మూడు సార్లు సూసైడ్ చేసుకోవాలనుకున్న టీమిండియా ప్లేయర్

టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీ ఆత్మహత్య చేసుకోవాలని మూడుసార్లు అనుకున్నాడట.

news18-telugu
Updated: May 3, 2020, 2:32 PM IST
మూడు సార్లు సూసైడ్ చేసుకోవాలనుకున్న టీమిండియా ప్లేయర్
మహ్మద్ షమీ (File)
  • Share this:
టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీ ఆత్మహత్య చేసుకోవాలని మూడుసార్లు అనుకున్నాడట. ఈ విషయాన్ని షమీనే వెల్లడించాడు. 2015 వరల్డ్ కప్ తర్వాత అతడిని గాయాలు వెంటాడాయి. దీంతో మళ్లీ ఫామ్‌లోకి రావడానికి, ఫిట్‌గా మారడానికి సుమారు ఏడాదిన్నర సమయం పట్టింది. అదే సమయంలో కుటుంబంలో కూడా సమస్యలు తలెత్తాయి. ఆ సమయంలో మూడుసార్లు ఆత్మహత్య చేసుకోవాలని భావించానని షమీ తెలిపాడు. అయితే, తన కుటుంబసభ్యుల ఇచ్చిన మానసిక స్థైర్యంతో బయటపడినట్టు చెప్పాడు. ఆ సమయంలో తన కుటుంబసభ్యులు తనకు మద్దతుగా నిలవకపోయి ఉంటే, తాను ఏదో ఒక నిర్ణయం తీసేసుకువాడినని చెప్పాడు. టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మతో నిర్వహించిన ఇన్ స్టా చాట్‌లో షమీ ఈ విషయాన్ని వెల్లడించాడు. పలువురు అమ్మాయిలతో వివాహేతర సంబంధం పెట్టుకున్న తన భర్త, అతడి కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని షమీ భార్య హసీన్ జహాన్ గతంలో కేసు పెట్టింది. గత ఏడాది ఐపీఎల్‌కు ముందు గృహహింస కేసు కూడా పెట్టింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: May 3, 2020, 2:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading