హోమ్ /వార్తలు /క్రీడలు /

Gautam Gambhir : ' ఎంపీగా ఉంటూ ఐపీఎల్‌లో డబ్బు సంపాదించడానికి సిగ్గు పడట్లేదు '

Gautam Gambhir : ' ఎంపీగా ఉంటూ ఐపీఎల్‌లో డబ్బు సంపాదించడానికి సిగ్గు పడట్లేదు '

Gautam Gambhir

Gautam Gambhir

Gautam Gambhir : మెంటర్‌గా గౌతమ్ గంభీర్‌, లక్నో సూపర్ జెయింట్స్‌ని ప్లేఆఫ్స్‌కి చేర్చాడు. కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో లక్నో జట్టు, ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్‌సీబీతో ఓడి, నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.

గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కామెంటేటర్ గా తన ఇన్నింగ్స్ ఆరంభించాడు. ఆ తర్వాత ఐపీఎల్ లో కోచింగ్ స్టాఫ్ లో పనిచేస్తున్నాడు. ఐపీఎల్ 2022(IPL 2022) సీజన్‌లో గౌతమ్ గంభీర్.. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టుకి మెంటార్‌గా వ్యవహరించాడు. అతని పర్యవేక్షణలోని లక్నో.. ప్లే ఆఫ్స్ చేరింది. కేఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో కీలక ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్‌సీబీతో ఓటమిపాలై ఇంటిదారి పట్టింది. ఇక క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ గంభీర్..తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా గెలుపొందిన విషయం తెలిసిందే. ఇక ఎంపీగా ఉంటూనే ఐపీఎల్‌లో మెంటార్‌గా లక్నోకు సేవలందించాడు. అయితే కొందరు గంభీర్‌ను తప్పుబట్టారు. బాధ్యత గల పదవిలో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండకుండా డబ్బుల కోసం ఐపీఎల్‌లో పని చేస్తున్నాడని విమర్శించారు. వీటిపై గంభీర్ తాజాగా తనదైన శైలిలో ఘాటుగా సమాధానమిచ్చాడు.

తూర్పు ఢిల్లీ నియోజకవర్గానికి ఎంపీ బాధ్యతలు నిర్వహిస్తున్న గంభీర్​ గాంధీనగర్​లో పేదల కోసం జన్​రసోయ్​ పేరుతో ఒక్క రూపాయికే భోజనం అందేలా కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. ఆ ప్రాంతంలోనే ఓ లైబ్రరీని కూడా ఏర్పాటు చేశాడు. వీటి నిర్వహణ కోసమే తాను క్రికెట్​లో భాగమైనట్లు స్పష్టం చేశాడు గంభీర్.

"ప్రతీ నెలా నేను 5000 మందికి భోజనం అందించేందుకు రూ.25 లక్షలు ఖర్చు చేస్తున్నాను. అంటే ఏటా రూ.2.75 కోట్లు. లైబ్రరీ నిర్మించేందుకు కూడా నేను రూ.25 లక్షలు ఖర్చు చేశాను. ఇవన్నీ నా సొంతడబ్బులతో ఏర్పాటు చేసినవి. ఎంపీఎల్​ఏడీ ఫండ్​ నుంచి చేసినవి కావు. కాబట్టీ వీటి నిర్వహణకు నాకు డబ్బు అవసరం.

ఎంపీ ల్యాడ్ ఫండ్ ద్వారా వచ్చే డబ్బులతో మా కిచెన్‌లో వంట సామాను కూడా కొనలేం. వీటన్నింటికీ ఖర్చు పెట్టడానికి మా ఇంట్లో డబ్బులు కాచే చెట్టు లేదు. అందుకే ఐపీఎల్‌లో పనిచేస్తూ సంపాదిస్తున్నా.ఇలా డబ్బు కోసం పనిచేస్తున్నందుకు నాకు సిగ్గుగా ఏమీ లేదు. నా లక్ష్యం చేరేందుకే ఇదంతా చేస్తున్నాను." అని తనపై విమర్శలు చేస్తున్నవారికి ఘాటుగానే రిప్లై ఇచ్చాడు.

ఇది కూడా చదవండి :  8 పరుగులకే ఆలౌట్.. 7 బంతుల్లోనే విజయం.. లోకల్​ టోర్నీ అనుకుంటే పప్పులో కాలేసినట్టే..!

మెంటర్‌గా గౌతమ్ గంభీర్‌, లక్నో సూపర్ జెయింట్స్‌ని ప్లేఆఫ్స్‌కి చేర్చాడు. కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో లక్నో జట్టు, ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్‌సీబీతో ఓడి, నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. అంతకుముందు సీజన్లలో అనాలసిస్ట్‌గా, కామెంటేటర్‌గా వ్యవహరించిన కెఎల్ రాహుల్, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఐపీఎల్‌లో సంబంధాలు పెట్టుకోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

First published:

Tags: Cricket, Gautam Gambhir, IPL 2022, Lucknow Super Giants, Team India

ఉత్తమ కథలు