MS Dhoni Dance : మహేంద్ర సింగ్ సింగ్ ధోని (MS Dhoni) తనలోని కొత్త ట్యాలెంట్ ను బయటకు తీశాడు. ఎప్పుడూ కామ్ గా ఉండే ధోని మాస్ స్టెప్పులతో రచ్చ రచ్చ చేశాడు. దుబాయ్ (Dubai)లో ఫ్రెండ్ పుట్టిన రోజు కార్యక్రమంలో పాల్గొన్న ధోని అదిరిపోయే స్టెప్పులు వేశాడు. ఈ పార్టీకి ధోనితో పాటు భారత ప్లేయర్లు హార్దిక్ పాండ్యా (Hardik Pandya), ఇషాన్ కిషన్ (Ishan Kishan)లు కూడా అటెండ్ అయ్యారు. ఇక హార్దిక్, ధోని, ఇషాన్ లు తమ ఫ్రెండ్స్ తో కలిసి చేసిన డ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా ధోనిని డ్యాన్స్ చేయడం చూసిన అతడి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
ఇది కూడా చదవండి : ‘అందుకే అతడిని తీసుకోలేదు’ రెండో వన్డే నుంచి సామ్సన్ ను తప్పించడంపై ధావన్ వివరణ
న్యూజిలాండ్ తో ముగిసిన టి20 సిరీస్ కు హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. త్వరలోనే టి20 ఫార్మాట్ లో పూర్తి స్థాయి టీమిండియా కెప్టెన్ గా హార్దిక్ బాధ్యతలు తీసుకుంటాడని వార్తలు కూడా వస్తున్నాయి. న్యూజిలాండ్ తో జరిగే వన్డే సిరీస్ తో పాటు బంగ్లాదేశ్ తో జరిగే పర్యటనకు హార్దిక్ పాండ్యా ఎంపికవ్వలేదు. ఇక ఇషాన్ కిషన్ కివీస్ తో జరిగే వన్డే సిరీస్ కు ఎంపిక కాలేదు. బంగ్లాదేశ్ తో జరిగే వన్డే సిరీస్ కు టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఇక ధోని ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న సంగతి తెలిసిందే. దుబాయ్ లో జరిగిన ఫ్రెండ్ పుట్టిన రోజు వేడుకలో ఈ ముగ్గురు కలిసి సందడి చేశారు. దీనికి సంబంధించిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీరూ చేసేయండి మరీ.
View this post on Instagram
అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ధోని ప్రస్తుతం ఐపీఎల్ లో మాత్రమే కొనసాగుతున్నాడు. వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ సీజన్ ధోనికి చివరిది అని భావిస్తున్నారు. ఇక వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం డిసెంబర్ 23న కొచ్చి వేదికగా మినీ వేలం జరగనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఇప్పటికే అన్ని పనులు పూర్తయ్యాయి కూడా. తమకు భారంగా ఉన్న ప్లేయర్లను వేలంలోకి అన్ని ఫ్రాంచైజీలు కూడా విడుదల చేశాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dubai, Hardik Pandya, MS Dhoni, Team India