IND vs AUS 1st ODI: సిడ్నీ వన్డే‌లో తొలి పరుగుతో మరో మైలురాయి దాటిన ధోనీ...

ఆల్ టైమ్ గ్రేట్ కెప్టెన్ ధోనీ.. సిడ్నీ మ్యాచ్‌తో వన్డేల్లో భారత జట్టు తరఫున పదివేల పరుగుల మార్క్ దాటాడు. భారత ఇన్నింగ్స్ 6వ ఓవర్ ఆఖరి బంతికి సింగిల్ తీసి...ఈ ఘనత సాధించాడు.

news18-telugu
Updated: January 12, 2019, 9:52 PM IST
IND vs AUS 1st ODI: సిడ్నీ వన్డే‌లో తొలి పరుగుతో మరో మైలురాయి దాటిన ధోనీ...
భారత క్రికెట్ దిగ్గజం ధోనీ ( ICC/ TWITTER )
news18-telugu
Updated: January 12, 2019, 9:52 PM IST
భారత క్రికెట్ దిగ్గజం..ఆల్ టైమ్ గ్రేట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వన్డే ఫార్మాట్‌లో మరో మైలురాయిని అధిగమించాడు. సిడ్నీ మ్యాచ్‌తో వన్డేల్లో భారత జట్టు తరఫున పదివేల పరుగుల మార్క్ దాటాడు. భారత ఇన్నింగ్స్ 6వ ఓవర్ ఆఖరి బంతికి సింగిల్ తీసి...ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో స్కోర్ చేసిన తొలి పరుగుతోనే...టీమిండియా బ్యాట్స్‌మన్‌గా 10వేల క్లబ్‌లో చేరాడు. 330 వన్డేల్లో ధోనీ ఈ మ్యాజిక్ ఫిగర్ మార్క్ దాటం విశేషం. అంతకుముందే ఓవరాల్‌గా వన్డేల్లో 10వేల పరుగుల మార్క్ ఎప్పుడో దాటాడు. కానీ భారత జట్టు బ్యాట్స్‌మన్‌గా ఆ ఘనత సాధించడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ క్రికెట్‌లో ఐసీసీ తరఫున ఆసియా ఎలెవన్ జట్టుకు ఆడిన వన్డేల్లో 174 పరుగులు చేశాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో 10వేల పరుగుల క్లబ్‌లో చేరిన ఐదో భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డ్‌లకెక్కాడు. ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, దిగ్గజం రాహుల్ ద్రావిడ్,ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ తర్వాత పదివేల పరుగుల మైలురాయి దాటిన భారత బ్యాట్స్‌మన్ ధోనీనే.







గత ఏడాది జూలైలోనే వన్డేల్లో ఓవరాల్‌గా 10వేల పరుగులు మార్క్ దాటాడు. వన్డేల్లో ఆ ఘనత సాధించిన రెండో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర తర్వాతి స్థానంలో నిలిచాడు. ఇప్పటికే ఆల్ టైమ్ గ్రేట్ టీమిండియా కెప్టెన్‌గా ధోనీ వెలుగొందుతున్నాడు. కెప్టెన్సీకి గుడ్ బై చెప్పి ఇన్‌స్టంట్ వన్డే, టీ20 ఫార్మాట్లలో మాత్రమే భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2014లోనే ట్రెడిషనల్ టెస్ట్ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పాడు. భారత జట్టుకు వన్డే, ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్స్‌తో పాటు చాంపియన్స్ ట్రోఫీ సైతం అందించాడు. టెస్ట్‌ల్లో టీమిండియాను నెంబర్ వన్‌గా నిలిపాడు.
Loading....
First published: January 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు