హోమ్ /వార్తలు /క్రీడలు /

MS Dhoni Salary: టీమ్ ఇండియాకు మెంటార్‌గా ఉండటానికి ధోనీ నయా పైసా అడగలేదు.. ఎంఎస్‌డీ నిర్ణయంపై ఫ్యాన్స్ ఖుష్

MS Dhoni Salary: టీమ్ ఇండియాకు మెంటార్‌గా ఉండటానికి ధోనీ నయా పైసా అడగలేదు.. ఎంఎస్‌డీ నిర్ణయంపై ఫ్యాన్స్ ఖుష్

మెంటార్‌గా ఉండటానికి ఎంఎస్ ధోనీ నయా పైసా తీసుకోవట్లేదు (PC: BCCI)

మెంటార్‌గా ఉండటానికి ఎంఎస్ ధోనీ నయా పైసా తీసుకోవట్లేదు (PC: BCCI)

MS Dhoni Salary: టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టుకు మెంటార్‌గా వ్యవహరించడానికి ధోనీ ఎలాంటి డబ్బు తీసుకోవడం లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. స్వచ్ఛందంగానే ఆ పని చేయడానికి ధోనీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది.

  మ్యాచ్ ఎలాంటి క్లిష్టపరిస్థితుల్లో ఉన్నా తన సహనాన్ని కోల్పోకుండా చాలా కూల్‌గా వ్యూహాలు అమలు చేసుకుంటూ వెళ్లే కెప్టెన్లలో ఎంఎస్ ధోనీ (MS Dhoni) అగ్రగణ్యుడు. మైదానంలో అయినా మైదానం వెలుపల అయినా మిస్టర్ కూల్ రూటే వేరు. అందుకే ధోనీ కెప్టెన్సీలో ఆడటానికి చాలా మంది క్రికెటర్లు అదృష్టంగా భావిస్తారు. కుర్రాళ్లను ఎంకరేజ్ చేయడంతో పాటు మ్యాచ్‌ను ఎలా గట్టెక్కించవచ్చు అనే విషయాలపై ధోనీకి ఎంతో అనుభవం ఉన్నది. అంతర్జాతీయ క్రికెట్ (Cricket) నుంచి ధోనీ రిటైర్ అయినా ఇంకా అతడికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది. గత సీజన్ ఐపీఎల్‌లో (IPL) చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) పాయింట్స్ టేబుల్‌లో 7వ స్థానంలో నిలిచింది. కానీ ఈ ఏడాది ధోనీ అదే జట్టును ఫైనల్స్ చేర్చాడు. ఓటమి నుంచి ఎలా బయటపడాలి అనేది ధోనీకి తప్ప మరెవరికీ తెలియదేమో. అందుకే టీమ్ నుంచి రిటైర్ అయినా.. అతడి సేవలు కావాలని బీసీసీఐ (BCCI) నిర్ణయించింది. రాబోయే టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) కోసం అతడిని టీమ్ మెంటార్‌గా నియమించింది. ఈ నిర్ణయంపై క్రికెట్ ఫ్యాన్స్ చాలా సంబురపడ్డారు.

  ధోనీ ప్రస్తుతం ఐపీఎల్ తప్ప మరే ఇతర క్రికెట్ ఆడటం లేదు. కానీ ఎండోర్స్‌మెంట్స్, వ్యాపారాలు, వ్యవసాయం అంటూ చాలా బిజీగానే ఉంటున్నాడు. ఇప్పటికీ అత్యధికంగా సంపాదించే క్రికెటర్లలో ధోనీ ఒకడు. అలాంటి ధోనీ మరి తన విలువైన నెల రోజుల సమయాన్ని టీమ్ ఇండియా కోసం ఇస్తున్నాడంటే భారీగానే ముట్ట జెబుతున్నారని అందరూ అనుకున్నారు. ఇటీవల ఒక రాష్ట్రానికి చెందిన క్రికెట్ అసోసియేషన్ సభ్యుడు ధోనీ నియామకం పరస్పర విరుద్ద ప్రయోజనాల కిందకు వస్తుందని పిర్యాదు కూడా చేశాడు. అయితే ధోనీ వేతనం విషయంపై బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. ఎంఎస్ ధోనీ టీ20 వరల్డ్ కప్ సమయంలో భారత జట్టుకు మెంటార్‌గా ఉంటున్నందుకు ఒక్క నయాపైసా కూడా జీతంగా తీసుకోవట్లేదని వెల్లడించింది. ఈ విషయాన్ని స్వయంగా బోర్డు అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జై షా స్పష్టం చేశారు.

  Sourav Ganguly Punches: గంగూలీతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు.. స్టాండుకు నా పేరా.. గ్రౌండే నాది భాయ్..  గంగూలీ కనీసం రూపాయి కూడా వేతనంగా తీసుకోవట్లేదని తెలిసి 'తలా' ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. 'నీపై మరింత గౌరవం పెరిగింది' అంటూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. కాగా, ప్రస్తుతం ఐపీఎల్ ఫైనల్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతోనే ఉన్న ఎంఎస్ ధోనీ.. ఐపీఎల్ ముగిసిన వెంటనే టీమ్ ఇండియాతో చేరతాడు. ప్రస్తుతం టీమ్ ఇండియా దుబాయ్‌లోని ది పామ్ అనే లగ్జరీ హోటల్‌లో బస చేసింది. సపోర్టింగ్ స్టాఫ్, కోచ్ కూడా అదే హోటల్‌లో ఉన్నారు. అసలు విషయం ఏంటంటే.. చెన్నై సూపర్ కింగ్స్ కూడా అదే హోటల్‌లో ఉన్నది. అంటే ఐపీఎల్ అయిపోగానే ధోనీ మరెక్కడికో పోవాల్సి అవసరం లేదు. అదే హోటల్ నుంచి తన సేవలను అందించే అవకాశం ఉన్నది. అక్టోబర్ 18, 20న టీమ్ ఇండియా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో వార్మప్ మ్యాచ్‌లు ఆడనున్నది. అక్టోబర్ 24న పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌లో తలపడనున్నది.

  Published by:John Kora
  First published:

  Tags: Bcci, MS Dhoni, T20 World Cup 2021, Team India

  ఉత్తమ కథలు