హోమ్ /వార్తలు /క్రీడలు /

T20 World Cup: యువరాజ్ రికార్డు సమం చేసిన మార్ష్, హాజెల్‌వుడ్.. ఆస్ట్రేలియా మోగించిన రికార్డులు ఏంటో తెలుసా?

T20 World Cup: యువరాజ్ రికార్డు సమం చేసిన మార్ష్, హాజెల్‌వుడ్.. ఆస్ట్రేలియా మోగించిన రికార్డులు ఏంటో తెలుసా?

ఫైనల్లో రికార్డులే రికార్డులు

ఫైనల్లో రికార్డులే రికార్డులు

Yuvraj Record: ఐసీసీ వరల్డ్ కప్‌లలో ఇప్పటి వరకు యువరాజ్ పేరు మీదు ఉన్న అరుదైన రికార్డును ఆస్ట్రేలియా క్రికెటర్లు మిచెల్ మార్ష్, జోష్ హాజెల్‌వుడ్ సమం చేశారు. ఆ వివరాలేంటో ఒకసారి చూడండి.

యూఏఈ, ఒమన్ వేదికలుగా నిర్వహించిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) 2021 చాంపియన్లుగా (Champions) ఆస్ట్రేలియా (Australia) నిలిచింది. వన్డే వరల్డ్ కప్‌లో 5 సార్లు చాంపియన్లుగా నిలిచి తిరుగు లేని రికార్డు కలిగిన ఆసీస్.. పొట్టి ప్రపంచ కప్ గెలవడానికి మాత్రం 14 ఏళ్లు పట్టింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా మొత్తం ఐసీసీ (ICC) కప్పుల సంఖ్య 8కి పెరిగింది. వన్డే వరల్డ్ కప్‌ను 1987, 1999, 2003, 2007, 2015లో గెలిచింది. ఇక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని 2006, 2009లో గెలవగా.. తాజాగా టీ20 వరల్డ్ కప్ తమ ఖాతాలో వేసుకుంది. కాగా ఆస్ట్రేలియా 2015 వన్డే వరల్డ్ కప్, 2009 చాంపియన్స్ ట్రోఫీ, 2021 టీ20 వరల్డ్ కప్‌ల ఫైనల్స్‌లో ప్రత్యర్థి న్యూజీలాండ్ జట్టే కావడం గమనార్హం. ఇక ఈ రోజు ఆస్ట్రేలియా గెలవడంతో మరికొన్ని అరుదైన రికార్డులు కూడా నమోదయ్యాయి.

ఐసీసీ అండర్-19, వన్డే, టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్లలో ఉన్న ఏకైక క్రికెటర్‌గా యువరాజ్ సింగ్ రికార్డును తాజాగా మిచెల్ మార్ష్, జోష్ హాజెల్‌వుడ్ సమం చేశారు. యువరాజ్ సింగ్ 2000లో అండర్19 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్, 2007లో టీ20 వరల్డ్ కప్ జట్లతో సభ్యుడిగా ఉన్నాడు. ఇక మిచెల్ మార్ష్, జోష్ హాజెల్‌వుడ్ 2010 అండర్19 వరల్డ్ కప్, 2015 వన్డే వరల్డ్ కప్, 2021 టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యులుగా ఉండి ఈ రికార్డును సమం చేశారు.

మరోవైపు వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీలో వరుసగా ఒకే ప్రత్యర్థిని ఎదుర్కున్న జట్టుగా ఆస్ట్రేలియా మరోరికార్డును కూడా సాధించింది. అంతకు ముందు 1979 వన్డే వరల్డ్ కప్, 2004 చాంపియన్స్ ట్రోఫీ, 2016 టీ20 వరల్డ్ కప్‌లలో వెస్టిండీస్ జట్టు ఇంగ్లాండ్‌ను ఓడించింది.


మరికొన్ని విశేషాలు..

టీ20 వరల్డ్ కప్‌ ఫైనల్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు

2007 - ఇర్ఫాన్ పఠాన్ (3/16)

2009 - షాహిద్ అఫ్రిది (54 నాటౌట్, 1/20)

2010 - క్రెయిగ్ కీస్విట్టర్ - (63)

2012 - మార్లొన్ సామ్యుల్స్ - (78, 1/15)

2014 - కుమార సంగక్కర - (52 నాటౌట్)

2016 - మార్లొన్ సామ్యుల్స్ - (85 నాటౌట్)

2021 - మిచెల్ మార్ష్ - (77 నాటౌట్)

టీ20 వరల్డ్ కప్‌లలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్స్

2007 - షాహిద్ అఫ్రిది

2009 - తిలకరత్నే దిల్షాన్

2010 - కెవిన్ పీటర్సన్

2012 - షేన్ వాట్సన్

2014 - విరాట్ కోహ్లీ

2016 - విరాట్ కోహ్లీ

2021 - డేవిడ్ వార్నర్

First published:

Tags: ICC, T20 World Cup 2021, Yuvraj Singh

ఉత్తమ కథలు