Home /News /sports /

MS DHONI HAS BOUGHT THIS VINTAGE CAR IN AN ONLINE AUCTION DETAILS HERE GH VB

MS Dhoni Car: ధోనీ గ్యారేజీలోకి మరో క్లాసిక్ కారు.. ఆన్​లైన్ వేలంలో ఆ కారును సొంతం చేసుకున్న జార్ఖండ్ డైనమేట్..

MS Dhoni

MS Dhoni

భారత మాజీ కెప్టెన్, కూల్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని(MSD) గ్యారేజీలోకి మరో కారు వచ్చి చేరింది. ఇండియన్ క్రికెట్​ను వేరే లెవల్​కి తీసుకెళ్లిన ఈ జార్ఖండ్ డైనమేట్​కు కార్లు, బైకులంటే ఎంతిష్టమో క్రికెట్ అభిమానులకు, ముఖ్యంగా ఎంఎస్​ ధోని ఫోలోవర్లకు తెలియంది కాదు. ఆయన గ్యారేజీలో(Dhoni Garage) ఇప్పటికే మసెరాటి నుంచి బుగాట్టి వరకు.. ఎన్నో హైఎండ్ మోడళ్ల బైకులు, కార్లున్నాయి.

ఇంకా చదవండి ...
భారత మాజీ కెప్టెన్, కూల్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని(MSD) గ్యారేజీలోకి మరో కారు(Car) వచ్చి చేరింది. ఇండియన్ క్రికెట్​ను వేరే లెవల్​కి తీసుకెళ్లిన ఈ జార్ఖండ్ డైనమేట్​కు కార్లు, బైకులంటే ఎంతిష్టమో క్రికెట్ అభిమానులకు, ముఖ్యంగా ఎంఎస్​ ధోని ఫోలోవర్లకు తెలియంది కాదు. ఆయన గ్యారేజీలో(Dhoni Garage) ఇప్పటికే మసెరాటి నుంచి బుగాట్టి వరకు.. ఎన్నో హైఎండ్ మోడళ్ల బైకులు(High End Model bikes), కార్లున్నాయి. తాజాగా ధోనీ(Dhoni) ఎప్పటినుంచో కోరుకుంటున్న వింటేజ్ క్లాసిక్.. ల్యాండ్ రోవర్-3ను ఆన్​లైన్(Online) వేలంలో సొంతం చేసుకున్నాడు. డిసెంబర్ 19న బిగ్ బాయ్ టాయ్జ్ (Big Boy Toyz) నిర్వహించిన వింటేజ్, క్లాసిక్ కార్ల వేలంలో ఈ ఎపిక్​ కారును కొనుగోలు చేశాడు. సంబంధిత వేలంలో ధోనీ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ల్యాండ్ రోవర్ సిరీస్-3 మోడల్‌.. 1971-1985 మధ్యకాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటిగా నిలిచింది. అప్పట్లో దాదాపు 4.4 లక్షల కార్లను కంపెనీ తయారు చేసింది. అయితే దీన్ని ధోనీ ఎంత ధరకు సొంతం చేసుకున్నాడనే వివరాలపై స్పష్టత లేదు. ఈ వేలంలో రోల్స్ రాయిస్, కాడిలాక్, బ్యూక్, షెవర్లే, ల్యాండ్ రోవర్, ఆస్టిన్, మెర్సిడెస్ బెంజ్ సహా మొత్తం 19 ప్రత్యేకమైన కార్లను ఈ వేలంలో ప్రదర్శనకు ఉంచింది బిగ్ బాయ్ టాయ్జ్. దేశంలోని వివిధ ప్రముఖుల వద్ద నుంచి సేకరించిన ఈ కార్లన్నీ గురుగ్రామ్​లోని ఓ షోరూమ్‌లో ప్రదర్శనకు ఉన్నాయి.

50ఏళ్లుగా వెలుగుతోన్న Amar Jawan Jyoti శాశ్వతంగా ఆర్పివేత.. War Memorialలో విలీనం.. ఘోర అవమానమంటూ..


వింటేజ్ కార్ కావాలా..?
పాతకాలం నాటి కార్లను కొనుగోలు చేయాలనుకునే వారికి తాము ఒక మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నామని బీబీటీ(BBT) వేలం సంస్థ తెలిపింది. వింటేజ్ కార్లను తొలిసారి కొనుగోలు చేసేవారు చాలా మంది ఈసారి వేలంలో పాల్గొన్నట్లు తెలిపింది. వీరిలో సెలబ్రిటీలు సైతం ఉన్నట్లు పేర్కొంది. తమ వద్ద ఉన్న కార్లన్నింటిలో 50 శాతం విక్రయం అయ్యాయని ప్రకటించింది. అన్ని మోడళ్లకూ మంచి స్పందన వచ్చిందని, కార్ లవర్స్ మంచి ఆసక్తి కనబర్చారని సంస్థ పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా వింటేజ్, క్లాసిక్ కార్ల రంగం మల్టీ బిలియన్ డాలర్ల పరిశ్రమగా ఎదుగుతోంది. భారత్​లో ఈ తరహా సేవలను సమర్థవంతంగా అందించేందుకు పనిచేస్తున్న మొదటి కంపెనీ తమదేనని BBT వ్యవస్థాపకుడు, MD జతిన్ అహుజా పేర్కొన్నారు. వింటేజ్ కారు సొంతం చేసుకోవడం అంటే ఓ మంచి పెయింటింగ్‌ను, ఓ అద్భుత కళాఖండాన్ని సొంతం చేసుకోవడం వంటి ఒక ప్రత్యేకమైన అనుభవమని అభిప్రాయపడ్డారు.

ఒడియమ్మ మ్యాక్స్‌వెల్.. నీ బాదుడుకి దండం సామీ.. 64 బంతుల్లో సునామీ ఇన్నింగ్స్..

‘ఈ వ్యాపారం దేశంలో క్రమంగా విస్తరించబోతోంది. దేశంలోని కార్ల ప్రియులందరికీ అత్యుత్తమ వింటేజ్, క్లాసిక్ కార్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మా వంతు కృషి చేస్తాం. క్లాసిక్ కార్(Classical Cars) లవర్స్​ను లక్ష్యంగా చేసుకుని మరింత విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ప్రజలు కోరుకునే పాతకాలపు కార్లను సులువుగా కనుగొనేందుకు ఓ వేదికగా ఉండాలనుకుంటున్నాం. మార్కెట్​ విస్తరణలో భాగంగా రాబోయే రోజుల్లో 100 కోట్ల రూపాయల వ్యాపార లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. ప్రతి రెండు నెలలకోసారి క్లాసిక్ కార్లను ఆన్‌లైన్ వేలం వేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. సరికొత్త కలెక్షన్​తో ఫిబ్రవరి చివరి నాటికి తదుపరి వేలం ఉంటుంది’ అని అహుజా వివరించారు.
Published by:Veera Babu
First published:

Tags: Dhoni, MS Dhoni

తదుపరి వార్తలు