హోమ్ /వార్తలు /క్రీడలు /

Ms Dhoni : లండన్ వీధుల్లో ధోనిని పరుగెత్తించిన ఫ్యాన్స్.. అసలేం జరిగిందంటే?

Ms Dhoni : లండన్ వీధుల్లో ధోనిని పరుగెత్తించిన ఫ్యాన్స్.. అసలేం జరిగిందంటే?

PC : TWITTER

PC : TWITTER

Ms Dhoni : అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకొని రెండేళ్లు కావొస్తున్నా.. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు. అతడి కోసం భారత్ లోనే కాదు ఇంగ్లండ్ (England)లో కూడా ఎగబడే వారున్నారు. ప్రస్తుతం ధోని కుటుంబంతో కలిసి లండన్ (London)లో విహరిస్తున్నట్లు తెలిసిందే.

ఇంకా చదవండి ...

Ms Dhoni : అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకొని రెండేళ్లు కావొస్తున్నా.. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు. అతడి కోసం భారత్ లోనే కాదు ఇంగ్లండ్ (England)లో కూడా ఎగబడే వారున్నారు. ప్రస్తుతం ధోని కుటుంబంతో కలిసి లండన్ (London)లో విహరిస్తున్నట్లు తెలిసిందే. వింబుల్డన్ (Wimbledon) మ్యాచ్ లతో పాటు ఇండియా (India), ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతోన్న వన్డే సిరీస్ కు కూడా అతడు హాజరైన సంగతి తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే విహార యాత్రలో ఉన్న ధోనిని ఫ్యాన్స్ అస్సలు విడిచి పెట్టడం లేదు.  తాజాగా లండన్‌ వీధుల్లోఒక పని ముగించుకొని తన కారు వద్దకు వస్తున్న ధోనిని గుర్తుపట్టిన అభిమానులు అతనితో సెల్ఫీలు దిగేందుకు హడావిడి చేశారు.

ఇది కూడా చదవండి : కళ్లు చెదిరే క్యాచ్ లతో అదరగొట్టిన టీమిండియా రాక్ స్టార్ జడేజా.. దెబ్బకు ఆ ఇంగ్లండ్ ప్లేయర్స్..

ఒకరు లేదా ఇద్దరు అంటే ఒకే అనుకోవచ్చు. కానీ, ఒకేసారి పదుల సంఖ్యలో అతడి అభిమానులు ఎగబడటంతో ధోని అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది. అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో ధోని తన కారు వద్దకు వేగంగా నడిచాడు. ఒకానొక సమయంలో కిందికి వంగి తప్పించుకునే ప్రయత్నం కూడా చేశాడు. అయితే అభిమానులు అతడి వెంట పడ్డారు. ఇంతలో సెక్యూరిటీ సిబ్బంది ధోనిని అభిమానుల నుంచి కాపాడారు. జాగ్రత్తగా అతడిని కారులో ఎక్కించి అక్కడి నుంచి సాగనంపారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్విట్టర్ లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన అతడి అభిమానులు ధోని క్రేజ్ మామూలుగా లేదు కదా అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.

కాగా ధోని రెండు వారాల క్రితం తన కుటుంబసభ్యులు, మిత్రులతో కలిసి సరదాగా గడపడానికి ఇంగ్లండ్‌కు వెళ్లాడు. తన 41వ పుట్టినరోజు(జూలై 7న) కూడా అక్కడే జరుపుకున్నాడు. అటుపై టీమిండియా కూడా ఇంగ్లండ్‌తో సిరీస్‌ ఆడేందుకు రావడంతో ఆ మ్యాచ్‌లు వీక్షించేందుకు కూడా ధోని వెళ్లాడు. లార్డ్స్‌ వేదికగా జరిగిన రెండో వన్డేకు ధోని సందడి చేసిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌ అనంతరం డ్రెస్సింగ్‌రూమ్‌లో పలువురు టీమిండియా ఆటగాళ్లను కలిసి వారికి విలువైన సలహాలను సూచనలను చేశాడు.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Hardik Pandya, India vs england, London, MS Dhoni, Ravindra Jadeja, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు