ఐపీఎల్‌ తర్వాత ధోని ఏం చేయబోతున్నాడో తెలుసా?

news18-telugu
Updated: September 30, 2020, 10:39 PM IST
ఐపీఎల్‌ తర్వాత ధోని ఏం చేయబోతున్నాడో తెలుసా?
  • Share this:


టీమిండియా మాజీ సారథి ధోనీ క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించినా.. అతని ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఐపీఎల్‌ 13వ సీజన్‌ ప్రారంభంతో బీజిగా ఉన్నాడు ధోనీ. ఈ టోర్నీ తర్వాత ధోనీ ఏం చేస్తాడో అని ఆలోచిస్తున్న అభిమానులకు సాక్షి సింగ్ గుడ్ న్యూస్ చెప్పారు. ఐపీఎల్‌ తర్వాత ధోని ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో బిజీ కానున్నారు. 2019లోనే ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పేరుతో మహీ ఓ సొంత బ్యానర్‌ను స్థాపించిన విషయం తేలిసిందే.

ఈ బ్యానర్‌లో ఇప్పటికే జార్ఖండ్‌ డైనమేట్‌ రోర్‌ ఆఫ్‌ ది లయన్‌ అనే డాక్యుమెంటరీని రూపొందించారు. త్వరలోనే మరో కథను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను సాక్షి ధోని పర్యవేక్షిస్తుంది. రహస్యంగా సాగే ఓ అగోరి ప్రయాణానికి సంబంధించిన పురాణ సైన్స్ ఫిక్షన్ కథను వెబ్‌ సిరీస్‌గా చేస్తున్నట్లు తెలిపారు. ఈ కథకు సంబంధించిన హక్కులు కొనుగొలు చేసినట్లు తెలిపారు.

"ఓ ఆఘోరి రహస్య ప్రయాణమే ఈ కథే. ఇది పౌరాణిక సైన్స్‌ ఫిక్షన్‌. తన ప్రయాణంలో ఓ అఘోరి వెల్లడించిన  రహస్యాలు వెబ్ సీరిస్‌లో ఉంటాయని" సాక్షి తెలిపారు.
Published by: Rekulapally Saichand
First published: September 30, 2020, 10:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading