హోమ్ /వార్తలు /క్రీడలు /

Rohit Sharma : కైఫ్ ఏంటి.. రోహిత్ ను ఇంత మాట అనేశాడు.. ఆ విషయంలో జాగ్రత్త అంటూ వార్నింగ్..

Rohit Sharma : కైఫ్ ఏంటి.. రోహిత్ ను ఇంత మాట అనేశాడు.. ఆ విషయంలో జాగ్రత్త అంటూ వార్నింగ్..

Rohit Sharma : రాబోయే టీ20 ప్రపంచకప్ ను దృష్టిలో ఉంచుకుని టీమిండియా మార్పులు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయ్. బ్యాటింగ్ ఆర్డర్ లో కూడా ప్రయోగాలు జరుగుతున్నాయ్.

Rohit Sharma : రాబోయే టీ20 ప్రపంచకప్ ను దృష్టిలో ఉంచుకుని టీమిండియా మార్పులు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయ్. బ్యాటింగ్ ఆర్డర్ లో కూడా ప్రయోగాలు జరుగుతున్నాయ్.

Rohit Sharma : రాబోయే టీ20 ప్రపంచకప్ ను దృష్టిలో ఉంచుకుని టీమిండియా మార్పులు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయ్. బ్యాటింగ్ ఆర్డర్ లో కూడా ప్రయోగాలు జరుగుతున్నాయ్.

  రోహిత్ శర్మ (Rohit Sharma) సారథ్యంలో టీమిండియా (Team India) దుమ్మురేపుతోంది. విండీస్ ను వన్డే, టీ20 సిరీస్ ల్లో క్లీన్ స్వీప్ చేసి ఊపు మీదున్న రోహిత్ సేన.. లంకతో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. ప్రస్తుత సిరీస్‌లో (Ind Vs Sl) భారత జట్టు తన ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూనే ఉంది. రాబోయే టీ20 ప్రపంచకప్ (T20 Worldcup 2022) ను దృష్టిలో ఉంచుకుని టీమిండియా మార్పులు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయ్. శ్రీలంకతో టీ20 సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ను వన్ డౌన్ లో పంపడం మాస్టర్ స్ట్రోక్ అని చెప్పొచ్చు. టీ20 సిరీస్‌లో కోహ్లీ (Virat Kohli) కి విశ్రాంతినిచ్చారు. ప్రస్తుతం ఇదే విషయమై.. టీమిండియా మాజీ ఆటగాడు.. ప్రస్తుత కామెంటేటర్ మహ్మద్‌ కైఫ్‌ (Mohammed Kaif) టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

  రోహిత్‌ పట్టిందల్లా బంగారమే అవుతోందంటూ కొనియాడాడు. తన అద్భుతమైన కెప్టెన్సీతో జట్టుకు విజయాలు అందిస్తున్నాడని కితాబిచ్చాడు. కాగా టీ20 ప్రపంచకప్‌-2021 తర్వాత పొట్టి ఫార్మాట్‌ సారథ్య బాధ్యతలు చేపట్టిన రోహిత్‌ శర్మ ఖాతాలో వరుస విజయాలు చేరుతున్నాయి.ఇప్పటికే హిట్‌మ్యాన్‌ నేతృత్వంలో న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేసి.. శ్రీలంకతో సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.

  ఇక ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే నామమాత్రపు మూడో టీ20లోనూ విజయం సాధించడం పక్కాగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రోహిత్‌ శర్మకు సోషల్‌ మీడియా వేదికగా ప్రశంసలు వెల్లువెత్తుతుతున్నాయి. ఈ క్రమంలో మహ్మద్‌ కైఫ్‌ హిట్‌మ్యాన్‌ది గోల్డెన్‌ టచ్‌ అంటూ ఆకాశానికెత్తడం విశేషం.

  ఈ మేరకు... "రోహిత్‌ శర్మకు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చేటపుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు అతడు పట్టిందల్లా బంగారమే అవుతోంది. శ్రేయస్‌ను మూడో స్థానంలో పంపడం, ఆటగాళ్లను రొటేట్‌ చేయడం, బౌలింగ్‌ విభాగంలో మార్పులు. ప్రతి అడుగు వ్యూహాత్మకమే! మాస్టర్‌ స్ట్రోక్‌ " అంటూ కైఫ్‌ ట్వీట్‌ చేశాడు. ఇక ఇందుకు నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్‌ బ్యాట్‌ ఝలిపిస్తే ఇంకా బాగుండేది అని కామెంట్లు చేస్తున్నారు.

  ఇది కూడా చదవండి : సచిన్ పెద్ద మనసు.. చిన్ని ప్రాణాన్ని కాపాడిన క్రికెట్ గాడ్.. వైరల్ వీడియో..

  అయితే, లంకతో రెండో టీ20 మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ కేవలం ఒకే ఒక్క పరుగు చేసి అవుటైన సంగతి తెలిసిందే. అతడికి జోడీగా ఓపెనింగ్‌కు దిగిన ఇషాన్‌ కిషన్‌ కూడా 16 పరుగులు మాత్రమే చేశాడు. ఇక వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌ 44 బంతుల్లోనే 74 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సంజూ శాంసన్‌ ఫర్వాలేదనిపించగా... ఆఖర్లో జడేజా కేవలం 18 బంతుల్లోనే 45 పరుగులు(నాటౌట్‌) సాధించి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

  First published:

  Tags: Cricket, India vs srilanka, Rohit sharma, Team India

  ఉత్తమ కథలు