#FlashBack2018: గత ఏడాది చరిత్రను తిరగరాసిన భారత క్రీడాకారిణులు

2018లో భారత క్రీడాకారిణులు అంచనాలకు మించి రాణించారు. బ్యాడ్మింటన్ క్వీన్...తెలుగు తేజం పీవి సింధు వరల్డ్ టూర్ ఫైనల్స్ నెగ్గిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది.

news18-telugu
Updated: January 1, 2019, 12:39 PM IST
#FlashBack2018: గత ఏడాది చరిత్రను తిరగరాసిన భారత క్రీడాకారిణులు
మను భకర్, పీవి సింధు, వినేష్ ఫోగట్, మేరీ కోమ్ ( Image : Reuters )
  • Share this:
2018 ఏడాదిలో క్రీడల్లో పురుషులు మాత్రమే కాదు మహిళలు సైతం అంచనాలకు మించి రాణించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన బ్యాడ్మింటన్ క్వీన్ పీవి సింధు,సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచి పురుషులకు తామేమీ తీసిపోమని నిరూపించారు.   కొంతమంది చరిత్రను తిరగరాస్తే...మరికొంతమంది అరుదైన ఘనతలు సొంతం చేసుకున్నారు. బాక్సర్ మేరీ కోమ్, షూటర్ మను భకర్, క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్, రెజ్లర్ వినేష్ ఫోగట్, స్ప్రింటర్లు హిమ దాస్, స్వప్న బర్మన్ తమదైన ముద్ర వేశారు.

2018 ఏడాదిలో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచిన క్రీడాకారిణులు



పీవి సింధు - 2018లో పీవి సింధు ఎన్నో ప్రతిష్టాత్మక టైటిల్స్ సాధించి దేశానికే గర్వకారణంగా నిలిచింది. బ్యాడ్మింటన్ వరల్డ్ టూర్ ఫైనల్స్ టైటిల్ నెగ్గిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృస్టించింది. కామన్వెల్త్ గేమ్స్‌ సింగిల్స్‌లో సిల్వర్ మెడల్, టీమ్ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్‌తో పాటు ఆసియా గేమ్స్‌‌, బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లోనూ సిల్వర్ మెడల్స్ నెగ్గింది.



మిథాలీ రాజ్- భారత క్రికెట్ క్వీన్ మిథాలీ రాజ్ 2018లో మరో అరుదైన రికార్డ్ తన ఖాతాలో వేసుకుంది. 84 టీ20 మ్యాచుల్లో 2,232 పరుగులు చేసిన భారత వన్డే కెప్టెన్ మిథాలీరాజ్... ఇండియా తరుపున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసింది.

మేరీ కోమ్ - భారత బాక్సింగ్ క్వీన్ మేరీ కోమ్..2018 ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కనీ వినీ రీతిలో రికార్డ్ క్రియేట్ చేసింది. బాక్సింగ్ వరల్డ్ చాంపియన్స్‌లో 6 సార్లు స్వర్ణ పతకాలు నెగ్గిన తొలి బాక్సర్‌గా చరిత్ర సృష్టించింది.

హర్మన్ ప్రీత్ కౌర్- భారత మహిళల ట్వంటీ ట్వంటీ టీమ్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్...2018 టీ20 వరల్డ్‌కప్‌లో చరిత్ర సృష్టించింది. ప్రపంచకప్‌లో సెంచరీ సాధించిన తొలి మహిళగా హర్మన్ హిస్టరీ క్రియేట్ చేసింది.ద్యుతీ చంద్- భారత స్ప్రింటర్ ద్యుతీ చంద్ 2018 ఆసియా గేమ్స్ 100 మీటర్ల డ్యాష్ ఈవెంట్‌లో సిల్వర్ మెడల్ నెగ్గింది. 100 మీటర్ల డ్యాష్ ఈవెంట్‌లో 20 ఏళ్ల తర్వాత మెడల్ నెగ్గి తొలి మహిళగా రికార్డ్‌లకెక్కింది. అదే గేమ్స్‌ 200 మీటర్ల ఈవెంట్‌లోనూ సిల్వర్ మెడల్ నెగ్గింది.

