news18-telugu
Updated: July 15, 2018, 2:16 AM IST
ఎంఎస్ ధోనీ (Getty)
టీమిండియా ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ రెండు మైల్ స్టోన్స్ అందుకున్నాడు. ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లార్డ్స్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో ధోనీ 37 పరుగులు సాధించాడు. దీంతో 10,000 పరుగులు చేసిన నాలుగో భారత క్రికెటర్‌గా నిలిచాడు. 50 ఓవర్ల వన్డే ఫార్మాట్లో సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ తర్వాత 10వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అదే మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ కొట్టిన బంతిని క్యాచ్ పట్టడం ద్వారా 50 ఓవర్ల వన్డే ఫార్మాట్లో 300 క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్ల క్లబ్లో చేరాడు. పొట్టి క్రికెట్లో 50 క్యాచ్‌లు పట్టిన తొలి వికెట్ కీపర్‌గా కూడా ధోనీ పేరు నిలిచిపోతుంది. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో మిస్టర్ కూల్ ఈ ఘనతను సాధించాడు.
50 ఓవర్ల వన్డే ఫార్మాట్లో 10,000 పరుగులు చేసిన భారత ఆటగాళ్లుసచిన్ టెండుల్కర్ - 18,426
సౌరవ్ గంగూలీ - 11,221
రాహుల్ ద్రవిడ్ - 10,768
ఎంఎస్ ధోనీ - 10,004
50 ఓవర్ల వన్డే ఫార్మాట్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన వికెట్ కీపర్లుఆడమ్ గిల్‌క్రిస్ట్ (ఆస్ట్రేలియా) - 417
మార్క్ బౌచర్ (సౌతాఫ్రికా) - 403
కుమార సంగక్కర (శ్రీలంక) - 402
మహేంద్ర సింగ్ ధోనీ (భారత్) - 300*
బ్రెండన్ మెకల్లమ్ (న్యూజిలాండ్) - 262
Published by:
Ashok Kumar Bonepalli
First published:
July 15, 2018, 12:43 AM IST