ధోనీ గురించి ఎవ్వరికి తెలియని రహస్యం బయటపెట్టిన సన్నీ...

ధోనీ కెప్టెన్ గా ఉన్న సమయంలో విమానంలో బిజినెస్ క్లాస్​లో ప్రయాణించేందుకు అనుమతి ఉన్నా..సాధారణ ఎకానమీ క్లాస్​లోనే వెళ్లేవాడని గవాస్కర్ తెలిపాడు.

news18-telugu
Updated: April 7, 2020, 11:36 PM IST
ధోనీ గురించి ఎవ్వరికి తెలియని రహస్యం బయటపెట్టిన సన్నీ...
Twitter
  • Share this:
మిస్టర్ కూల్ ధోనీని వెటరన్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆకాశానికి ఎత్తేశాడు. ఓ పత్రిక కాలమ్ లో ఆయన రాస్తూ ధోనీ కెప్టెన్ గా ఉన్న సమయంలో విమానంలో బిజినెస్ క్లాస్​లో ప్రయాణించేందుకు అనుమతి ఉన్నా..సాధారణ ఎకానమీ క్లాస్​లోనే వెళ్లేవాడని గవాస్కర్ తెలిపాడు. ముందు మ్యాచ్​లో మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు బిజినెస్ క్లాస్ టికెట్లు కేటాయించే సంప్రదాయం టీమ్​ఇండియాలో కొనసాగుతున్నది. ధోనీ మాత్రం కెప్టెన్​గా ఉన్నా ఎకానమీ క్లాస్​లో వచ్చే వాడని గవాస్కర్ తెలిపాడు. అంతేకాదు కింది స్థాయి సిబ్బందితో కూడా మిస్టర్ కూల్ ధోనీ చాలా మర్యాదగా ఉండేవాడని, ఎప్పుడు దర్పం ప్రదర్శించేవాడు కాదని చెప్పుకొచ్చాడు. తనకు తెలిసిన క్రికెటర్లలో ధోని అరుదైన వాడని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

ms dhoni should go with out being pushed out says sunil gavaskar
ఎంఎస్ ధోనీ,సునీల్ గవాస్కర్ (File)
Published by: Krishna Adithya
First published: April 7, 2020, 11:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading