• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • MS DHONI CANT SHOW ARMY INSIGNIA ON KEEPING GLOVES ICC DENIES BCCI REQUEST MK

Dhoni Keeping Gloves: ధోనీ కీపింగ్ గ్లౌవ్స్ వివాదంపై వెనక్కు తగ్గని ఐసీసీ...కొనసాగుతున్న ఉత్కంఠ...

Dhoni Keeping Gloves: ధోనీ కీపింగ్ గ్లౌవ్స్ వివాదంపై వెనక్కు తగ్గని ఐసీసీ...కొనసాగుతున్న ఉత్కంఠ...

ధోనీ

#DhoniKeepTheGlove : Cricket World Cup 2019 : ధోనీ కీపింగ్ గ్లౌవ్స్ ఉన్న గుర్తు ఎలాంటి వాణిజ్య, మతపరమైనది కాదని రాయ్ లేఖలో తెలిపారు. అంతే కాదు ఆస్ట్రేలియాతో జరునున్న మ్యాచ్ సందర్భంగా ధోనీ ఇవే గ్లోవ్స్ తో ఆడడంతో పాటు, వరల్డ్ కప్ మొత్తం బలిదాన్ చిహ్నం కలిగిన గ్లోవ్స్ వాడతానని తేల్చిచెప్పడంతో, అటు నెటిజన్ల నుంచి కూడా విపరీతమైన మద్దతు లభిస్తోంది. మరోవైపు బీసీసీఐ చేసిన విజ్ఞప్తిని ఐసీసీ తోసిపుచ్చింది.

  • Share this:
    ధోనీ గ్లౌవ్స్ వివాదంపై ఐసీసీ వెనక్కు తగ్గడం లేదు. ధోనీ కీపింగ్ గ్లౌవ్స్ పై పారా రెజిమెంట్ కు చందిన బలిదాన్ చిహ్నం ముద్రించుకోవడం నిబంధనలకు వ్యతిరేకమని ఐసీసీ వాదిస్తుండగా, బీసీసీఐ మాత్రం ధోనికి అండగా నిలుస్తోంది. అది ఆర్మీ గుర్తు కాదని, ఇప్పటికే సీవోఏ చైర్మన్ వినోద్ రాయ్ ఐసీసీకి లేఖ రాశారు. ధోనీ కీపింగ్ గ్లౌవ్స్ ఉన్న గుర్తు ఎలాంటి వాణిజ్య, మతపరమైనది కాదని రాయ్ లేఖలో తెలిపారు. అంతే కాదు ఆస్ట్రేలియాతో జరునున్న మ్యాచ్ సందర్భంగా ధోనీ ఇవే గ్లోవ్స్ తో ఆడడంతో పాటు, వరల్డ్ కప్ మొత్తం బలిదాన్ చిహ్నం కలిగిన గ్లోవ్స్ వాడతానని తేల్చిచెప్పడంతో, అటు నెటిజన్ల నుంచి కూడా విపరీతమైన మద్దతు లభిస్తోంది. మరోవైపు బీసీసీఐ చేసిన విజ్ఞప్తిని ఐసీసీ తోసిపుచ్చింది. ఐసీసీ నిబంధనల ప్రకారం వికెట్‌ కీపింగ్‌ గ్లోవ్స్‌పై తయారీదారుల లోగో మాత్రమే ఉండాలి... అయితే ఇప్పటికే ధోనీ గ్లోవ్స్‌పై తయారీదారుల లోగో ఉంది. అయితే బలిదాన్ గుర్తు స్పాన్సర్‌షిప్‌ నిబంధనలను అతిక్రమించినట్టవుతుందని ఐసీసీ వాదిస్తోంది.

    ఇదిలా ఉంటే ఐసీసీ క్లోతింగ్ అండ్ ఎక్విప్ మెంట్ రెగ్యులేషన్స్ నిబంధనల ప్రకారం, కీపింగ్ గ్లోవ్స్ మీద నాన్ కమర్షియల్ లోగో, చారిటీ లోగో ధరిస్తే మొదటి సారి హెచ్చరికతో వదిలేస్తారు. అయితే ఏడాదిలోగా రెండో సారి కూడా నిబంధనలను అతిక్రమిస్తే మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తారు. అయితే మూడో సారి కూడా ఇలాగే అతిక్రమిస్తే 50 శాతం మ్యాచ్ ఫీజులో కోత, నాలుగోసారి కూడా నిబంధనలను అతిక్రమిస్తే 75 శాతం మ్యాచ్ ఫీజులో కోత విధించనున్నారు.

    మరోవైపు టెరిటోరియల్‌ ఆర్మీలో లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో ధోని కొనసాగుతున్న నేపథ్యంలోనే ధోనీ తన కీపింగ్ గ్లౌవ్స్ పై అమరజవాన్ల బలిదానానికి స్మృతిగా ఈ బలిదాన్ చిహ్నాన్ని ముద్రించుకున్నారు. అయితే టీమిండియా అభిమానులు మాత్రం ధోనికి మద్దతుగా నిలుస్తున్నారు. ఐసీసీ మొండి పట్టుదలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధోనీ గ్లోవ్స్ పై బలిదాన్ చిహ్నం తీయాల్సి వస్తే ప్రపంచ కప్ ను బాయ్ కాట్ చేయాలనే డిమాండ్ క్రీడాభిమానుల్లో ఊపందుకుంది.
    First published: