హోమ్ /వార్తలు /క్రీడలు /

Cricket : రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన మిథాలీ రాజ్.. అదే తనకు చివరి మ్యాచ్ అట

Cricket : రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన మిథాలీ రాజ్.. అదే తనకు చివరి మ్యాచ్ అట

రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన మిథాలీ రాజ్ [PC : BCCI]

రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన మిథాలీ రాజ్ [PC : BCCI]

టీమ్ ఇండియా (Team India) మహిళా జట్టు వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ (Mithali Raj) తన రిటైర్మెంట్‌పై (Retirement) క్లారిటీ ఇచ్చింది. గత కొన్ని నెలలుగా కేవలం వన్డే క్రికెట్‌కు మాత్రమే పరిమితం అయిన మిథాలీ ఈ ఏడాదితో 21 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ పూర్తి చేసుకున్నది. ఆమె రిటైర్మెంట్‌పై గతంలో చాలా సార్లు వార్తలు వచ్చినా ఏనాడూ స్పందించలేదు. కానీ ఇప్పుడు మిథాలీనే స్వయంగా తన వీడ్కోలుపై స్పష్టత ఇచ్చింది. 2022లో న్యూజీలాండ్‌లో జరిగే మహిళల వన్డే ప్రపంచ కప్ (one day World Cup) తనకు చివరిదని తేల్చి చెప్పింది. '1971 ది బిగినింగ్ ఆఫ్ ఇండియాస్ క్రికెటింగ్ గ్రేట్‌నెస్' అనే పుస్తకాన్ని వర్చువల్ పద్దితిలో ఆవిష్కరించిన మిథాలీ.. తన కెరీర్ గురించి పలు విషయాలు వెల్లడించింది. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టి ఇప్పటికి 21 ఏళ్లు పూర్తయ్యిందని.. ఇక తాను క్రికెట్‌కు వీడ్కోలు పలకాల్సిన సమయం ఆసన్నమైందని ఆమె చెప్పింది. అందుకు వన్డే వరల్డ్ కప్ సరైన సమయం అని తాను భావిస్తున్నట్లు చెప్పింది.

తన 20 ఏళ్ల కెరీర్ మొత్తం ఒక ఎత్తైతే 2020 ఏడాది మరో ఎత్తని అన్నారు. ఎన్నో ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్న తనకు గత ఏడాది చేది జ్ఞాపకాలను మిగిల్చిందని మిథాలీ చెప్పింది. 'ప్రస్తుతం ప్రపంచమంతా విపత్కర పరిస్థితులను ఎదుర్కుంటున్నది. ముఖ్యంగా క్రీడాకారులు ఈ సమయంలో కూడా తమ ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాల్సి వచ్చింది. అదెంత ముఖ్యమో తెలుసు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఎంత కష్టమైన పనో నాకు అర్దం అయ్యింది. కెరీర్ చరమాంకానికి చేరుకున్న పరిస్థితుల్లో నేను మరింత కష్టపడాల్సి వచ్చింది. వన్డే ప్రపంచకప్ కంటే ముందు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ పర్యటనలు ఉన్నాయి. వాటి కోసం శారీరికంగానే కాకుండా మానసికంగా కూడా ధృఢంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇందుకోసం ఎంతో కష్టపడుతున్నాను' అని మిథాలీ చెప్పుకొచ్చింది. వన్డే వరల్డ్ కప్ కోసం తాను ఒక్కదానినే కాకుండా సహచర క్రికెటర్లు అందరూ సమాయాత్తం అవుతున్నారని.. వారికి కూడా అదెంత ముఖ్యమైన టోర్నీలో తెలుసని అన్నారు.


ప్రపంచ మహిళా క్రికెట్‌లో లేడీ సచిన్ అని పిలువబడే మిథాలీ రాజ్ తన కెరీర్‌లో 10 టెస్టులు, 214 వన్డేలు, 89 టీ20 మ్యాచ్‌లు ఆడారు. వన్డేల్లో 7 వేల పరుగుల మైలు రాయి దాటిన ఏకైక మహిళా క్రికెటర్‌గా రికార్డులకు ఎక్కారు. 10 టెస్టుల్లో 663 పరుగులు, 89 టీ20 మ్యాచ్‌లలో 2364 పరుగులు చేసింది. తన కెరీర్‌లో మొత్తం 8 సెంచరీలు, 76 అర్దసెంచరీలు నమోదు చేసింది.

First published:

Tags: Bcci, Cricket, Mithali Raj, Team India

ఉత్తమ కథలు