ఐపీఎల్ వల్ల తనకు మేలే జరిగిందని అన్నాడు భారత పేసర్ మహమ్మద్ షమీ. ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన కనబరచడం.. తానిప్పుడు రైట్ జోన్‌లో ఉన్నానని వెల్లడించాడు."ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫన నా ప్రదర్శన.. నాలో ఎంతో విశ్వాసాన్ని పెంచింది. నన్ను సరైన ఫామ్‌లో పెట్టింది"అని షమీ బీసీసీఐ. టీవీకి చెప్పారు. ఆస్ట్రేలియాను సొంతగడ్డపై ఓడించగల సత్తా టీమిండియా ఆటగాళ్లలో ఉందన్నారు. ఐపీఎల్ 2020లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున మంచి బౌలింగ్ ప్రదర్శన ఇచ్చిన షమీ.. ఈ సీజన్‌లో మొత్తం 20 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌కే హైలెట్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌తో డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్‌లో ఆ జట్టు బ్యాట్స్‌మెన్ పరుగులు చేయకుండా షమీ నియంత్రించాడు.
"ఐపీఎల్ వల్ల అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే నేను ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రీపేర్ అవుతున్నా. నాపై ఎలాంటి భారం లేదు. నేను ఇప్పుడు చాలా కంఫర్టేబుల్‌గా ఉన్నాను. నేను లాక్‌డౌన్‌లో ఫిట్‌నెస్ కోసం, బౌలింగ్ కోసం చాలా కష్టపడ్డాను. ఐపీఎల్ కోసం మాత్రమే కాకుండా నా గురించి నేను సాధన చేశాను. మా ఆస్ట్రేలియా టూర్ సుదీర్ఘంగా సాగనుంది. అనుకున్న లెంత్‌లో బాల్‌ను పిచ్ చేయగలిగినప్పుడు.. అన్ని ఫార్మాట్లలో సక్సెస్ అయినట్టు అని నేను ఎప్పుడూ భావిస్తాను. ఐపీఎల్ తర్వాత వైట్ బాల్ మీద మంచి నియంత్రణ వచ్చింది.. ఇప్పుడు నెట్స్‌లో రెడ్ బాల్‌తో సాధన ఎక్కువగా చేస్తున్నాను. రెండు ఫార్మట్స్ భిన్నమైనవే అయినప్పటి.. బెసిక్స్‌లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు.
గత సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టులో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ మిస్ అయ్యారు. ఇప్పుడు వాళ్లు జట్టులో ఉండటం వారికి మరింత బలాన్ని ఇస్తుంది. మేము మా బౌలింగ్ నైపుణ్యాల మీద దృష్టిని కేంద్రీకరించాం. ఎంత పెద్ద వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మెన్ అయినా ఓ మంచి బంతి అతన్ని ఔట్ చేస్తోంది. మనకు మంచి బౌలర్లు ఉన్నారు. మన పాస్ట్ బౌలర్స్ 140 కి.మీ వేగంతో బౌలింగ్ చేయగలరు"అని షమీ తెలిపాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India vs australia, IPL 2020, Mohammed Shami