Mohammed Siraj: తండ్రి అంత్యక్రియలు.. సిరాజ్ సంచలన నిర్ణయం.. BCCI ప్రకటన

Mohammed Siraj: తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బీసీసీఐ అవకాశం కల్పించినప్పటికీ.. జట్టుతోనే ఉండాలని మహమ్మద్ సిరాజ్ నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.

news18-telugu
Updated: November 21, 2020, 9:52 PM IST
Mohammed Siraj: తండ్రి అంత్యక్రియలు.. సిరాజ్ సంచలన నిర్ణయం.. BCCI ప్రకటన
తల్లిదండ్రులతో మహ్మద్ సిరాజ్ (ఫొటో-PTI)
  • Share this:
హైదరాబాద్‌కు చెందిన భారత క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) ఇంట్లో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన తండ్రి మహమ్మద్ గౌస్ అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం కన్నుమూశారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు మహమ్మద్ సిరాజ్. తండ్రి మరణించడంతో సిరాజ్ ఇండియాకు తిరిగి వచ్చేస్తాడని.. అంతక్రియలు ముగిసిన తర్వాత మళ్లీ టీమిండియాలో జాయిన్ అవుతాడని అందరూ భావించారు. కానీ సిరాజ్ మాత్రం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బీసీసీఐ అవకాశం కల్పించినప్పటికీ.. జట్టుతోనే ఉండాలని అతడు నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.

బీసీసీఐ ప్రకటన


'' టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ తండ్రి తీవ్ర అనారోగ్యంతో మరణించారు. సిరాజ్‌తో బీసీసీఐ మాట్లాడింది. తిరిగి ఇండియాకు వెళ్లి, ఫ్యామిలీతో ఉండేందుకు అనుమతి ఇచ్చింది. కానీ సిరాజ్ జట్టుతోనే ఉండాలని, తన విధులను నిర్వర్తించాలని నిర్ణయించుకున్నాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సిరాజ్‌కు తోడుగా ఉంటాం.'' అని బీసీసీఐ గౌరవ కార్యదర్శి జయ్ షా పేర్నొన్నారు. ఈ మేరకు బీసీసీఐ ట్వీట్ చేసింది.


సిరాజ్ తండ్రి ఉపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధ పడ్డారు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే ప్రస్తుత్తం సిరాజ్ ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ఆస్ట్రేలియా టూర్‌కు ఎంపికైన ఇండియా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ప్రాక్టీస్ సెషన్స్‌ నుంచి వచ్చిన తర్వాత సిరాజ్‌కు ఈ విషయం గురించి తెలిసిందని స్పోర్ట్‌స్టార్ వెబ్‌సైట్ పేర్కొంది.

"మా నాన్న ఎప్పుడూ.. నేను దేశాన్ని గర్వించేలా చేయాలి అని కోరుకునేవాడు. ఆయన మరణవార్త నన్ను షాక్‌కు గురిచేసింది. నా జీవితంలో అతిపెద్ద మద్దతును కోల్పోయాను. నేను దేశం కోసం ఆడటం మా నాన్న కళ. నేను దాన్ని నేరవేర్చి ఆయనను ఆనందపరిచాను" అని సిరాజ్ స్పోర్ట్‌స్టార్ వెబ్‌సైట్‌కు తెలిపారు.

ఇక, యూఏఈలో జరిగిన ఐపీఎల్ 2020లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున మహమ్మద్ సిరాజ్ ఆడిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ జరుగుతున్న సమయంలోనే సిరాజ్.. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి బాగోలేదని ఓ వీడియో ద్వారా చెప్పాడు. ఇది తనకు ఆందోళన కలిగిస్తోందని కూడా తెలిపాడు. ప్రస్తుతం ఆయన వద్దకు వెళ్లలేని.. ఫోన్‌లో మాట్లాడుతున్నానని కన్నీరు పెట్టుకున్నాడు. ఐతే ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేయడంతో సిరాజ్‌ను ఆస్ట్రేలియా టూర్‌కు ఎంపిక చేసింది బీసీసీఐ.
Published by: Shiva Kumar Addula
First published: November 21, 2020, 9:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading