హోమ్ /వార్తలు /క్రీడలు /

MS Dhoni Crazy Fan: ధోనీ కోసం 1436 కిలోమీటర్లు నడుకుచుంటూ వచ్చిన క్రేజీ ఫ్యాన్.. ఇదే మొదటి సారి కాదు..! తర్వాత ఏం జరిగింది?

MS Dhoni Crazy Fan: ధోనీ కోసం 1436 కిలోమీటర్లు నడుకుచుంటూ వచ్చిన క్రేజీ ఫ్యాన్.. ఇదే మొదటి సారి కాదు..! తర్వాత ఏం జరిగింది?

ధోనీని కలిసిన క్రేజీ ఫ్యాన్ అజయ్ (PC: News18 Hindi)

ధోనీని కలిసిన క్రేజీ ఫ్యాన్ అజయ్ (PC: News18 Hindi)

MS Dhoni Crazy Fan: ఎంఎస్ ధోనీ కోసం ఒక క్రేజీ ఫ్యాన్ ఏకంగా 1436 కిలోమీటర్లు నడిచి రాంచీకి వచ్చాడు. ఇలా రావడం అతడికి మొదటి సారి కాదు. గతంలో ఒకసారి నడుచుకుంటూ వస్తే ధోనీ రాంచీలో లేడు. కానీ ఈ సారి మాత్రం తన అభిమాన క్రికెటర్‌ను కలిశాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసా?

ఇంకా చదవండి ...

  సినిమా నటులు (Film Stars), క్రికెటర్లు (Cricketers), సెలెబ్రిటీలకు (Celebrities) ఫ్యాన్స్ (Fans) ఉండటం కామనే. కానీ కొంత మంది ఫ్యాన్స్ చాలా క్రేజీగా ఉంటారు. తన అభిమాన నటుడు, క్రికెటర్ పట్ల విపరీతమైన ప్రేమ పెంచుకుంటారు. వాళ్ల కోసం ఏం చేయడానికైనా వెనుకాడరు. ఇండియాలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ తెలిసిందే. ఇక్కడ క్రికెటర్లకు సినిమా నటులకు మించిన అభిమానులు ఉన్నారు. సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) కోసం అతడి అభిమాని సుధీర్ జీవితమంతా అంకితం చేసిన విషయం తెలిసిందే. ఇండియా ఆడే ప్రతీ మ్యాచ్‌కు స్టేడియంలో దర్శనం ఇచ్చేవాడు. ఆ తర్వాత కూడా 'మిస్ యూ సచిన్' అని రాసుకొని చాలా కాలం కనపడ్డాడు. కోవిడ్ కారణం స్టేడియంలలోకి అనుమతించకపోతే బయట నిలబడి మరీ టీమ్ ఇండియాకు మద్దతు తెలిపాడు. అలాగే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి (MS Dhoni) కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇండియాలోనే కాకుండా పాకిస్తాన్‌కు చెందిన అభిమానులు కూడా ఉన్నారు.

  ఇక ధోనీకి ఒక క్రేజీ ఫ్యాన్ (Crazy Fan) ఉన్నాడు. హర్యాణాలోని జలాన్‌ఖేడాకు చెందిన అజయ్ గిల్‌కు ధోనీ అంటే పిచ్చి ప్రేమ. ధోనీని ఎలాగైనా కలసి ఒక ఆటోగ్రాఫ్ తీసుకోవాలనేది అజయ్ కోరిక. ఇందుకోసం ఏకంగా 1436 కిలోమీటర్ల నడిచి రాంచీ చేరుకున్నాడు. హర్యాణాలోని తన ఇంటి నుంచి రాంచీలోని ధోనీ ఫామ్ హౌస్ వరకు 18 రోజుల పాటు నడిచి చేరుకున్నాడు. అజయ్ నడుచుకుంటూ రావడం ధోనీ ఇంటికి రావడం ఇదే తొలి సారి కాదు. మూడు నెలల క్రితం అగస్టు 15న అజయ్ 16 రోజుల పాటు నడిచి ధోనీ ఇంటికి వచ్చాడు.

