హోమ్ /వార్తలు /క్రీడలు /

MS Dhoni : ధోని బాంబు పేల్చబోతున్నాడా? లేదంటే ఏంది ఇదీ.. ఎన్నడూ లేని విధంగా ఫేస్ బుక్ లైవ్!

MS Dhoni : ధోని బాంబు పేల్చబోతున్నాడా? లేదంటే ఏంది ఇదీ.. ఎన్నడూ లేని విధంగా ఫేస్ బుక్ లైవ్!

MS Dhoni

MS Dhoni

MS Dhoni : సెప్టెంబర్ 24, 2007.. ఎన్నేళ్లు గడిచినా ఈ తేదీని మాత్రం భారత (India) క్రికెట్ అభిమానులు మరిచిపోరు. ఎందుకంటే ఆ రోజు మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) నాయకత్వంలోని టీమిండియా (Team India) సౌతాఫ్రికా (South Africa) వేదికగా జరిగిన తొలి టి20 ప్రపంచకప్  (T20 World Cup)లో ప్రపంచకప్ చాంపియన్ గా అవతరించింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

MS Dhoni : సెప్టెంబర్ 24, 2007.. ఎన్నేళ్లు గడిచినా ఈ తేదీని మాత్రం భారత (India) క్రికెట్ అభిమానులు మరిచిపోరు. ఎందుకంటే ఆ రోజు మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) నాయకత్వంలోని టీమిండియా (Team India) సౌతాఫ్రికా (South Africa) వేదికగా జరిగిన తొలి టి20 ప్రపంచకప్  (T20 World Cup)లో ప్రపంచకప్ చాంపియన్ గా అవతరించింది. ఈ ఏడాదితో ఆ అద్భుత ఘట్టం 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. అయితే సెప్టెంబర్ 24, 2022న ధోని ఒక ప్రకటన ద్వారా అభిమానులను పలకరించాడు. ఎన్నడూ లేని విధంగా ఎక్సైటింగ్ న్యూస్ ఒకటి మీకు చెబుతా అంటూ ఫేస్ బుక్ లో ప్రకటన చేశాడు. అంతేకాకుండా  సెప్టెంబర్ 25 (ఆదివారం) మధ్యాహ్నం 2 గంటలకు లైవ్ ద్వారా ఆ విషయం ఏంటో వెల్లడిస్తానంటూ ధోని పేర్కొనడం విశేషం. ధోని ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. కేవలం ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్నాడు.

దాంతో ఐపీఎల్ కు కూడా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు అదే విషయాన్ని ఫేస్ బుక్ లైవ్ లో ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. తలైవా లైవ్ కోసం ఆసక్తికా ఎదురు చూస్తున్నామంటూ అతడి అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరేమో ఇది ఫేస్ బుక్ ప్రమోషన్ అయి ఉండొచ్చని కామెంట్స్ చేస్తున్నారు.

ఏదైనా సరే సడెన్ గా చేయడం ధోనికి అలవాటు. 2014 ఆస్ట్రేలియా పర్యటనలో ధోని ఉన్నపళంగా టెస్టులకు గుడ్ బై చెప్పాడు. ఇక 2019 వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడని ధోని.. 2020 ఆగస్టు 15న వన్డే, టి20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే ఐపీఎల్ లో మాత్రం ఇంకా ఆడుతున్నాడు. ఈ ఏడాదే ధోనికి చివరి ఐపీఎల్ అని అంతా భావించారు. అయితే వచ్చే ఏడాది కూడా ఆడతానంటూ పరోక్షంగా చెప్పకనే చెప్పాడు. కరోనా వల్ల ఈ ఏడాది ఐపీఎల్ మహారాష్ట్ర , కోల్ కతా, అహ్మదాబాద్ వేదికలపై మాత్రమే జరిగింది. చెపాక్ (చెన్నై)లో ధోని తన ఐపీఎల్ కెరీర్ ను ముగించే అవకాశం ఉంది. దాంతో వచ్చే సీజన్ తర్వాత ధోని ఐపీఎల్ నుంచి రిటైర్ అయ్యే అవకాశం ఉంది. అయితే ధోని ఫేస్ బుక్ లైవ్ అనడంతో.. ఊహించని నిర్ణయం తీసుకుంటున్నాడా అని అతడి అభిమానులు భయపడుతున్నారు.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Chennai Super Kings, Csk, Facebook, India vs australia, MS Dhoni, Ravichandran Ashwin, Ravindra Jadeja, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు