MS Dhoni: ధోనీ రిటైర్మెంట్ ఎప్పుడు...వెస్టిండీస్ టూర్‌కి సందేహమేనా?

MS Dhoni News | ధోనీ వెస్టిండీస్ టూర్‌కు వెళ్లే అవకాశాలు లేవన్న కథనాలు వినిపిస్తున్నాయి. వికెట్ కీపర్‌గా ధోనీ జట్టులో కొనసాగబోరని, ఇక రిషభ్ పంత్ జట్టులో పూర్తి స్థాయి వికెట్ కీపర్‌గా కొనసాగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: July 17, 2019, 2:47 PM IST
MS Dhoni: ధోనీ రిటైర్మెంట్ ఎప్పుడు...వెస్టిండీస్ టూర్‌కి సందేహమేనా?
ధోని (ట్విట్టర్ ఫోటో)
news18-telugu
Updated: July 17, 2019, 2:47 PM IST
ప్రపంచకప్ టోర్నీ ముగిసినప్పటి నుంచి ఇప్పుడు అందరి దృష్టి ధోనీ వైపే నెలకొంటోంది. ఎంఎస్ ధోనీ జట్టులో కొనసాగుతాడా? రిటైర్మెంట్ ప్రకటిస్తాడా? త్వరలో వెస్టిండీస్ టూర్‌కు వెళ్లే భారత జట్టులో ధోనీకి చోటు దక్కుతుందా? లేదా? అన్న చర్చ జరుగుతోంది. ధోనీ వెస్టిండీస్ టూర్‌కు వెళ్లే అవకాశాలు లేవన్న కథనాలు వినిపిస్తున్నాయి. వికెట్ కీపర్‌గా ధోనీ జట్టులో కొనసాగబోరని, ఇక రిషభ్ పంత్ జట్టులో పూర్తి స్థాయి వికెట్ కీపర్‌గా కొనసాగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే రిషబ్ పంత్ జట్టులో కుదురుకునే వరకు ధోనీ సలహాలు, సూచనలు ఇస్తుంటారని బీసీసీఐ వర్గాల సమాచారం. వెస్టిండీస్ టూర్ తర్వాత భారత జట్టులోని 15 సభ్యుల్లో ధోనీ ఒకరుగా ఉంటారని...అయితే 11 మంది తుది ఆటగాళ్లలో ఒకరుగా కొనసాగబోరని చెబుతున్నారు.

గత కొన్నేళ్లుగా ధోనీ రన్‌రేట్ సరిగ్గా లేదని, బ్యాటింగ్ సమయంలో సరిగ్గా బంతిని కొట్టలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రిటైర్మెంట్ తీసుకునేందుకు ధోనీకి ఇదే సరైన సమయమని కొందరు అభిప్రాయపడుతుండగా...మరికొందరు మాత్రం అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగే అర్హత ధోనీకి ఉందని చెబుతున్నారు. వరల్డ్ కప్‌లో ధోనీ 273 పరుగులు సాధించాడు. సెమీస్‌లో ధోనీ 50 పరుగులతో రాణించినా...భారత జట్టును విజయం ఒడ్డుకు చేర్చడంలో విఫలం చెందారు.

వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే భారత జట్టును ఎంపిక చేసేందుకు సెలక్షన్ కమిటీ ఈ నెల 19న ముంబైలో సమావేశంకానుంది. వెస్టిండీస్‌తో మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్‌లతో పాటు రెండు టెస్ట్ మ్యాచ్‌లలో టీమిండియా తలపడనుంది. వెస్టిండీస్‌తో తొలి టీ20 మ్యాచ్ ఆగస్టు 3న జరగనుంది.

First published: July 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...