MOTO GP ACCIDENTS MARC MARQUEZ HORRIFIC ACCIDENT AT INDONESIA GP SJN
Moto GP: బైక్ అదుపు తప్పడంతో అమాంతం గాల్లోకి లేచిన మాజీ చాంపియన్... బైక్ రేసింగ్ చరిత్రలో ఇదే అతిపెద్ద ప్రమాదం
మార్క్ మార్కజ్ బైక్ ప్రమాదం
Moto GP: బైక్ రేసింగ్ ఈవెంట్ మోటో జీపీ (Moto GP) లో ఘోరం చోటు చేసుకుంది. గత వారం జరిగిన ఇండోనేసియా (indonesia) గ్రాండ్ ప్రిలో బైక్ రేసింగ్ చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదం చోటుచేసుకుంది.
Moto GP: బైక్ రేసింగ్ ఈవెంట్ మోటో జీపీ (Moto GP) లో ఘోరం చోటు చేసుకుంది. గత వారం జరిగిన ఇండోనేసియా (indonesia) గ్రాండ్ ప్రిలో బైక్ రేసింగ్ చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదం చోటుచేసుకుంది. హోండా (Honda) రైడర్ (Rider)... ఆరు సార్లు ప్రపంచ చాంపియన్ మార్క్ మార్కజ్(marc marquez) బైక్ ఘోర ప్రమాదానికి గురైంది. మార్కజ్ తన బైక్ తో ట్రాక్ పైకి రాగా... వార్మప్ ల్యాప్ లో ఉన్నట్లుండి అతడి బైక్ అదుపుతప్పింది. దాంతో బైక్ తో పాటు మార్కజ్ గాల్లోకి చాలా ఎత్తులేచి దూరంగా విసరబడ్డాడు.
బైక్ రేసింగ్ అంటేనే ప్రాణాలతో చెలగాటం లాంటిది. రేసింగ్ సమయంలో రైడర్లు దాదాపు 300 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంటారు. ఈ సమయంలో కొంచెం తేడా జరిగినా అంతే... భారీ ప్రమాదం జరిగేందుకు ఆస్కారం ఉంటుంది. గతేడాది మోటో జీపీ 3 డ్రైవర్ జేసన్ కూడా ఇలాంటి ప్రమాదానికి గురయ్యే మరణించాడు. ఇండోనేసియా గ్రాండ్ ప్రి సందర్భంగా మార్కజ్ తన బైక్ తో రేసు ట్రాక్ పైకి వచ్చాడు. వార్మప్ ల్యాప్ చేస్తోండగా... ఒక టర్న్ దగ్గర అతడి బైక్ వెనుక చక్రం అదుపు తప్పింది. ఆ సమయంలో మార్కజ్ దగ్గర దగ్గర 200 కిలోమీటర్ల వేగంతో ఉన్నాడు. బైక్ అదుపు తప్పడంతో ఒక్కసారిగా గాల్లోకి లేచిన అతడు... పల్టీలు కొడుతూ ట్రాక్ కు దూరంగా విసిరి వేయబడ్డాడు. ఇక బైక్ అయితే ముక్కలు ముక్కలుగా విడిపోయింది.
A testament to how good modern protective gear is, we're incredibly happy to see and hear that he's OK! See you in Argentina, Marc! 💪#IndonesianGP 🇮🇩 pic.twitter.com/GKAaOAFauw
అదృష్టం కొద్ది మార్కజ్ ఈ ఘోర ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అతడు ప్రాణాలతో భయపట పడటంతో అభిమానులతో పాటు రేసు నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం అనంతరం అతడికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు రేసింగ్ చేయడానికి అన్ ఫిట్ గా పేర్కొన్నారు. దాంతో అతడు ఇండోనేసియా గ్రాండ్ ప్రి నుంచి తప్పించుకున్నాడు. అయితే ఈ ప్రమాదం వల్ల అతడు డిప్లోపియా (diplopia) బారిన పడ్డాడు. డిప్లోపియా అనేది చూపుకు సంబంధించిన ఓ అరుదైన వ్యాధి. దీని వల్ల ఒక వస్తువు రెండుగా కనిపిస్తాయి. కంటికి ప్రమాదం జరగడం... లేదంలే తలకు ఏదైన దెబ్బ తగలడం వంటి వాటి వల్ల దీని బారిన పడే అవకాశం ఉంది. ఈ ప్రమాదం కారణంగానే మార్కజ్ డిప్లోపియా బారిన పడ్డట్లు తెలుస్తోంది. గతంలోనూ మార్కజ్ ఈ వ్యాధితో బాధపడ్డాడు. గతంలోనూ మార్కజ్ రేసింగ్ చేసే సమయంలో పలుమార్లు ప్రమాదాలకు గురయ్యాడు. 2020లో అతడి చేయి కూడా విరిగింది. దాంతో అతడు చాలా రేసుల్లో పాల్గొనలేదు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.