ఇందూరు బిడ్డ నిఖత్ జరీన్ (Nikhat zareen) 52 కేజీల విభాగంలో ప్రపంచ బాక్సింగ్ విజేతగా నిలిచి బంగారు పతకం (Gold medal) సాధించింది. టర్కీలోని (Turkey) ఇస్తాంబుల్లో గురువారం జరిగిన సీనియర్ మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ (World Women Boxing Championships Finals) లో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. నిఖత్ జరీన్ 3-2 తేడాతో థాయ్‌లాండ్ దేశానికి చెందిన జిటింగ్ జుటామస్ పై గెలిచి బంగారు పతకాన్ని సగర్వంగా సొతం చేసుకుంది. నిఖత్ విజయంతో నిజామాబాద్ (Nizamabad) జిల్లా లోని నాయకులు, క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavita) కూడా నిఖత్ జరీన్‌ను అభినందించారు. గతంలో ఆమెతో కలిసి దిగిన ఫొటోను ట్విటర్‌లో షేర్ చేసిన కవిత.. ‘‘మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ గెలిచిన నిజామాబాద్ బిడ్డ నిఖత్ జరీన్‌కు శుభాకాంక్షలు (Wishes). నిన్ను చూసి మేమంతా గర్విస్తున్నాం’’ అని భావోద్వేగంతో ట్వీట్ చేశారు.
Congratulations to the daughter of Nizamabad @nikhat_zareen on winning the Women's World Boxing Championship. We all are proud of you Girl !🥊🇮🇳 pic.twitter.com/Ig6fuRDJGg
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 19, 2022
నిఖత్ జరీన్ విశ్వ విజేత (world champion)గా నిలవడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (CM KCR) హర్షం వ్యక్తం చేశారు. బంగారు పతకాన్ని సాధించిన జరీన్ కు సీఎం శుభాకాంక్షలు (Cm KCR Wishes) తెలిపారు. భారత కీర్తి పతాకాన్ని విశ్వ క్రీడావేదిక మీద ఎగరేసిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ ను సీఎం కేసిఆర్ (Telangana CM KCR) మనస్ఫూర్తిగా అభినందించారు.
నిఖత్ జరీన్ విజయం తెలంగాణ కే గర్వ కారణం
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో నిజామాబాద్ ముద్దు బిడ్డ నిఖత్ జరీన్ బంగారు పతకం సాధించడం హర్షణీయమని రాష్ట్ర రోడ్లు భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Minister vemula Prashant Reddy) అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..‘‘ జరీన్ ఘన విజయంతో తెలంగాణ, నిజమాబాద్ జిల్లా కీర్తి ప్రతిష్టలు, ప్రపంచం నలుదిశలా మరింతగా వ్యాపించనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం క్రీడలు,క్రీడాకారులను అన్ని విధాలా ఆదుకుంటుందని,ప్రోత్సహిస్తున్నది చెప్పడానికి జరీన్ విజయమే అందుకు నిదర్శనం. నిజామాబాద్ జిల్లాకే గర్వకారణం మైన జరీన్ కు వ్యక్తిగతంగా లక్ష రూపాయల నగదు ప్రోత్సాహకం అందిస్తా. రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా నిఖత్ జరీనాకు అన్ని రకాల సహాయ సహకారాలు,ప్రోత్సాహం అందేలా చొరవ తీసుకుంటా.. జరీన్ కు, ఆమె కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, జిల్లా ప్రజలకు బాక్సింగ్ అసోసియేషన్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు” అని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Boxing, Kalvakuntla Kavitha, Nizamabad