Home /News /sports /

MIZORAM WOMEN CRICKET TEAM MAKES WORST RECORD IN SENIOR WOMENS T20 LEAGUE PS

9 రన్స్‌కే ఆలౌట్, 9 మంది డకౌట్.. పరుగుల్లో 3 ఎక్స్‌ట్రాలే

ఐసీసీకి వివిధ దేశాల్లోని దర్యాప్తు సంస్థలతో స్నేహబంధం ఉంది. ఇప్పుడు ఇంటర్ పోల్‌తో ఒప్పందం ద్వారా అందులోని 194 సభ్యదేశాలతో మరింత మెరుగైన సంబంధాలు ఏర్పడతాయని ఐసీసీ తెలిపింది.

ఐసీసీకి వివిధ దేశాల్లోని దర్యాప్తు సంస్థలతో స్నేహబంధం ఉంది. ఇప్పుడు ఇంటర్ పోల్‌తో ఒప్పందం ద్వారా అందులోని 194 సభ్యదేశాలతో మరింత మెరుగైన సంబంధాలు ఏర్పడతాయని ఐసీసీ తెలిపింది.

క్రికెట్‌లో ఇదో కొత్త రికార్డు. కాదు కాదు.. చెత్త రికార్డు. కొత్తయినా, చెత్తయినా.. రికార్డు రికార్డే. అలాంటి రికార్డును సొంతం చేసుకుంది మిజోరం మహిళా క్రికెట్ జట్టు. ఘోరాతి ఘోరమైన ఆటతీరుతో ఓటమిలో చరిత్ర సృష్టించింది.

    అంతర్జాతీయ మ్యాచ్ కాకపోయినా అవాక్కయే ప్రతిభ కనబర్చింది మిజోరం మహిళా క్రికెట్ జట్టు. ఒక జట్టు రెండంకెల స్కోరుకు పరిమితమైతేనే.. అది ఘోరమైన ప్రదర్శనగా ముక్కున వేలేసుకుంటారు క్రికెట్ ప్రేమికులు. అలాంటిది తాజాగా సీనియర్ ఉమెన్స్ టీ20 లీగ్‌లో భాగంగా మిజోరం మహిళా క్రికెట్ జట్టు ప్రదర్శన చూస్తే షాకవ్వాల్సిందే. లీగ్‌లో భాగంగా మిజోరం- మధ్యప్రదేశ్ జట్లు తలపడగా.. ఈ మ్యాచ్‌లో మిజోరం జట్టు.. కేవలం 9 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.

    మిజోరం జట్టు చేసిన 9 పరుగుల్లో.. ఒక్క బ్యాట్స్ ఉమన్ భాగస్వామ్యం మాత్రమే ఉంది. మిగతా 9 మంది.. ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. అందరూ డకౌట్‌గానే వెనుదిరిగారు. పుదుచ్చేరిలోని పల్మైరా క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఈ మ్యాచ్‌ జరిగింది.  ఓపెనర్లు సహా 5వ స్థానం వరకు.. బ్యాట్స్‌ఉమెన్లంతా.. పరుగులేమీ చేయకుండా వెనుదిరిగారు. ఐదో స్థానంలో క్రీజులోకి వచ్చిన అపూర్వ భరద్వాజ్.. జట్టు ఖాతాను తెరిచింది. 24 బంతులు ఎదుర్కొన్న ఆమె.. 25వ బంతికి సిక్స్ కొట్టింది. ఆ తర్వాత మరో భారీ షాట్‌కు ప్రయత్నించి.. పెవిలియన్‌కు చేరింది. దీంతో మిగితా వాళ్లు సైతం ఆమెను అనుసరించారు. పరుగులేమి చేయకుండా వెనుదిరిగారు. మరో మూడు పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో రావడంతో.. జట్టు స్కోరు 9కి చేరింది. లీగ్‌లో భాగంగా బుధవారం కేరళతో జరిగిన మ్యాచ్‌లోనూ మిజోరం జట్టు ఇలాంటి ప్రదర్శనే చేసింది. కేవలం 24 పరుగులకు చాప చుట్టేసింది.
    First published:

    తదుపరి వార్తలు