• HOME
 • »
 • NEWS
 • »
 • SPORTS
 • »
 • MS DHONI IS THE BEST CAPTAIN INDIA HAS SEEN SAYS ROHIT SHARMA BS

ధోని కెప్టెన్సీపై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు..

ధోని కెప్టెన్సీపై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు..

రోహిత్, ధోని

MS Dhoni | Rohit Sharma | టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ధోని గురించి, అతడి కెప్టెన్సీ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.

 • Share this:
  MS Dhoni : మహేంద్ర సింగ్ ధోని.. భారత క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక పేజీని.. కాదు.. కాదు.. ప్రత్యేక పుస్తకాన్ని లిఖించుకున్న క్రికెటర్. మిస్టర్ కూల్.. ఎంఎస్.. తాలా.. ధోని.. మహి.. ఇలా ఎన్నో పేర్లతో పిలిపించుకునేంత అభిమానం అతడంటే. ఎన్నో చరిత్రాత్మక విజయాలు అందించి తనదైన ముద్ర వేసిన లీడర్.. ధోని. అతడికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. భద్రతా కంచెలు దాటుకొని వచ్చి కెప్టెన్ కూల్ కాళ్లకు నమస్కరించి.. మా జీవితాల్లో ఇదో అత్యద్భుత ఘట్టం అని ఫీలైపోయే వారెందరో. సెక్యూరిటీ సిబ్బందిని దాటుకొని వచ్చిన ప్రతీ ఒక్కరితో కచ్చితంగా కరచాలనం చేస్తాడు మిస్టర్ కూల్. అంతేనా.. గ్రౌండ్‌లో వారికి దొరక్కుండా పరుగెడుతూ ఆటపట్టిస్తాడు. అందుకే అభిమానులకు ‘ధోని’ ఒక దేవుడు. టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీకి అండగా ఉంటూ, బౌలర్లకు సలహాలు ఇస్తూ, వికెట్ల వెనుక ప్రత్యర్థిని కట్టడి చేస్తూ.. గొప్ప మార్గదర్శకుడిగా ఉన్నాడు. భారత క్రికెట్ చరిత్రలో మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించిన ఏకైక కెప్టెన్ ధోనీనే.

  world cup 2019,Cricket World Cup 2019, icc world cup 2019,2019 cricket world cup,cricket world cup schedule,indian team for cricket world cup, క్రికెట్ ప్రపంచకప్, ప్రపంచకప్ క్రికెట్,క్రికెట్ వరల్డ్‌ కప్ 2019,
  టీమిండియా (ఫైల్)


  అందుకే.. ధోనిని బెస్ట్ కెప్టెన్ అని టీమిండియా క్రికెటర్లు కొనియాడుతూనే ఉంటారు. అతడి నాయకత్వ పటిమ, సందర్భానుసారం తీసుకునే నిర్ణయాలు, ఒత్తిడిలోనూ కోల్పోని సహనం, బౌలర్లకు ఇచ్చే సహకారం అమోఘమని తమ నాయకుడిని ఆకాశానికి ఎత్తేస్తారు. తాజాగా.. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ధోని గురించి, అతడి కెప్టెన్సీ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘ధోనికి ఉన్న సహనం, ప్రశాంతత గొప్ప నిర్ణయాలు తీసుకునేందుకు దోహదపడింది. అదే అతడిని మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా మార్చింది. ఆ ప్రశాంతతే మూడు ఐసీసీ ట్రోఫీలను, ఎన్నో ఐపీఎల్ టైటిళ్లను అతడి వశం చేసింది.’ అని తెలిపాడు.

  ipl grand finale, ipl final csk vs mi, IPL 2019 Live Score,IPL 2019 finale date,MI vs CSK, Mumbai Indians vs Chennai super kings, Ipl 2019 schedule, ipl dhoni team, ipl rohit sharma team,dhoni vs rohit sharma, mumbai indian schedule ipl 2019, Ipl orange cap 2019, ipl purple cap 2019, ipl points table, mahendra singh dhoni ipl, yuvraj singh ipl sixes,Indian premier league 2019, Ipl schedule 2019, low scoring matches in ipl,Ipl season 12 schedule, Ipl group matches schedule, Indian premier league stage match schedule,Mumbai indians in ipl final, chennai super kings in final ipl, ఐపీఎల్ 2019, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2019, 12వ సీజన్ ఐపీఎల్ ఫైనల్, ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్, ముంబై vs చెన్నై, రోహిత్ శర్మ ఐపీఎల్ ఫైన్, యువరాజ్ సింగ్ ఐపీఎల్ ముంబై ఇండియన్స ధర, ఐపీఎల్ షెడ్యూల్ 2019, ఐపీఎల్ గ్రూప్ స్టేజ్ షెడ్యూల్ 2019, ఐపీఎల్ 12 పూర్తి షెడ్యూల్, ఐపీఎల్ 2019 ఫైనల్ డేట్, మహేంద్ర సింగ్ ధోనీ vs రోహిత్ శర్మ, ముంబై vs చెన్నై, హర్ధిక్ పాండ్యా, సురేశ్ రైనా, రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఐపీఎల్ ఫైనల్
  ధోనీ, రోహిత్..


  ‘ఒత్తిడిలో బౌలర్లకు ధోని చాలా సలహాలు ఇస్తాడు. ఆ సందర్భాలెన్నింటినో నేను దగ్గరుండి చూశా. బౌలర్ల భుజాలపై చేతులు వేసి.. వాళ్లు ఏం చేయాలో? ఏం చేయకూడదో.. వివరిస్తాడు. యువ క్రికెటర్లను కూడా సీనియర్లలా ట్రీట్ చేస్తాడు. దానివల్ల కాన్ఫిడెన్స్ లెవల్స్ పెరిగి, టీమ్ కోసం మరింత శ్రమించేలా చేస్తుంది.’ అని తన కెప్టెన్‌ను ఆకాశానికి ఎత్తేశాడు. వాస్తవానికి రోహిత్ శర్మ కూడా ధోని వల్లే గొప్ప ఆటగాడిగా ఎదిగాడు. కెరీర్ ప్రారంభంలో రోహిత్ వైఫల్యాలు చవిచూశాడు. వైఫల్యం చెందినా రోహిత్‌కు ధోని ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. అంతేకాదు.. ఓపెనర్‌గా పంపించి రోహిత్ సత్తాను బయటపెట్టాడు. అప్పటి నుంచి రోహిత్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. డబుల్ సెంచరీలు, సెంచరీలు.. సిక్సులు, ఫోర్లతో ప్రత్యర్థులకు హడలెత్తించాడు.

  Shane Warne, India cricket, Rishabh Pant, MS Dhoni, Rohit Sharma, Shikhar Dhawan, world cup 2019, virat kohli, ప్రపంచ కప్, టీంఇండియా, రిషబ్ పంత్, షేన్ వార్న్, ధోనీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్
  ధోనీ (File : Twitter)
  Published by:Shravan Kumar Bommakanti
  First published:

  అగ్ర కథనాలు