• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • MOHAMMED AZHARUDDIN SAYS HYDERABAD IS ABSOLUTELY CAPABLE IN HANDLING AND CONDUCTING IPL 2021 SRD

IPL 2021 : కేటీఆర్ కు మద్ధతు తెలిపిన అజారుద్దీన్.. హైదరాబాద్ కు సత్తా ఉందంటూ ట్వీట్..

IPL 2021 :  కేటీఆర్ కు మద్ధతు తెలిపిన అజారుద్దీన్.. హైదరాబాద్ కు సత్తా ఉందంటూ ట్వీట్..

మహ్మద్ అజారుద్దీన్ (ఫైల్ ఫోటో)

IPL 2021 : ఐపీఎల్ 2021 హైద‌రాబాద్‌లో నిర్వ‌హించేలా బీసీసీఐపై ఒత్తిడి తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నాలు మొదలయ్యాయ్. ఇప్పటికే హైదరాబాద్ లో ఐపీఎల్ నిర్వ‌హించాలంటూ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇప్ప‌టికే బీసీసీఐని కోరిన విష‌యం తెలిసిందే.

  • Share this:
    ఐపీఎల్ 2021 హైద‌రాబాద్‌లో నిర్వ‌హించేలా బీసీసీఐపై ఒత్తిడి తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నాలు మొదలయ్యాయ్. ఇప్పటికే హైదరాబాద్ లో ఐపీఎల్ నిర్వ‌హించాలంటూ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇప్ప‌టికే బీసీసీఐని కోరిన విష‌యం తెలిసిందే. తాము తీసుకున్న కొవిడ్ క‌ట్ట‌డి చ‌ర్య‌ల కార‌ణంగా హైద‌రాబాద్‌లో చాలా త‌క్కువ కేసులు న‌మోద‌య్యాయని, ఐపీఎల్ నిర్వ‌హించ‌డానికి తాము పూర్తి స‌హాయ స‌హ‌కారాలు అందిస్తామ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఇప్పుడు హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు మ‌హ్మ‌ద్ అజారుద్దీన్ కూడా కేటీఆర్‌కు మ‌ద్ద‌తు తెలిపారు. కేటీఆర్ చేసిన విజ్ఞ‌ప్తికి నేను స‌పోర్ట్ చేస్తున్నాను. బీసీసీఐ ఆదేశాల ప్ర‌కారం ఐపీఎల్‌ను నిర్వ‌హించే సామ‌ర్థ్యం క‌చ్చితంగా హైద‌రాబాద్‌కు ఉంది. బ‌యో సెక్యూర్ బ‌బుల్‌ను మేము సిద్ధం చేస్తామ‌ని ఆయ‌న ట్వీట్ చేశారు. ఈ సీజ‌న్ ఐపీఎల్ కోసం బీసీసీఐ ఆరు న‌గ‌రాల‌ను షార్ట్‌లిస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే అందులో హైద‌రాబాద్ పేరు మాత్రం లేదు. ఢిల్లీతోపాటు కోల్‌క‌తా, చెన్నై, బెంగ‌ళూరు, ముంబై, అహ్మ‌దాబాద్ న‌గ‌రాల‌ను షార్ట్‌లిస్ట్ చేశారు. అయితే ఈ న‌గ‌రాల‌తో పోలిస్తే నిజానికి హైద‌రాబాద్‌లోనే కొవిడ్ కేసులు చాలా త‌క్కువ‌గా ఉన్నాయి. ఇదే అంశాన్ని ప్ర‌స్తావిస్తూ ఐపీఎల్‌ను హైద‌రాబాద్‌లో నిర్వ‌హించాల‌ని కేటీఆర్ ఆదివారం ట్వీట్ చేశారు.

    రెండేళ్ల క్రితం ఓపెనింగ్, క్లోజింగ్ సెరిమనీలకు ఆతిథ్యం ఇచ్చిన హైదరాబాద్‌కు ఈ సారి కనీసం ఒక్క మ్యాచ్‌ కూడా ఎంపిక చేయకపోవడంపై తెలుగు రాష్ట్రాల్లోని క్రికెట్ అభిమానుల్లో నిరాశ వ్యక్తం అవుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఐపీఎల్ 2021 మ్యాచ్‌లు ఏప్రిల్ 11 నుంచి జూన్ 6 వరకూ జరగనున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి, నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత పాంత్రంలో ఎన్నికల నేపథ్యంలో.. ఆరు సిటీల్లో మాత్రమే ఐపీఎల్ 20221 మ్యాచ్‌ల్ని నిర్వహించాలని బీసీసీఐ ప్రణాళిక సిద్ధం చేసిందని సమాచారం. అయితే ఆ ఆరు సిటీల జాబితాలో హైదరాబాద్‌కి చోటు దక్కలేదు.


    ఇటీవల ముగిసిన వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాంచైజీ కనీసం ఒక్క హైదరాబాద్ ఆటగాడిని తీసుకోలేదు. దీంతో ఖైరదాబాద్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఐపీఎల్ మ్యాచ్‌ల్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. అంతేకాక హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్‌లో అంతర్గత కుమ్ములాటలు, కరోనా వైరస్ వ్యాప్తి అంశాల్ని పరిగణలోకి తీసుకుని హైదరాబాద్‌ని బీసీసీఐ పక్కనపెట్టినట్లు సమాచారం.
    Published by:Sridhar Reddy
    First published:

    అగ్ర కథనాలు