హిమదాస్- స్ప్రింటర్ హిమదాస్ జూనియర్ అథ్లెటిక్స్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో గోల్డ్ మెడల్ నెగ్గి దేశానికే గర్వకారణంగా నిలిచింది. 2018 ఆసియా గేమ్స్‌లోనూ 400 మీటర్ల ఈవెంట్‌లో స్వర్ణం నెగ్గిన తొలి భారతీయురాలిగా చరిత్రను తిరగరాసింది.

మానిక బాత్రా- టేబుల్ టెన్నిస్ స్టార్ మానిక బాత్రా 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో రెండు గోల్డ్ మెడల్స్, ఒక్క సిల్వర్, బ్రాంజ్ మెడల్ నెగ్గింది. ఆసియా గేమ్స్‌లోనూ మానికా కాంస్య పతకం నెగ్గింది. భారత టేబుల్ టెన్నిస్  స్టార్ మానికా బాత్రా  2018వ సంవత్సరానికి బ్రేక్‌త్రూ స్టార్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్‌  సొంతం చేసుకుంది. అవార్డ్ నెగ్గిన తొలి భారతీయురాలిగా మానికా బాత్రా  చరిత్ర సృష్టించింది.

మను భకర్- 16 ఏళ్ల షూటర్ మను భకర్ షూటింగ్ వరల్డ్ కప్‌ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ సింగిల్స్, మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్స్‌లో స్వర్ణ పతకాలు నెగ్గింది. 2018 కామన్వెల్త్ గేమ్స్‌‌లోనూ 10 మీటర్ల షూటింగ్‌లోనూ స్వర్ణం సొంతం చేసుకుంది. అర్జెంటీనా వేదికగా జరిగిన యూత్ ఒలింపిక్స్‌ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ సింగిల్స్, మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్స్‌లో గోల్డ్, సిల్వర్ మెడల్స్ దక్కించుకుంది.
మేరీ కోమ్- భారత బాక్సింగ్ క్వీన్ మేరీ కోమ్..2018 ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కనీ వినీ రీతిలో రికార్డ్ క్రియేట్ చేసింది. బాక్సింగ్ వరల్డ్ చాంపియన్స్‌లో 6 సార్లు స్వర్ణ పతకాలు నెగ్గిన తొలి బాక్సర్‌గా చరిత్ర సృష్టించింది.

స్వప్న బర్మన్- ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్‌లో భారత్‌కు హెప్టాథ్లాన్‌లో తొలి స్వర్ణ పతకం అందించిన క్రీడాకారిణిగా స్వప్న బర్మన్ చరిత్రను తిరగరాసింది. నిరుపేద కుటుంబానికి చెందిన స్వప్న ఏషియాడ్ స్వర్ణంతో దేశంలో ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచింది.

వినేష్ ఫోగట్- 2018 ఆసియా గేమ్స్ మహిళల రెజ్లింగ్ 50 కేజీల ఫ్రీ స్టైల్ ఈవెంట్‌లో 23 ఏళ్ల వినేష్ ఫోగట్ హిస్టరీ క్రియేట్ చేసింది. 50 కేజీల ఫ్రీ స్టైల్ ఈవెంట్‌లో స్వర్ణం నెగ్గి ఆసియా గేమ్స్‌ రెజ్లింగ్‌లో స్వర్ణం నెగ్గిన తొలి భారత మహిళగా చరిత్రకెక్కింది.67 ఏళ్ల ట్రాక్ రికార్డ్‌ కలిగిన ఏషియాడ్‌లోని కుస్తీ పోటీల్లో గోల్డ్ మెడల్ నెగ్గిన మొట్టమొదటి భారతీయురాలిగా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

First published: December 20, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు