కైఫ్ లాక్ డౌన్ కబుర్లు.. దాదా ఫేస్ టు ఫేస్, ధోనీ ఫ్యాన్...

కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ తన లాక్ డౌన్ కబుర్లను నెటిజన్లతో పంచుకున్నాడు.

news18-telugu
Updated: May 21, 2020, 9:55 PM IST
కైఫ్ లాక్ డౌన్ కబుర్లు.. దాదా ఫేస్ టు ఫేస్, ధోనీ ఫ్యాన్...
మహ్మద్ కైఫ్
  • Share this:
కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ తన లాక్ డౌన్ కబుర్లను నెటిజన్లతో పంచుకున్నాడు. క్రికెట్ గురించి తన ఫేవరెట్ ప్లేయర్ గురించి తెలిపాడు. భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ #Helo లైవ్‌లో ముచ్చటించాడు. ఈ సందర్భంగా పలు విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. లాక్‌డౌన్ సమయంలో ఇంట్లో భార్యకు సాయం చేస్తున్నట్లు తెలిపాడు. 2004లో పాక్ పర్యటనలో ఆడిన ఇన్నింగ్స్ తన ఫేవరెట్ ఇన్నింగ్స్ అని కైఫ్ తెలిపాడు. ఇండియన్ టీ20 లీగ్‌లో ఢిల్లీకి కోచ్‌గా వ్యవహరించడం గొప్ప అనుభమన్నాడు. ‘దాదా ముక్కుసూటి మనిషి. తక్కువ సమయంలో చాలా మంచి నిర్ణయాలు తీసుకునేవాడు. కరోనా కారణంగా క్రికెట్‌ని చాలా మిస్సవుతున్నాం. మహేంద్ర సింగ్ ధోనీకి నేను అభిమానిని. టీ20 ప్రపంచకప్ గురించి మాట్లాడుతూ... కంగారూల గడ్డపై జరుగుతుంది కాబట్టి ఆసీస్ జట్టుకు అవకాశం ఉంది. హార్దిక్, పాండ్య, రోహిత్ లాంటి ఆటగాళ్లు ఉన్న భారత జట్టు కూడా ఫేవరెట్ జట్టే.’ అని కైఫ్ అన్నాడు.

2002లో యువరాజ్ సింగ్‌తో కలిసి దిగిన ఓ ఫొటోను కైఫ్ అభిమానులకు చూపించాడు. ప్లేయర్ ఫిట్‌గా ఉంటే 40 ఏళ్ల వరకు ఆడొచ్చని, కేఎల్ రాహుల్ చాలా ఫిట్‌గా ఉంటాడని చెప్పాడు. సక్సెస్‌కి షార్ట్ కట్ ఉండదు. సక్సెస్ దక్కించుకోవాలంటే ఎంతో కష్టపడాలి, కొన్ని త్యాగాలు కూడా చేయాలని కైఫ్ చెప్పాడు. భారత్ తరఫున ఆడేందుకు ఎంతో మంది వేచి చూస్తున్నారు. లక్ష్మీపతి బాలాజీ, యువరాజ్ సింగ్ తమ హయాంలో ఎంతో ఫిట్‌గా ఉండేవారని తెలిపాడు. అనంతరం తన లవ్ స్టోరీ గురించి చెప్పాడు.
First published: May 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading