హోమ్ /వార్తలు /క్రీడలు /

Mohammed Siraj : సిరాజ్ కి చేదు అనుభవం.. విలువైన వస్తువులన్న బ్యాగ్ మాయం.. వారి నిర్లక్ష్యమే కారణం!

Mohammed Siraj : సిరాజ్ కి చేదు అనుభవం.. విలువైన వస్తువులన్న బ్యాగ్ మాయం.. వారి నిర్లక్ష్యమే కారణం!

PC : TWITTER

PC : TWITTER

Mohammed Siraj : మొన్న శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur).. నిన్న దీపక్ చాహర్ (Deepak Chahar).. ఇప్పుడు మహ్మద్ సిరాజ్( Mohammed Siraj).. వరుస పెట్టి టీమిండియాకు క్రికెటర్లకు చేదు అనుభవాలు ఎదురువుతున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మొన్న శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur).. నిన్న దీపక్ చాహర్ (Deepak Chahar).. ఇప్పుడు మహ్మద్ సిరాజ్( Mohammed Siraj).. వరుస పెట్టి టీమిండియాకు క్రికెటర్లకు చేదు అనుభవాలు ఎదురువుతున్నాయి. ముఖ్యంగా విమాన ప్రయాణాల్లో ఇబ్బందులకు గురవుతున్నారు మన టీమిండియా క్రికెటర్లు. విమాన సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా సమస్యలు ఎదురవుతున్నాయి. వాస్తవానికి విమానాశ్రయంలో ప్రతి ఒక్కరూ అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ, టీమిండియా (Team India) క్రికెటర్లు ఈ మధ్య బాధితులవ్వడం హాట్ టాపిక్ గా మారింది. కొద్ది రోజుల క్రితం.ముంబై ఎయిర్‌పోర్ట్ టెర్మినల్-2 నుంచి శార్దూల్ బ్యాగ్ మాయమైంది. ఆ తర్వాత శార్దూల్ ట్వీట్ చేస్తూ సాయం కోరాడు. ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది నిర్వాకానికి శార్దూల్‌ ఠాకూర్‌ కాస్త నిరుత్సాహానికి గురయ్యాడు. ఆ తర్వాత హార్భజన్ ట్వీట్ తో ఎయిర్ పోర్ట్ సిబ్బంది బ్యాగ్ ను శార్దూల్ కి అప్పగించేలా ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత న్యూజిలాండ్ నుంచి బంగ్లాదేశ్ వెళ్లిన దీపక్ చహర్ లగేజీని విమాన సిబ్బంది రెండు రోజుల వరకు అతనికి అందించకపోవం చర్చనీయాంశమైంది.

ఇప్పుడు మన హైదరాబాద్ గల్లీ స్టార్ మహ్మద్ సిరాజ్ కు ఇలాంటి సమస్య ఎదురైంది. బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా క్రికెటర్, హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ విస్తారా విమానంలో మంగళవారం ఢాకా నుంచి ముంబై చేరుకున్నారు. కానీ, ఎయిర్ పోర్టులో దిగిన తర్వాత సిరాజ్ మూడు బ్యాగుల్లో రెండు మాత్రమే వచ్చాయి. ఈ విషయం అక్కడి సిబ్బందికి చెబితే వెంటనే తెచ్చిపెడతామని చెప్పారని, కానీ, ఎంతకీ రాలేదు. ఈ విషయాన్ని సిరాజ్ స్వయంగా ట్వీట్ల ద్వారా తెలిపాడు.

అయితే తన మూడు బ్యాగుల్లో ఒక బ్యాగ్ మిస్సయ్యిందని సిరాజ్ ఫిర్యాదు చేశాడు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా తెలియజేస్తూ.. ఎయిర్‌లైన్స్‌కు ఫిర్యాదు చేశాడు. " నేను 26వ తేదీన వరుసగా UK 182, UK 951 విమానంలో ఢాకా నుంచి ఢిల్లీ మీదుగా ముంబైకి ప్రయాణించాను. నేను మూడు బ్యాగ్‌లతో చెక్ ఇన్ అయ్యాను. వాటిలో 1 మిస్ అయ్యింది. కొద్దిసేపటిలో బ్యాగ్ కనుగొని డెలివరీ చేస్తామని ఎయిర్ లైన్స్ హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.

నా ముఖ్యమైన వస్తువులు అన్నీ ఆ బ్యాగ్ లోనే ఉన్నాయి. ఈ ప్రక్రియను వేగవంతం చేసి, హైదరాబాద్‌లో నాకు వీలైనంత త్వరగా బ్యాగ్‌ను డెలివరీ చేయమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను." అంటూ ఎయిర్ విస్తారాను ట్యాగ్ చేస్తూ సిరాజ్ విజ్ఞప్తి చేశాడు. సిరాజ్ ట్వీట్‌కు స్పందించిన ఎయిర్ విస్తారా.. తమ సిబ్బంది త్వరలోనే లగేజ్ వెతికి మీకు అందజేస్తారని బదులిచ్చింది. ఈ ఘటనతో విస్తారా ఎయిర్‌లైన్స్‌పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై స్పందించిన ఫ్యాన్స్, నెటిజన్లు విమాన సర్వీసుపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

First published:

Tags: Cricket, Mohammed Siraj, Team India, Vistara Airlines

ఉత్తమ కథలు