచి తీసుకొచ్చిన ఆహార పదార్థాలను హోటల్‌లోకి అనుమతించమని చెప్పారు. ఏంటి... ఇండియా క్రికెట్ టీమ్‌కు కూడా మినహాయింపు ఇవ్వరా? అని నిలదీసినా.. వినిపించుకోలేదు. చివరకు కెప్టెన్ ధోనీ వచ్చి మాట్లాడినా.. వారు ఒప్పుకోలేదు. హోటల్ యాజమాన్యం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఎంఎస్ ధోనీ.. అప్పటికప్పుడు హోటల్ ఖాళీ చేసి.. వేరొక హోటల్‌కి వెళ్లిపోయారట. అప్పటి నుంచీ.. టీమిండియా సభ్యులు ఎప్పుడు వచ్చినా అక్కడ బస చేయరట.

  కాగా, ఇవాళ సాయంత్రం జరగనున్న ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఎవరు గెలుస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో చివరగా 2019 డిసెంబర్‌లో మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో భారత్ టీ20 తలపడింది. అప్పటి నుంచి మరో మ్యాచ్ జరగలేదు. కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ మ్యాచ్‌లను కూడా నిర్వహించలేదు. ఐపీఎల్ 2020, 2021 సీజన్‌లు యూఏఈలో జరిగాయి. 2022 సీజన్ అహ్మదాబాద్, ముంబైలో జరిగిన విషయం తెలిసిందే. దాదాపు మూడేళ్ల తర్వాత ఉప్పల్‌లో మ్యాచ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి మ్యాచ్‌కు టికెట్లు మొత్తం అమ్ముడైపోయాయి. స్టేడియం మొత్తం నిండిపోనుంది. అందుకు తగ్గట్లుగానే పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Ambati rayudu, Hyderabad, MS Dhoni, Team India, Telangana