యువ క్రికెటర్ ఆత్మహత్య.. ఐపీఎల్‌లో అవకాశం రాలేదని...

ఐపీఎల్‌కు తాను ఎంపిక కాలేదనే మనస్తాపంతో ఓ యువ క్రికెటర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

news18-telugu
Updated: August 12, 2020, 9:30 PM IST
యువ క్రికెటర్ ఆత్మహత్య.. ఐపీఎల్‌లో అవకాశం రాలేదని...
కరణ్ తివారీ
  • Share this:
ఐపీఎల్‌కు తాను ఎంపిక కాలేదనే మనస్తాపంతో ఓ యువ క్రికెటర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముంబైలో ఈ ఘటన జరిగింది. ముంబై మలాద్‌‌కు చెందిన కరణ్ తివారీ అనే యువకుడు క్లబ్ క్రికెట్ ఆడుతుంటాడు. అతడు కొంతకాలంగా డిప్రెషన్‌తో ఉన్నాడని, ఐపీఎల్‌కు ఎంపిక కాలేదని ఆవేదన చెందినట్టు పోలీసులు చెప్పారు. ఈ క్రమంలో తాజాగా అతడు తన ఇంట్లోనే ఉరి వేసుకుని ప్రాణం తీసుకున్నాడు. చివరగా అతడు తన స్నేహితుడికి ఫోన్ చేసినట్టు తెలిసింది. ఆ ఫ్రెండ్ కరణ్ సోదరికి సమాచారం ఇచ్చాడు. ఆమె కుటుంబసభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పేలోపే ఘోరం జరిగిపోయింది. కుటుంబసభ్యులు అతడి గది తలుపులు బద్దలు కొట్టి చూసేసరికి అతడు ఉరికి వేలాడుతూ కనిపించాడు. వాస్తవానికి బీసీసీఐ నిబంధనల ప్రకారం ఎవరైనా ఐపీఎల్ వేలంలో పాల్గొనాలంటే వారు రాష్ట్రం తరఫున ఆడి ఉండాలి. అయితే, కరణ్ రాష్ట్ర స్థాయిలో ఎప్పుడూ రాణించలేదని, వాఖండే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌ సహా ఇతర ఫ్రాంచైజీల క్రికెటర్లకు నెట్స్ లో బౌలింగ్ చేసే వాడని తెలిసింది. కరణ్ బౌలింగ్ స్టైల్ దక్షిణాఫ్రికా క్రికెటర్ డేల్ స్టెయిన్‌ను పోలి ఉంటుంది. దీంతో అందరూ అతడిని జూనియర్ స్టెయిన్ అని పిలుస్తుండేవారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 12, 2020, 9:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading