HCA అధ్యక్షుడిగా అజారుద్దీన్ ఘన విజయం

భారత జట్టు మాజీ కెప్టెన్, క్రికెటర్ అజారుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా విజయం సాధించారు. 146 ఓట్లతో అజారుద్దీన్ ఘన విజయం సాధించారు.

news18-telugu
Updated: September 27, 2019, 4:34 PM IST
HCA అధ్యక్షుడిగా అజారుద్దీన్ ఘన విజయం
అజారుద్దీన్ (File)
  • Share this:
భారత జట్టు మాజీ కెప్టెన్, క్రికెటర్ అజారుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా విజయం సాధించారు. 74 ఓట్లతో అజారుద్దీన్ ఘన విజయం సాధించారు. హెచ్‌సీఏ ఎన్నికల్లో ప్రధానంగా మూడు ప్యానెల్స్ బరిలో నిలిచాయి. అయితే, వాటిలో అజారుద్దీన్, ప్రకాశ్ చంద్ జైన్ ప్యానెళ్ల మధ్య ప్రధానంగా పోటీ ఉంది. దిలీప్ కుమార్ ప్యానెల్ కూడా బరిలో ఉన్నా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. హెచ్‌సీఏలో మొత్తం 226 మంది సభ్యులు ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఓటింగ్ జరిగింది. 4 గంటలకు ఫలితాలను వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో హెచ్‌సీఏ ఎన్నికలను నిర్వహించారు. మొత్తం ఆరు పదవులకు 17 మంది పోటీలో నిలిచారు. తొలుత 62 మంది నామినేషన్ వేశారు. అందులో 45 మంది నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు. హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు జి.వివేక్ వెంకటస్వామి దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. హెచ్‌సీఏ అధ్యక్ష పీఠానికి అజారుద్దీన్, ప్రకాశ్ చంద్ జైన్, దిలీప్ కుమార్ పోటీ పడ్డారు.

హెచ్‌సీఏలో మొత్తం 226 సభ్యులు ఉన్నారు. అందులో 223 ఓట్లు పోల్ అయ్యాయి. క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ చివరి నిమిషంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలైన ఓట్లలో అజారుద్దీన్‌కు 147 ఓట్లు, ప్రకాశ్ చంద్ జైన్‌కు 73, దిలీప్ కుమార్‌కు 3 ఓట్లు పడ్డాయి. దీంతో 74 ఓట్లతో అజారుద్దీన్ అధ్యక్షుడిగా గెలిచినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సంపత్ ప్రకటించారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 27, 2019, 4:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading