‘మంకీగేట్’ వివాదమే నా కెరీర్‌ను నాశనం చేసింది - ఆండ్రూ సైమండ్స్

ఆ ఒత్తిడిని తట్టుకోలేకే మద్యానికి బానిసయ్యా... నా టీమ్‌మేట్సే ఈ రొంపిలోకి లాగారు...’ ఓ మీడియా ఇంటర్వ్యూలో ఆండ్రూ సైమండ్స్

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: November 2, 2018, 10:08 PM IST
‘మంకీగేట్’ వివాదమే నా కెరీర్‌ను నాశనం చేసింది - ఆండ్రూ సైమండ్స్
2008 సిడ్నీ టెస్ట్ మ్యాచ్‌లో హర్భజన్ సింగ్, ఆండ్రూ సైమండ్స్ (Photo by Ezra Shaw/Getty Images)
  • Share this:
ఆండ్రూ సైమండ్స్... ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్‌లో కీలక సభ్యుడిగా, ఆల్‌రౌండర్‌గా ఆసీస్ జైత్రయాత్రలో పాలుపంచుకున్న క్రికెటర్. ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ సారథ్యంలో నడిచిన ఆస్ట్రేలియా టీమ్, వరల్డ్ క్రికెట్ టీమ్‌లన్నింటినీ వణుకు పుట్టించింది. వరుస విజయాలతో మిగిలిన జట్లకు కునుకు లేకుండా చేసింది. అలాంటి పటిష్టమైన టీమ్‌లో ఎంతో టాలెంటెడ్ ప్లేయర్‌గా కొనసాగిన ఆండ్రూ సైమండ్స్ అర్ధంతరంగా క్రికెట్ నుంచి వైదొలిగాడు. 2008 జనవరిలో సిడ్నీ టెస్ట్‌లో భారత బౌలర్ హర్భజన్ సింగ్, ఆండ్రూ సైమండ్స్ మధ్య జరిగిన ‘మంకీ’ వివాదం అప్పట్లో పెను సంచలనం క్రియేట్ చేసింది.

ఆసీస్ క్రికెటర్లకు సిజ్లింగ్ బాగా అలవాటు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బ్యాట్స్‌మెన్‌ ఏకాగ్రతను దెబ్బతీసేలా సూటిపోటి మాటలనడం ఆసీస్ క్రికెటర్లకు బాగా అలవాటు. భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా దీన్ని బాగా ఒంటబట్టించుకున్నాడు. సైమండ్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బౌలింగ్ చేసిన బజ్జీ... ‘మంకీ’ అంటూ సంభోదించాడు. ఈ వ్యాఖ్యలు జాత్యాహంకారాన్ని ప్రతిబింబించేవిగా పరిగణిస్తారు ఆస్ట్రేలియన్లు. దాంతో వివాదం చాలా ముదిరింది. క్రికెట్ ఆస్ట్రేలియా ఐసీసీకి ఫిర్యాదు చేయడం, అంతర్జాతీయ క్రికెట్ మండలి బజ్జీపై మూడు మ్యాచ్‌ల నిషేధం విధించడం జరిగిపోయాయి. అయితే ఈ వివాదాన్ని భారత జట్టు సీరియస్‌గా తీసుకుంది. బజ్జీకి సపోర్టుగా నిలిచిన సచిన్ టెండుల్కర్... ‘హర్భజన్ అలా అనలేదు... అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న నాకు వినిపించలేదు’ అంటూ ఐసీసీ విచారణలో పేర్కొన్నాడు. దీంతో బజ్జీపై నిషేధాన్ని ఎత్తవేయకపోతే ఆసీస్ టూర్ మధ్య నుంచి వెళ్లిపోతామని బీసీసీఐ, ఐసీసీని హెచ్చరించింది. దాంతో ఐసీసీ కూడా వెనక్కితగ్గింది.

ఈ ఘటన తర్వాత మనస్థాపానికి గురైన సైమండ్స్... మద్యానికి బానిస అయ్యాడు. తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు సైమండ్స్.

‘మంకీగేట్’ వివాదంతోనే నా కెరీర్ పతనమైంది. ఒత్తిడిని తట్టుకోలేక మద్యానికి పూర్తిగా అలవాటు పడిపోయాను. నా టీమ్‌మేట్సే ఈ రొంపిలోకి లాగారు. వివాదాన్ని రేపడానికి కారణమయ్యాడు. ఇష్యూ పెద్దగా అయిన తర్వాత ఇలా చేసి తప్పు చేశావని నిందించారు. అప్పుడే ఈ ఇష్యూను నేను ట్రీట్ చేసిన విధానం తప్పని అర్థమైంది.


ఆండ్రూ సైమండ్స్, ఆసీస్ మాజీ క్రికెటర్


భారత్ పర్యటనలో కూడా బజ్జీ తనను ‘కోతి’ అని పిలిచాడని చెప్పిన సైమండ్స్, 2009 జూన్‌లో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లి, బజ్జీతో అలా పిలవవద్దని వేడుకున్నా అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వివాదం తర్వాత బజ్జీ, సైమండ్స్ కలిసి ఐపీఎల్‌లో కలిసికట్టుగా ఆడడం విశేషం.

First published: November 2, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...