WorldCup 2019 : షమీ సరికొత్త రికార్డు.. మిచెల్ స్టార్క్‌ రికార్డు బద్దలు..

షమీ మంచి ఫామ్‌లో ఉన్న నేపథ్యంలో తదుపరి ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్‌కు కూడా అతన్నే కొనసాగించాలని టీమిండియా మాజీ కోచ్,మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే సలహా ఇచ్చాడు.

news18-telugu
Updated: June 28, 2019, 9:07 AM IST
WorldCup 2019 : షమీ సరికొత్త రికార్డు.. మిచెల్ స్టార్క్‌ రికార్డు బద్దలు..
మహమ్మద్ షమీ (File Photo)
news18-telugu
Updated: June 28, 2019, 9:07 AM IST
ప్రస్తుత వరల్డ్‌కప్‌లో మంచి ఫామ్ మీదున్న టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ.. తన ఖాతాలో ఓ రికార్డును జమ చేసుకున్నాడు. విండీస్‌పై మ్యాచ్‌లో 4వికెట్లు సాధించడం ద్వారా.. ప్రపంచకప్‌ చరిత్రలోనే అతి తక్కువ మ్యాచ్‌లలో 25 వికెట్లు సాధించిన బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ప్రపంచకప్ టోర్నీల్లో మొత్తం 9 మ్యాచ్‌లలో షమీ 25 వికెట్లు సాధించాడు. తద్వారా ఇప్పటివరకు ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ పేరిట ఉన్న రికార్డును తన పేరు మీద లిఖించుకున్నాడు. స్టార్క్ 10 మ్యాచ్‌లలో 25వికెట్ల ఫీట్ సాధించాడు. ఆ తర్వాతి స్థానాల్లో న్యూజిలాండ్ పేసర్లు బౌల్ట్, టిమ్ సౌథీ, దక్షిణాఫ్రిక స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ ఉన్నారు. వీరంతా ప్రపంచకప్ టోర్నీల్లో 11 మ్యాచ్‌లలో 25 వికెట్లు సాధించారు. ఇక శ్రీలంక పేసర్ లసిత్ మలింగ్ వీరి తర్వాతి వరుసలో ఉన్నాడు. ప్రపంచకప్ టోర్నీల్లో 12 మ్యాచ్‌లలో 25 వికెట్లు సాధించాడు.

కాగా, ఆఫ్ఘన్‌పై హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగిన షమీ.. విండీస్‌తో మ్యాచ్‌లోనూ నాలుగు వికెట్లు కూల్చి భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆదిలోనే క్రిస్ గేల్‌ను ఔట్ చేసి విండీస్‌కు గట్టి షాక్ ఇచ్చాడు. మొత్తం 6.2ఓవర్లు బౌలింగ్ చేసిన షమీ కేవలం 16 పరుగులు మాత్రమే సమర్పించి 4 వికెట్లు పడగొట్టాడు. షమీ మంచి ఫామ్‌లో ఉన్న నేపథ్యంలో తదుపరి ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్‌కు కూడా అతన్నే కొనసాగించాలని టీమిండియా మాజీ కోచ్,మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే సలహా ఇచ్చాడు. ప్రస్తుతం గాయంతో బాధపడుతున్న భువీ.. ఒకవేళ కోలుకుంటే షమీని టీమ్ నుంచి తప్పిస్తారా? లేక ముగ్గురు పేసర్లతో టీమిండియా బరిలో దిగుతుందా? అన్నది వేచి చూడాలి.

First published: June 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...