  Champions Trophy: పాకిస్తాన్‌లో చాంపియన్స్ ట్రోఫీ... ఇండియా అక్కడకు వెళ్లి ఆడుతుందా? క్లారిటీ ఇచ్చిన స్పోర్ట్స్ మినిస్టర్


   ధోనీని ఎలాగైనా కలవాలని అతడి ఫామ్ హౌస్ ముందు సెక్యూరిటీకి చెప్పాడు. అయితే అతడిని గమనించిన ఒక విలేకరి పూర్తి వివరాలు కనుక్కున్నాడు. ఆ సమయంలో ధోనీ ఐపీఎల్ 2021 రెండో ఫేజ్ కోసం యూఏఈలో ఉన్నాడు. ఇప్పుడు కలవడం కుదరదని చెప్పాడు. అయతే తాను ధోనీ వచ్చే వరకు ఇక్కడే ఉంటానని అజయ్ మంకు పట్టు పట్టాడు. చివరకు అతడికి నచ్చజెప్పి తిరిగి ఇంటికి పంపించారు.


  అజయ్ గిల్ మంచి క్రికెటర్ కావాలని కలలు కన్నాడు. ధోనీ అంటే మొదటి నుంచి విపరీతమైన అభిమానం పెంచుకున్న అజయ్... తలైవా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కుంగిపోయాడు. క్రికెట్ ఆడటం మానేశాడు. ధోనీని కలసి ఆశీర్వాదం తీసుకునే వరకు క్రికెట్ ఆడనని శపథం చేశాడు. ధోనీ రిటైర్ అయి ఏడాది గడిచిన సందర్భంగా ఈ ఏడాది అగస్టు 15న రాంచీ వచ్చాడు. కానీ మహీని కలవలేక వెనుదిరిగాడు.

  Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ వదిలేసిన ట్రెంట్ బౌల్ట్.. ఎందుకు వదిలేశాడో సెటైర్ వేసిన స్కై  తాజాగా మరోసారి 18 రోజుల పాటు 1436 కిలోమీటర్లు ప్రయాణం చేసి మళ్లీ రాంచీకి చేరుకున్నాడు. ఈ సారి మాత్రం తన అభిమాన క్రికెటర్ ధోనీని కలిశాడు. అజయ్ గురించి పూర్తిగా తెలుసుకున్న ధోనీ.. అతడికి గట్టి హగ్ ఇచ్చి తన ఫామ్‌లోకి తీసుకొని వెళ్లాడు. అక్కడే భోజనానికి కావలసిన ఏర్పాట్లు చేశాడు. అంతే కాకుండా బెడ్‌పై కూర్చొబెట్టి అజయ్‌కి ఆటోగ్రాఫ్ ఇచ్చిన ధోనీ.. తిరిగి హర్యాణా వెళ్లడానికి విమాన టికెట్లు ఏర్పాటు చేశాడు. తన అభిమాన క్రికెటర్ తన కోసం ఇవన్నీ చేస్తుండటంతో అజయ్ ఆశ్చర్యపోయాడు. తన కళ్లను తానే నమ్మలేక ఏం జరుగుతుందో అని ఆశ్చర్యంలో మునిగిపోయాడు. ఏదేమైనా చివరకు తన అభిమాన క్రికెటర్ ధోనీ వద్ద ఆశీర్వాదం తీసుకొని వచ్చాడు. ధోనీ తనకు బెస్టాఫ్ లక్ చెప్పాడని.. ఐ లవ్ యూ అజయ్ అన్నాడని..  తాను ఇక క్రికెట్ ఆడతానని అజయ్ చెబుతున్నాడు.

  Published by:John Kora
  First published:

  Tags: Chennai, MS Dhoni, Team India

  ఉత్తమ కథలు