మహ్మద్ ఆమిర్ పై షోయబ్ అఖ్తర్ ఫైర్...దేశం పట్ల నీ కృతజ్ఞత ఇదేనా అని విమర్శ..

పాకిస్థాన్ క్రికెట్ భవిష్యత్తు సంక్లిష్టంగా ఉన్న సమయంలో ఆమిర్ లాంటి సమర్థత ఉన్న క్రికెటర్లు టెస్టు ఫార్మాట్ నుంచి తప్పుకోవడం తగదని అన్నారు. టీ20 మ్యాచుల మోజులో కేవలం 4 ఓవర్ల స్పెల్ కే పరిమితమై అదే క్రికెట్ అనుకుంటే పొరపాటని హితవు పలికారు.

news18-telugu
Updated: July 27, 2019, 8:49 PM IST
మహ్మద్ ఆమిర్ పై షోయబ్ అఖ్తర్ ఫైర్...దేశం పట్ల నీ కృతజ్ఞత ఇదేనా అని విమర్శ..
మహ్మద్ ఆమిర్, షోయబ్ అఖ్తర్ (ఫైల్ చిత్రం)
  • Share this:
పాకిస్థాన్ పేస్ బౌలర్ మహ్మద్ ఆమిర్ టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పడంతో వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. కేవలం 27 సంవత్సరాలకే టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవడాన్ని మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ తప్పుపట్టారు. అంతేకాదు టెస్టు క్రికెట్ నుంచి తప్పుకొని లిమిటెడ్ ఓవర్ క్రికెట్ మోజులో ఆడతాను అనేవారిని సెలక్టర్లు అన్ని ఫార్మాట్లకు దూరంగా ఉంచాలని అక్తర్ సూచించారు. ఒక వేళ తాను సెలక్టర్ అయితే ఆ పనే చేస్తానని అన్నారు. అంతేకాదు, పాకిస్థాన్ క్రికెట్ భవిష్యత్తు సంక్లిష్టంగా ఉన్న సమయంలో ఆమిర్ లాంటి సమర్థత ఉన్న క్రికెటర్లు టెస్టు ఫార్మాట్ నుంచి తప్పుకోవడం తగదని అన్నారు. టీ20 మ్యాచుల మోజులో కేవలం 4 ఓవర్ల స్పెల్ కే పరిమితమై అదే క్రికెట్ అనుకుంటే పొరపాటని హితవు పలికారు. అతి చిన్న వయస్సులోనే మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో ఇరుక్కున్నప్పుడు దేశమంతా అతడికి అండగా నిలిచిందని, అలాంటి దేశానికి ఆమిర్ చూపించే కృతజ్ఞత ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. అయితే ఈ అంశంపై ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సైతం దృష్టి సారించాలని అక్తర్ ఈ సందర్భంగా కోరారు.First published: July 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>