HOME »NEWS »SPORTS »ms dhoni has solution to every problem hes the backbone of our team says kuldeep yadav bs

Cricket World Cup 2019: ప్రతి సమస్యకు ధోనీ వద్ద పరిష్కారం దొరుకుతుందట

Cricket World Cup 2019: ప్రతి సమస్యకు ధోనీ వద్ద పరిష్కారం దొరుకుతుందట
మహేంద్ర సింగ్ ధోనీ(Getty Images)

ICC Cricket World Cup 2019: ‘ధోని వద్ద ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. ఎక్కడ బంతులు వేయాలో అర్థం కాక ఇబ్బంది పడితే ఒకసారి ధోని వైపు చూస్తే చాలు.. నా సమస్యను అర్థం చేసుకొని ఎలా బంతులు వేయాలో చెప్తాడు. ధోని వికెట్ల వెనక ఉంటే కొండంత ధైర్యం’ అని కుల్దీప్ తెలిపాడు

  • Share this:
    మహేంద్ర సింగ్ ధోని కేరాఫ్ కూల్ కెప్టెన్, ధనాధన్ బ్యాట్స్‌మన్, మ్యాచ్ ఫినిషర్, ఫాస్టెస్ట్ వికెట్ కీపర్.. ఇలా చెప్పుకుంటూ పోతే అతడికి బోలెడు నిక్ నేమ్స్. స్వదేశం, విదేశం అన్న తేడా లేకుండా అభిమానులను సంపాదించుకున్న ఈ క్రికెట్ వ్యూహకర్త.. ఓడిపోతున్న మ్యాచ్‌ను సైతం గెలిపించగలడు. బ్యాట్స్‌మన్‌గా అవతలి ఎండ్ బ్యాట్స్‌మన్‌కు సూచనలు ఇవ్వగలడు, వికెట్ కీపర్‌గా బౌలర్లకు సలహాలు ఇవ్వగలడు, ఫీల్డర్లను సరైన ప్రదేశంలో మోహరించగలడు. మొత్తంగా చెప్పాలంటే కెప్టెన్‌, కోచ్ కన్నా ఎక్కువ అతడు. తన అనుభవాన్నంతా రంగరించి జూనియర్లకు పాఠాలు నేర్పిస్తూ వారి విజయానికి సహకారం అందిస్తాడు. అందుకే ధోని.. ఓ ట్రంప్ కార్డు అన్నాడు పాక్ మాజీ క్రికెటర్ జహీర్ అబ్బాస్. అంతటి దిగ్గజ ఆటగాడు ఏ జట్టులో ఉన్నా ఆ జట్టుకు విజయావకాశాలు ఎక్కువే.

    అందుకే తోటి ఆటగాళ్లు సైతం ధోనిని ప్రశంసల్లో ముంచెత్తుతారు. తాజాగా, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ధోనీని ఆకాశానికి ఎత్తేశాడు. ప్రపంచకప్ జట్టులో చోటు సంపాదించిన ఈ యువ ఆటగాడు.. ధోని సూచనలతో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను ముప్పు తిప్పలు పెట్టాడు. దీనిపై స్పందిస్తూ.. ‘ధోని వద్ద ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. ఎక్కడ బంతులు వేయాలో అర్థం కాక ఇబ్బంది పడితే ఒకసారి ధోని వైపు చూస్తే చాలు.. నా సమస్యను అర్థం చేసుకొని ఎలా బంతులు వేయాలో చెప్తాడు. ఏ బాల్ వేస్తే ఏ బ్యాట్స్‌మన్ ఏ షాట్ కొడతాడు అన్నది కచ్చితంగా చెప్పగలడు. ధోని వికెట్ల వెనక ఉంటే కొండంత ధైర్యం’ అని తెలిపాడు. తానొక్కడినే కాదు.. జట్టులోని బౌలర్లంతా ధోని వైపే చూస్తారని, ఆయన సలహాలు స్వీకరిస్తారని వెల్లడించాడు కుల్దీప్. బ్యాట్స్‌మన్ మైండ్‌సెట్ ఏంటో ముందే తెలుసుకోగల సామర్థ్యం ధోనికి ఉందని కొనియాడాడు. కోహ్లీ-ధోని టీమ్‌కు వెన్నెముక అని, ధోని ఆటగాళ్లకు ఫ్రీడం ఇస్తే, కోహ్లీ కాన్ఫిడెన్స్‌ను పెంచుతాడని చైనామన్ బౌలర్ తెలిపాడు.

    Published by:Shravan Kumar Bommakanti
    First published:May 28, 2019, 11:41 IST