• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • MS DHONI BOUGHT A NEW HORSE AND NAMED IT AS CHETAK SAKSHISINGH POSTED CHETAK IMAGES ON SOCIAL MEDIA JNK

MS Dhoni : 'చేతక్' కొన్న ఎంఎస్ ధోనీ.. ఇప్పుడు ఎందుకు దానిపై మనసు పారేసుకున్నాడు?

MS Dhoni : 'చేతక్' కొన్న ఎంఎస్ ధోనీ.. ఇప్పుడు ఎందుకు దానిపై మనసు పారేసుకున్నాడు?

ధోనీ వద్దకు చేరిన 'చేతక్'

  • Share this:
    టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) అంతర్జాతీయ క్రికెట్ (Cricket) నుంచి రిటైర్ అయిన దగ్గర నుంచి వ్యవసాయం, వ్యాపారం చేసుకుంటూ గడిపేస్తున్నాడు. ఐపీఎల్ సమయంలో తప్ప మిగతా సమయం అంతా రాంచీలోని తన ఫామ్‌హౌస్‌లో (Farm House) గడిపేస్తున్నాడు. సేంద్రీయ వ్యవసాయం చేస్తూ పలు రకాలు కూరగాయలు, పండ్లు పండిస్తూ బాగానే సంపాదిస్తున్నాడు. ధోనీ ఇటీవల 'చేతక్' కొన్నాడు. ధోనీకి చిన్నప్పటి నుంచి బైక్స్ అంటే చాలా ఇష్టమనే విషయం అందరికీ తెలుసు. అతడి వద్ద బైక్స్, కార్లకు సంబంధించి చాలా కలెక్షన్ ఉన్నది. మరి అలాంది ధోనీకి ఇప్పుడు 'చేతక్'తో (Chetak) అవసరం ఏమి వచ్చిందని మీకు అనుమానం వచ్చిందా? అయితే అది చేతకే కానీ స్కూటర్ కాదు. ధోనీ ఎంతో ఇష్టపడి ఒక కొత్త గుర్రాన్ని (Horse) కొన్నాడు. అది ఇటీవలే అతని వ్యవసాయ క్షేత్రంలోకి అడుగుపెట్టింది. దానికి 'చేతక్' అని పేరుపెట్టాడు. ఈ విషయాన్ని ధోనీ భార్య సాక్షి సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించింది. 'చేతక్‌కు సుస్వాగతం. ఇది చాలా మంచి జెంటిల్‌మాన్. ముఖ్యంగా లిల్లీని కలిసినప్పుడు ఇంకా సంతోషంగా ఉంటుంది. ఇది మా కుటుంబాన్ని అంగీకరించింది' అని పోస్టులో పేర్కొన్నది. లిల్లీ అంటే ధోనీ కుటుంబానికి చెందిన ఒక కుక్కపిల్ల.

    రాంచీలోని ఫామ్‌ హౌస్‌లో ఇప్పుడు చేతక్‌తో పాటు సామ్ లిల్లీ, జోయా, గబ్బర్ అనే నాలుగు కుక్కలు ఉన్నాయి. వీటిలో లిల్లీ, గబ్బర్ తెల్ల రంగు హస్కీలు, జోయా డచ్ షెపర్ట్, సామ్ బెల్జియం మలినోయిస్ జాతికి చెందినవి. ఇక ఐపీఎల్ 2021 సీజన్ వాయిదా కావడంతో ఆటగాళ్లందరూ సొంత ఇళ్లకు వెళ్లిపోయారు. కాగా, సీఎస్కేకు చెందిన జట్టు సభ్యులందరూ ఇళ్లకు చేరే వరకు తాను చెన్నై వదిలి వెళ్లనని ధోనీ చెప్పాడు. మైక్ హస్సీ, లక్ష్మీపతి బాలాజీ ప్రస్తుతం కరోనా నుంచి కోలుకున్నారు. వారిద్దరు వెళ్లిపోయాక ధోనీ రాంచీకి తిరిగి వెళ్లే అవకాశం ఉన్నది.









    ధోనీ కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. దీంతో పాటు అహ్మదాబాద్‌లో క్రికెట్ అకాడమీ కూడా ఒకటి నడిపిస్తున్నాడు. దీంతో పాటు ఒక స్పోర్ట్స్ వెంచర్ ఏర్పాటు చేసి ఆటగాళ్లను ప్రమోట్ చేస్తున్నాడు. దీంతో పాటు ఇండియన్ సూపర్ లీగ్‌లో ఒక జట్టుకు సహ యజమానిగా వ్యవహరిస్తున్నాడు.
    Published by:John Naveen Kora
    First published: