Home /News /sports /

MS DHONI IN TROUBLE AFTER THE 20TH OF APRIL MONTH IPL 2022 PROMO FEATURING CSK EX CAPTAIN AS A BUS DRIVER IS SET TO STOP SRD

IPL 2022 - MS Dhoni : చిక్కుల్లో ధోని.. నడిరోడ్డు మీద బస్సు ఆపడంపై సీరియస్.. ఈ నెల 20 తర్వాత..

ధోని ( CSK Twitter)

ధోని ( CSK Twitter)

IPL 2022 - MS Dhoni : ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శన తీసికట్టుగా ఉంది. ముఖ్యంగా.. ధోని కెప్టెన్సీ బాధ్యతలు జడేజాకి అప్పగించిన తర్వాత బీ గ్రేడ్ టీమ్ లా కన్పిస్తోంది చెన్నై. అయితే, లేటెస్ట్ గా ధోని చిక్కుల్లో పడ్డాడు.

    ప్రపంచవ్యాప్తంగా బీసీసీఐ (BCCI) కనుసన్నల్లో నడుస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ ఎన్నో లీగ్‌లు వచ్చినా.. ఐపీఎల్‌ తప్ప మిగతావేవీ అంతగా సక్సెస్ కాలేదు. ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌కు ప్రతి ఏడాది ఆదరణ పెరుగుతూ పోతుంది. చాలా దేశాల్లో ఐపీఎల్ లీగ్‌కి భారీ సంఖ్యలో ఫాన్స్ ఉన్నారు. అందుకే ఐపీఎల్‌ బ్రాండ్‌ విలువ అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. ఐపీఎల్ క్రేజ్ పెంచడానికి ఎప్పటిలాగే నిర్వాహకులు ఈ ఏడాది కూడా వినూత్నంగా ప్రమోషన్స్ ఆరంభించారు. గతేడాది మాదిరే చెన్నై సూపర్‌ కింగ్స్‌(Chennai Super Kings) స్టార్ ప్లేయర్ ఎంఎస్‌ ధోని(MS Dhoni) అభిమానులను సర్‌ప్రైజ్‌ చేశారు. ఐపీఎల్ 2021 రెండో దశ కోసం ఇంటింటికి తిరిగి సందడి చేసిన మహీ.. ఈసారి బస్సు డ్రైవర్‌గా అలరించాడు. సౌత్ ఇండియన్ లుక్‌లో కనిపించి ఔరా అనిపించాడు. ఈ ప్రొమోలో ఎంఎస్ ధోనీ బస్సు నడుపుకొంటూ వెళ్తుండగా.. ఓ షాప్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌ లైవ్ వస్తుంటుంది.

    అది చూసిన ధోనీ బస్సును వెంటనే వెనక్కి తీసుకెళ్లి ఆపేస్తాడు. ఆపై బస్సులో ఉన్న ప్రయాణికులకు ఐపీఎల్ మ్యాచ్‌ చూడమని చెప్తాడు. బస్సు నిలిపివేయడంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అవుతుంది. దాంతో ప్రజలు అందరూ గోల చేస్తారు. ఇది చూసి ఓ ట్రాఫిక్‌ పోలీస్‌ వచ్చి ఇక్కడ ఏం జరుగుతోంది అని ప్రశ్నించగా.. 'సూపర్‌ ఓవర్‌ నడుస్తోంది' అంటూ మహీ తన స్టైల్‌లో మైక్‌ పెట్టి మరీ బదులిస్తాడు. దీంతో ట్రాఫిక్‌ పోలీస్ 'ఒకే తలైవా' అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

    ఈ ప్రొమోనే ధోనికి సరికొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. ఆయన సరికొత్త రూపంలో కనిపించిన ఐపీఎల్ ప్రోమోపై భారీగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కన్స్యూమర్ ఫోరమ్స్ ఈ ప్రోమోపై ఫిర్యాదులు సైతం నమోదు అయ్యాయి. ఫలితంగా- ఈ ప్రోమోను ఉపసంహరించుకోవాలని ఐపీఎల్ గవర్నింగ్ బాడీ నిర్ణయం తీసుకుంది.


    దీనికి ముహూర్తం కూడా పెట్టింది. ఈ నెల 20వ తేదీ నుంచి ఈ ప్రోమో ఇక ఎక్కడా కనిపించకపోవచ్చు. దాన్ని టెలికాస్ట్ చేయడాన్ని నిలిపివేయనుంది. కొంతకాలంగా ఇది టెలికాస్ట్ అవుతోంది. ఇప్పుడు ఈ ప్రోమో విమర్శలకు కేంద్రబిందువయింది. ఈ ప్రోమోను ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా చిత్రీకరించారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

    ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించేలా వాహనదారులకు సూచిస్తోందంటూ ఒకట్రెండు కన్స్యూమర్ ఫోరమ్స్ అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి. కన్స్యూమర్ యూనిటీ అండ్ ట్రస్ట్ సొసైటీ ఈ విషయాన్ని అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (యాస్కీ) దృష్టికి తీసుకెళ్లాయి. దీన్ని పరిగణనలోకి తీసుకుంది యాస్కీ. ఈ ప్రోమోను నిలిపివేయాలంటూ ఐపీఎల్‌ను ఆదేశించింది.ఈ ప్రోమోను నిలిపివేయడానికి ఐపీఎల్ గవర్నింగ్ బాడీ కొంత గడువును కోరింది. ఈ నెల 20వ తేదీ నుంచి టెలికాస్ట్ చేయబోమని స్పష్టం చేసింది.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Bcci, Chennai Super Kings, IPL 2022, MS Dhoni

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు